Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మనిషి పని ఎందుకు చేస్తాడు-2 - Megaminds

మరో పాశ్చత్య సామాజిక వేత్త మనిషీ పనికి ప్రేరకము మరో విధంగా సూత్రీకరించాడు. వారి పేరు సిగ్మా ఫ్రాయిడ్. ఆయన మనిషికి ఆ ప్రేరకం అతనిలో లైంగిక ...

మరో పాశ్చత్య సామాజిక వేత్త మనిషీ పనికి ప్రేరకము మరో విధంగా సూత్రీకరించాడు. వారి పేరు సిగ్మా ఫ్రాయిడ్. ఆయన మనిషికి ఆ ప్రేరకం అతనిలో లైంగిక వాంఛ గా నిర్ణయించాడు. మనిషికి ఉండే కోరికతో భార్య, పిల్లలు, కుటుంబం అవసరాలు వస్తాయి. దానికోసం మనిషి కష్టపడి సంపాదించాల్సిన పని ఉంటుంది
ఇది కూడా ప్రాధమిక అంశమే అయినా, అయన వర్ణన కొంచం జుగుప్సాకరంగా ఉంటుంది. స్త్రీ పురుష సంబంధం లో ఆ విషయాన్ని అన్ని చోట్లా వాడుతాడు. సమాజం లో ఒక స్త్రీ ఆ అవసరం తీర్చడానికి ఉన్నా, మనకు ఒక స్త్రీ తల్లి, ఒకరు చెల్లి, మరొకరు స్నేహితురాలు, ఇంకా అనేక సంబంధాలుంటాయి.
దీనికి మినహాయింపులు ఉంటాయి. ఒక రామకృష్ణుడు, ఒక వివేకానందుడు, ఒక భీష్ముడు ఇంకా చాలా మంది ఈ పరిధిలోకి రారు. కాబట్టి ఇది కూడా పాక్షిక సూత్రమే.
మరో మహానుభావుడు ఏంజెల్స్ అనే పెద్దమనిషి చెప్పిన సూత్రం ఏమిటంటే, మనిషి తనను అందరూ గొప్ప వాడు అనుకోవాలి అనే తలపు ఉంటుంది. తాను మంచివాడు అనుకోవడం కోసం మనిషి నిరంతరం పని చేయడానికి సిద్ధపడతాడు. ఒక కర్ణుడు తన దాన గుణం లో గొప్ప అనిపించుకోవడం కోసం, తన కవచ కుండలాలు దానం చేసి తన అస్తిత్వం నష్టపోవడానికి కూడా సిద్ధ పడ్డాడు. లాంటివి చెప్పవచ్చు.
త్యాగం, సమర్పణ అనే మాటలు కూడా గొప్పవాడు అనుకోవాలనే అహంకార సంత్రప్తి కోసమే అనడం కొంచం ఇబ్బంది గానే ఉన్నా, సామాన్యులకు అదొక ప్రేరణ కావచ్చు. కాబట్టి ఇదీ పాక్షిక సత్యమే కాని లోకులందరిని ఈ సూత్రం తో కట్టేయలేము.
ఈ మూడు విషయాలు సూక్ష్మంగా తెలియ చేసిన పూజనీయ ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ గారు, మరి రంతి దేవుడు లాంటి వారు కూడా ఈ లోకం లో ఉన్నారు కదా, వారిని ఈ మూడు సూత్రాలు బంధించ లేవు అని నా 2వ సంవత్సరం శిక్షా వర్గాల్లో(1983లో) వివరించారు. ఆ కథ కమామిషు రేపు.
ప్లీజ్ షేర్, ఎందుకంటె ఇది అందరూ ఆలోచిస్తారు.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments