దేశం లో విచిత్రమైన విశ్లేషనాలు జరిగాయి. దేశం లో వివిధ మాతృ భాషల వారు పరస్పరం శత్రువులు. ఇంగ్లిష్ మాత్రమె దేశాన్ని కలిపేది అన్నారు. ఇది మన ...
దేశం లో విచిత్రమైన విశ్లేషనాలు జరిగాయి. దేశం లో వివిధ మాతృ భాషల వారు పరస్పరం శత్రువులు. ఇంగ్లిష్ మాత్రమె దేశాన్ని కలిపేది అన్నారు. ఇది మన వారు, మన పరిపాలకులే మన లో ఏకత్వం కాకుండా భిన్నత్వం ప్రచారం చేశారు.
మరికొందరు ఇంగ్లిష్ కాకపోతే మనం అభివృద్ధి చెందలేము. టెక్నాలోజీ ఇంగ్లిష్ పుస్తకాల్లోనే ఉంది. నిజమే సంస్కృతం మనం నేర్పలేదు. అందులో ఉండే శాస్త్రం మనకు తెలియదు. కాని సైన్స్ అంతా ఇంగ్లీషే అనుకుంటే, ప్రపంచం లో జపాన్, జర్మనీ టెక్నాలోజి లో బాగా అభివృద్ధి చెంది ఉండింది. అక్కడ సైన్స్ ఇంగ్లిష్ లో నేర్చులోలేదు. ప్రపంచంలో ఇంగ్లిష్ నేర్చుకున్న దేశాలు బ్రిటిష్ రూల్ లో ఉన్న పిడికెడు దేశాలు, ఆ భాషను తమ భాషగా చేసుకున్న అమెరికా మాత్రమె. ఫ్రాన్స్, ఇటలీ లాంటి క్రైస్తవ దేశాల్లో ఇంగ్లిష్ రాదు. అయినా అవి సైన్స్ లో ముందంజలో ఉన్నాయి.
వాళ్ళ వాదనే సరియైనది అనుకున్నా, సైన్స్ చదువుకునే వారు ఇంగ్లిష్ నేర్చుకుంటారు. వేరే విషయాలు లోకల్ భాష లో నేర్చుకోవచ్చు. ఇంత ప్రేమ మన శత్రువుల భాష పై ఎందుకు? కామన్వెల్త్, హై కమిషియనర్ పద్ధతిలో మన శత్రువులతో ఇంత గరిష్ట సంబంధాలు ఎందుకు?
ఇది కేవలం ఆత్మా న్యూనతా భావమేనా లేక నల్ల ఇంగ్లిష్ వారిని మన దేశం లో తయారు చేయాలనే ఇంగ్లిష్ వారి కుట్ర లో మన నాయకులు చేతులు కలిపారా?
వివిధత్వం ఎదుగుదలకు చిహ్నంగా మన నాయకులు గ్రహించలేదు. అది మనకు అడ్డంకిగా అనిపించింది. అప్పుడు 30 కోట్ల జనాభా, అంటే 60 కోట్ల కష్టించి చేతుల్లా కనపడలేదు. 30 కోట్ల పొట్టలు, 60 కోట్ల తినే చేతులు ఎందుకు కనపడ్డాయి? 1000 సంవత్సరాల బానిసత్వం పోయిన జాతిలో ఉత్సాహం నింపి దేశం కోసం పని చియించాలనే నాయకత్వానికి అన్నీ అడ్డంకులే ఎందుకు కనపడ్డాయి.
వెరసి పని చేసేది ప్రభుత్వం, మీరు ఓటు వేసి నిద్రపోండి, అనడం లో ఆలోచించడం పరిశ్రమించడం చేయమని చెప్పడం కూడా అడ్డంకిగా ఎందుకు కనపడింది.? 120 కోట్ల చేతులు పని చేసి ఉంటె దేశం త్వరగా అభివృద్ధి చెందేది. స్వాభిమానం నింపలేని పరిపాలకుల వల్ల దేశం కుంటుబడింది. ప్రభుత్వమే అన్నీ చేస్తుందనే నిస్క్రియులను మనం ఎందుకు తయారు చేసాం. నేటికీ ఉద్యోగాలు ప్రభుత్వమే ఇవ్వాలనే విచిత్ర కోరికల తో బ్రతికే జాతీయులను ఎందుకు తయారు చేసాం?
No comments