మనిషి శరీరం, మనసు, బుద్ధి యొక్క ఆనందం కొరకు మాత్రమె కాకుండా ఆత్మా ఆనందం కొరకు కూడా పనిచేస్తాడు. అసలు ఆత్మా ఉందా? అని కొందరి అనుమానం. అది ఇ...
మనిషి శరీరం, మనసు, బుద్ధి యొక్క ఆనందం కొరకు మాత్రమె కాకుండా ఆత్మా ఆనందం కొరకు కూడా పనిచేస్తాడు. అసలు ఆత్మా ఉందా? అని కొందరి అనుమానం. అది ఇంద్రియాలతో గుర్తింపబడనిది కదా? నిజమే బుద్ధి, మనసు కూడా ఇంద్రియాలు స్పృశించేవి కావు కదా, అవి ఉన్నాయ న్నప్పుడు ఇది లేదేందుకు? భగవాన్ రమణ మహర్షి ఇలా అంటారు, ఈ శరీరం 'నీది' అయితే 'నీవు' ఎవరు అని. ఇది ప్రతీ శరీరం లో, చరాచర సృష్టి లో చేతన నిచ్చే శక్తి అనవచ్చు.
మనమ్ సర్కస్ లో కూర్చున్నాము, సేఫ్ ప్లేస్లో. ఉయ్యాలలు ఊగుతో వేగంగా గాలిలో క్షణం ఒక పట్టు వదిలి మరో పట్టుకు వెళ్తారు.
ఆ క్షణం మనం కూడా ఉద్విఙ్నననికి గురి అవుతాము. ఆ ఊపులో పడితే వాడు పోతాడు. మన బంధువు కాదు. నీ పైన పడ డు. మన శరీరానికి, మనసుకి, బుద్ధికి ఇబ్బంది లేదు. మరి మనం ఎందుకీ ఉలిక్కి పడ్డాము. వాడిలో నీలో మాత్రమె కాదు, జంతుజాలం లో,ప్రకృతి లో, సృష్టి లో కూడా ఒక బంధం ఉంది. అదే ఏకత్వ రూపం. దాన్నే ఆత్మ అంటారు. అదే పరమేశ్వరుని అంశ. దానికి కూడా ఆనందం ఉంటుంది. దాన్ని పొందడానికి కూడా మనిషి కష్ట పడతాడు. ఇలా స్థూలం నుండి సూక్ష్మంలోకి ప్రయాణం మనిషి ఎదుగుదలా స్థాయి.

సమస్త మానవాళి కోసం, ఈ ప్రకృతి కోసం, ఈ సృష్టి కోసం ఆ పరమేష్ఠి కోసం మనిషి పని చేస్తాడు. పశుత్వం నుండి మానవత్వం, అక్కడ నుండి దైవత్వం వైపుకి ఆలోచన ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. కొందరు ఒక దగ్గరే ఆగిపోతారు. అది వారి స్థాయి. మరో రకంగా చెప్పాలంటే, భౌతిక అవసరాల కోసం, తరువాత కళల కోసం, తరువాత విజ్ఞానం, తత్వ శాస్త్రాల కోసం తరువాత బుద్ధికి అతీతమైన సూక్ష్మ స్థితి అయిన పరమాత్మ స్థితికి ఎదగడానిక్ మనిషి పని చేస్తాడు.
పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతా వాదం లో మొదటి భాగం ఇన్నాళ్లు వ్రాసాను. ఇంకా ముందు కూడా వ్రాస్తాను. శ్రద్ధ ఉన్నవాళ్ళే చదవండి.
ఈ పేజీలు చాలా ఆలోచనాత్మకంగా జాతీయభావాలు కలవిగా ఉన్నాయి. నిర్వాహకునకు ధన్యవాదాలు
ReplyDelete