విజయ శీల మైన RSS గూర్చి వినినప్పుడు, యువకులకి అందులో భాగం కావాలని అనిపిస్తుంటుంది. అక్కడ సిద్ధాంత చర్చల్లో పాల్గొందామని అనిపిస్తుంది. ...
విజయ శీల మైన RSS గూర్చి వినినప్పుడు, యువకులకి అందులో భాగం కావాలని అనిపిస్తుంటుంది. అక్కడ సిద్ధాంత చర్చల్లో పాల్గొందామని అనిపిస్తుంది. కాని సంఘ పని ప్రత్యక్షంగా దిగిన తరువాత అందులో పని భాగం ఎక్కువ ఉంటుంది.
సంఘానికి వెళ్ళే ఎవరికైనా ఇది అనుభవం లోకి వస్తుంది. శాఖలు ఎక్కువగా ఉదయం సాయంత్రం ఉంటాయి. అందులో 45 నిమిషాలు శారీరక్, 10 నిమిషాలు బౌద్ధిక్ అంశాలయిన పాత, సుభాషితం, అమృతవచనం, చిన్నకథ, చిన్న చర్చ మరి 5 నిమిషాల ప్రార్థన, ముగింపు ఉంటాయి. ఆది వారం నాడు పెద్ద కథ, చర్చ, బౌద్ధిక్ లాంటి అంశాలు 30 నిమిషాలుంటాయి. ఇదంతా ఉత్సాహవంతం అయిన వాతావరణం లో జరుగుతాయి.
శాఖ అయిపోగానే వచ్చేవిషయం ఎంత మంది ని తీసుకు రావడానికి ప్రయత్నం చేశారు?
ఎంత మంది వచ్చారు. రేపు ఎంత మంది వస్తారు? ఎలా ప్రయత్నం చేస్తారు?
ఆదివారం పని ఎలా? ఉత్సవాల సంఖ్యప్రయత్నం, యూనిఫామ్ ప్రయత్నం, ఘోష్
ప్రయత్నం, ట్రైనింగ్ క్లాస్ కొరకు సూచీ, ప్రయత్నాలు, కొత్త శాఖ ఎక్కడ ,
ఎలా. దేశ పరమ వైభవ కార్యం లక్ష్యం, పని మనుషుల సంఖ్యాత్మక, గుణాత్మక
అభివృద్ధి. వెంటపడటం, ఉత్సాహం ఇవ్వడం, పని చెప్పడం, ఎంత పూర్తి అయ్యిందని
చర్చించడం. ఇది అందరికి ప్రతీ రోజు పని.
సిద్ధాంత చర్చ ఎప్పుడో ఒకసారి, మనుషుల లెక్కే రోజు. పనిలో రుచి అర్థమయ్యేవారికి ఓకే. కాని ఇదేమి పని అనిపిస్తుంది. 1978 లో వరంగల్ నగర ప్రచారక్ గా వచ్చిన సుబ్రహ్మణ్యం గారు ఉదయం 4.00 గంటలకు చేతక్ పై 10 శాఖల ముఖ్య శిక్షకులను లేపి శాఖకు పిలుచుకు రావలసిన వారిని లేపమని తను ఒక శాఖకు వెళ్ళేవారు. అలా కష్టపడితేనే శాఖలో సంఖ్య, అటువంటి సంఖ్యాయుత శాఖల్లో ఉత్సాహంగా కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో వ్యక్తుల నిర్మాణం.
ఆ జీవితం అందరికీ ఆనందం. పెద్దవారి జీవితాలను చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఆందోళన, హడావుడి అసలు ఉండదు. ఎంతో సహజంగా , కలివిడి గా కలిసి పనిచేసే శిక్షణ. ఇది ఆనందంగా చేయగలిగిన వాడు, జీవితాంతం పని చేస్తాడు. పని చేయడం వచ్చిన వాడికి విజయమే విజయం. ఇది నచ్చితే ఆనందమే ఆనందం.
ఇదొక్కటే మార్గం అన్నాక ఇదే దగ్గరి దారి అనే స్పష్టం అయిన భావాలు వస్తాయి. ఇలా పని చేయడానికి మనం సమయం, శక్తిని ఇవ్వగలమా? పని చేయకుండా దేశం ఎలా మారుతుంది? అదే మనల్ని నడిపిస్తుంది.
మీ అభిప్రాయాలు వ్రాయండి. నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments