దేశాన్ని, అంటే ప్రజలను రెండు మతాల రాజ్యాలుగా చీల్చిన వాడు ఇంగ్లిష్ వాడు. తలవొగ్గి త్వరగా స్వతంత్రం కై తల వంచింది కాంగ్రెస్. 70 ఏళ్ళ...
దక్షిణాది ద్రావిడ ఉద్యమం పేరుతో చీల్చ ప్రయత్నాలు జరిగాయి.
పంజాబ్ లో ఖాలిస్తాన్ ఉద్యమం లేచి అనిగి పోయింది.
కాశ్మీర్ రావణ కాష్టం కాలుతూనే ఉంది.
అస్సాం లో బోడో ఉద్యమం జరిగి ఆగింది.
ఇది చాలదన్నట్లు ఉత్తర దక్షిణాలు. కులాల విభజనలు. భాషలతో యుద్దాలు. ప్రాంతాల పంచాయతీలు.
అన్నీ దేశం అభివృద్ధికి కాదు. తాత్కాలిక ఓటుబ్యాంకు రాజకీయాలకు. పరిపాలన చిక్కించుకొని అవినీీతి సంపాదనకు. ఇవన్నీ రాజకీయ నాయకుల ఎత్తులు.
ఇందునుండి లాభం లేదు. మనం ఎందుకు పావులం అవుతున్నాం.
విద్యార్థులు, పత్రికల వాళ్లకి, సామాన్య ప్రజలకి ఎందుకు వీటినే ప్రచారం చేస్తున్నారు. అందరూ ఈ గందరగోళం లో దోచుకోవడానికే ప్రయత్నమా?
దేశం లో భిన్నత్వం అనే రాజకీయం వదిలేద్దాం. ఏకత్వం సాధిద్దాం. మనం ఈ విషయాలు మాట్లాడ వద్దు. ప్రచారం చెయ్యొద్దు. ప్రచారం చేసే వాళ్ళని మూలకు తొద్దాం. టెర్రరిజం కి కూడా మతం రంగు.
తిడితే వాళ్ళు బలవంతులవుతున్నారు. మనం తిట్టొద్దు.
మనం ఏకత్వం మాట్లాడుదాం. మనది ఒక దేశం భారత దేశం. మనమంతా ఒకే జాతి భారత జాతి. మనకందరికీ ఒకే సంస్కృతిి, భారత సంస్కృతి. మనదంతా ఒకే వారసత్వం భారత వారసత్వం.
No comments