Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

తూర్పు గోదావరి జిల్లా అంటే నాకు అభిమానం - megaminds

నేనెప్పుడూ తూర్పు గోదావరి లో ఉండలేదు.  నేను పుట్టింది వనపర్తి, పాలమూరు జిల్లా పెరిగింది నల్లగొండ, వరంగల్, భాగ్యనగర్.  ఉద్యోగం ఏలూరు, పశ్చిమ...

నేనెప్పుడూ తూర్పు గోదావరి లో ఉండలేదు.  నేను పుట్టింది వనపర్తి, పాలమూరు జిల్లా పెరిగింది నల్లగొండ, వరంగల్, భాగ్యనగర్.  ఉద్యోగం ఏలూరు, పశ్చిమ గోదావరి.  ప్రచారక్ రంగారెడ్డి, గుంటూరు, విజయ నగరం,భాగ్యనగర్.  వ్యాపారం భాగ్యనగర్. మా అమ్మ కర్నూల్, మా ఆవిడ ప్రకాశం జిల్లా. మా ఇంట్లో కోడళ్ళు, అల్లుడు కూడా ఆ జిల్లా వారు కాదు.

కాని నాకు తూర్పు గోదావరి అంటే ఎందుకో ఇష్టం.  నేను గుంటూర్ లో ఉండగా ఆంద్ర ప్రదేశ్ పటం చూస్తే సగం  జిల్లాలలో ఈ జిల్లా నుండి ప్రచారకులు ఉండేవారు.  గొప్ప ఆశ్చర్యంగా ఉండేది.  శ్రీకాకుళమ్ లో ఇంద్రగంటి శ్రీనివాస్ ఉండేవాడు, విజయనగరం సుందర రామం, విశాఖ లో కొంత భాగం రామ్మాదవ్,అనకాపల్లి లో నాని, తూర్పు గోదావరి లో సాయి బాబ,పశ్చిమ గోదావరి భాగవతుల శ్రీనివాస్,  కృష్ణ జిల్లా శ్రీధర్, నెల్లూరు లో రవి గారు, చిత్తూర్ లో శ్యామ్ ప్రసాద్ జి, గుంటూరు లో ఈరంకి వారు, రాయల సీమ లో శిష్ట్లా నరసింహం గారు, భాగ్యనగర్ లో భాస్కర్జీ, విష్ణుభట్ల రామ్ చందర్జీ, ఇన్దూరులో సాకా నాగేశ్వర్ రావు, వీరంతా జిల్లా ప్రచారక్ ఆపై.  భీమవరం లో శివకుమార్, మంగళగిరి కుడిపూడి రామారావు, ఇంకా నేను మర్చిపోయిన ఎందరో ఖండ ప్రచారకులు.  అనకాపల్లి విజయకుమార్ కూడా ఉండొచ్చు.

ఎక్కడ చూసినా వాళ్ళే ఉండేవారు.  ఇంత మంది పూర్తి సమయ కార్యకర్తల పుట్టినిల్లు ఆ జిల్లా ఉండేది. ఒక్కో సారి ఒక్కో జిల్లా అలా ఉంటుందని అంటుండేవారు.  నేను 82-88 కాలం చెప్పాను.  అప్పట్లో నేను సోమయాజులు నాగేశ్వర రావు గారు కూడా అదే జిల్లా అనుకునేవాడిని.  నేను విజయనగరం వెళ్ళాక వారు మా విభాగ్ ప్రచారక్ గా ఉన్న సమయం లో తెలిసింది వారు విజయవాడ అని.  నాకంటే చాలా పెద్దవారేకాని అందరితో కలిసి పోయి, చాలా సన్నిహితులు గా ఉండేవారు.

వారిని చనువుగా అడిగాను, మీరు ఆ జిల్లా లో ఎంత కాలం ఉన్నారని?  వారు నవ్వుతూ పుష్కర కాలం అన్నారు.  తరువాత వారు పూర్వాంధ్ర సహా ప్రాంత ప్రచారక్ గా, ప్రస్తుతం శివాజీ స్ఫూర్తి కేంద్రం, శ్రీ శైలం చూస్తున్నారు. నాకే కాదు చాలామందికి వారు తూర్పు  గోదావారే అని దృఢ నమ్మకం.  అందరికీ వారు ప్రేరణా శ్రోతస్సు.

పై వారందరూ నాతో చాలా సన్నితంగా ఉన్నవారే.  అందుకే నాకు ఆ జిల్లా అంటే చాలా గౌరవం, ప్రేమ.

మీ జిల్లాల నుండి వచ్చిన ప్రచారకులు సూచీ మీ దగ్గర ఉందా?  ఎవరో ఒకరు సేకరిస్తే ఆనందం.

నమస్సులతో మీ నరసింహ మూర్తి.

Ee vyasam  వ్రాసాక మరి కొన్ని పేర్ల ఫోన్ లో చెప్పారు.  సర్వశ్రీ రెమెల్ల వెంకటేశ్వర్ల, డాక్టర్ జనార్ధన్, బిళ్ళకుర్తి నాగేశ్వర్ రావు,  ద్విభాష్యం హానుమన్నారాయణ, కూసుమంచి వెంకన్న, కామవరపు మోహన కృష్ణ, వేధుల రాంసాయి వీరు కూడా ఆ సమయంలో ప్రచారకులు.

క్షమించాలి పప్పు విశ్వనాథ్!  మీరు కూడా తూ గో జి.  వ్రాయడం మర్చిపోయాను.  ఇంకేవారిని మర్చిపోయానో వ్రాయి.

విశ్వనాథ్ ప్రచారక్ గా వచ్చింది భాగ్యనగర్ నుండి కదా!

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments