మనిషి శరీరం కొరకు, మానసిక ఆనందానికే కాకుండా మరో విషయాన్ని సంతృప్తి పరచడానికికూడా మనిషి పని చేస్తాడు. మన శరీర కోరికల్ని, మానసిక కోరికల కొర...
మనిషి శరీరం కొరకు, మానసిక ఆనందానికే కాకుండా మరో విషయాన్ని సంతృప్తి పరచడానికికూడా మనిషి పని చేస్తాడు. మన శరీర కోరికల్ని, మానసిక కోరికల కొరకు పని చేయాలో, వద్దో చెబుతుంది. వాటిని విశ్లేషిస్తుంది. ఒక్కోసారి అదే పై రెండింటిని డొమినాట్ చేస్తుంది. చేసే పద్ధతులు చెబుతుంది. సులువుగా చేసే ఆలోచన నిస్తుంది. దీన్నే బుద్ధి అంటారు. మెదడు దీన్ని నిర్దేశిస్తుందంటారు.
ఏదైనా సరిగా చేయక పోతే బుద్ధి లేదా ? అని ప్రశ్నిస్తారు. మనిషి దీని ఆదేశం వినడం మంచి చేస్తుంది. దురుపయోగం చేసే వారు కూడా ఉంటారు. అందుకే పై మూడింటి సంతులనం చాలా అవసరం.
రావణాసురుడికి సీత పై మనసు బుద్ధిని తొక్కేసింది. నాశనం అయినాడు. కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడీకి మనసు బుద్ధి పై ఆధిపత్యం చేసింది. ధర్మానికి కట్టుపడ్డ శ్రీ కృష్ణుడి కి మనసు కంటే బుద్ధి ఆధిపత్యం ఎక్కువ. అందుకే నిరంతరం గెలుపు. ఆ బుద్ధికి కూడా ధర్మం మార్గదర్శనం ఉన్నవాడే మంచి చేస్తాడు.
ఒక శాస్త్ర వేత్త పరిశోధన, ఒక సామాజిక వేత్త, ఒక న్యాయకోవిదుడు, ఒక పారిశ్రామికవేత్త, ఒక కవి, వ్రుత్తి నిపుణుడు నిరంతరం కష్ట పడటానికి ప్రేరణ బుద్ధి.
No comments