కోస్తా లో రాయలసీమలో పనిచేసి దేశపాండేజి భాగ్యనగర్ వచ్చారు. సంఘం ఎక్కడ పని చేయమంటే, అక్కడ, ఈ పని చేయమంటే ఆ పని శక్తినంతా కేంద్రీకరించి పనిచే...
కోస్తా లో రాయలసీమలో పనిచేసి దేశపాండేజి భాగ్యనగర్ వచ్చారు. సంఘం ఎక్కడ పని చేయమంటే, అక్కడ, ఈ పని చేయమంటే ఆ పని శక్తినంతా కేంద్రీకరించి పనిచేసే హిందూ సంఘటనా కార్యకర్తనే కదా ప్రచారక్ అనేది. స్వంత కుటుంబం అనే వ్యవస్థ వదిలి పెద్ద హిందూ కుటుంబ పని చూసేవాడే ప్రచారక్. వారికి దక్షిన్ భాగ్ ఇచ్చారు. ఓల్డ్ సిటీ, ఇబ్రహీం పట్నం, హయత్ నగర్, శంషాబాద్ ఖండలు వారి కార్యక్షేత్రం. చార్మినార్ లో కార్యాలయం. ఒక చేతక్ స్కూటర్ వారి ఆస్తి. విశాల సామ్రాజ్యం. హుషారుగా పని. అప్పట్లో మత కల్ల్లోలాలు కూడా బాగానే ఉండేవి. మాకు సంవత్సరానికి పాఠశాల పిల్లల్లా సెలవులు. కర్ఫీయు కాలాన్ని వారు సెలవులుగా నవ్వుతూ చెప్పేవారు.
పాత బస్తీ పిల్లలు వారిని పాండన్న అనేవారు.
జీవితమే సమాజానిది. పేరు వారు పెట్టుకుంటే మాత్రం ఏమి తప్పు? మాననీయ సోమయ్యగారి ఇంటి పేరు సొంపల్లి గా మార్చిన సమాజం వీరి పేరుని పాండన్నగా మార్చేసింది. వారి గూర్చి మన క్షేత్ర ప్రచారక్ శ్యామ్ గారు వ్రాస్తే అనేక సంఘటనలు వస్తాయి. నేను 8 నెలలు వారి వద్ద పనిచేశాను. మా జిల్లాకి ఉండే త్రిమూర్తులు పృత్వి రాజ్ గారు, పాండన్న, శ్యామ్జీ. జిల్లా అంత ఒక ఊపు ఊగింది.
జీవితమే సమాజానిది. పేరు వారు పెట్టుకుంటే మాత్రం ఏమి తప్పు? మాననీయ సోమయ్యగారి ఇంటి పేరు సొంపల్లి గా మార్చిన సమాజం వీరి పేరుని పాండన్నగా మార్చేసింది. వారి గూర్చి మన క్షేత్ర ప్రచారక్ శ్యామ్ గారు వ్రాస్తే అనేక సంఘటనలు వస్తాయి. నేను 8 నెలలు వారి వద్ద పనిచేశాను. మా జిల్లాకి ఉండే త్రిమూర్తులు పృత్వి రాజ్ గారు, పాండన్న, శ్యామ్జీ. జిల్లా అంత ఒక ఊపు ఊగింది.
నేనొక నగర బౌద్ధిక్ ప్రాముఖ్ గా ఉండేవాడిని. బర్కత్పుర పీ యఫ్ ఆఫీస్ లో ఉద్యోగం. ఒకసారి పూజనీయ సుదర్శనజీ తో సమావేశం మర్చిపోయి, ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసాను. మరుసటి రోజు ఇంటికి వచ్చారు? ఎందుకు రాలేదు? అడిగారు. అయ్యో నాకు గుర్తు లేదండీ అన్నాను. అఖిల భారతీయ అధికారులతో సమావేశం మర్చి పోయావా? ఇక మేమెక్కడ కనపడతం నీకు అంటూ అరగంట ఆగకుండా తిట్టారు. తల నెలకేసి వినడం తప్ప నేను మాట్లాడలేదు. టీ కూడా తీసుకోకుండా కోపంగా వెళ్ళిపోయారు. పెద్దయనకి కోపం తెప్పించినందుకు నా మీద నాకు కోపం వచ్చింది.
మరి రెండు రోజులకు ఆదివారం ఇంటికి వచ్చారు. ఇవ్వాళ ఏమి మూడిందో అనుకుంటూ నమస్కరించాను. మంచి నీళ్ళు తాగి, పాంటు వేసుకో బయటికి పోదాం అన్నారు. నా ప్రాణాలు పైకే పోయాయి. మారు మాట్లాడకుండా బండి ఎక్కాను. చైతన్య పురి రామాలయం దగ్గర ఆపి బండి స్టాండ్ వేసి. నీవు ప్రచారక్ గా వస్తున్నవాట, అడిగారు. నేను ఔను అన్నాను. మరి నాకు ఎందుకు చెప్పలేదు? నిన్న భాగయ్యగారు చెప్పారు. ఎప్పుడోస్తున్నావు? ఉగాది నుండి . నిన్న తిట్టినదుకు బాధ పడలేదుగా? లేదండీ. వారు ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నారు. నిన్న ప్రళయ కాల రుద్రుడు. ఈ రోజు ఎంత మధుర ప్రేమికుడు. మనసులో ఏమీ ఆగదు(ఉండదు)
నేను ప్రచారక్ గా వెళ్ళాక, మా ఇంటి కి వచ్చి మా అమ్మ కోపం భరించి, భోజనం అడిగి పెట్టించుకొని ఇంట్లో వాతావరణం మార్చి వెళ్ళేవారు. మా నాన్నగారికి వారంటే అంతో ఆప్యాయం. మా నాన్నగారి చివరి రోజుల్లో కొంత పిచ్చిగా ప్రవర్తించేవారు. వారి కోసం దేశపాండే గారు రాగానే మామూలు అయిపోయేవారు. నవ్వుతూ మాట్లాడేవారు. వారొస్తే ఇంట్లో అందరం వారి చుట్టే. ఇలా ఎన్ని ఇళ్ళో వారికి. ఎవర్ని కదిలించినా పాండన్న అంటే అంతే. వారి ఆప్యాయత అలా ఉండేది.
నేనిప్పుడు ఆపేయాల్సిందే. వ్రాయలేను. రేపు పూర్తి చేస్తాను.
నేనిప్పుడు ఆపేయాల్సిందే. వ్రాయలేను. రేపు పూర్తి చేస్తాను.
No comments