మన దేశంలో చాలా కాలంగా చర్చించ బడే విషయం ఏమిటంటే చెడు చేయక పోవడమే గొప్ప విషయం అని. మనుషులు మార్గం ఎంచుకొని ఎదగడానికి విధులు కొన్ని, నిషే...
మన దేశంలో చాలా కాలంగా చర్చించ బడే విషయం ఏమిటంటే చెడు చేయక పోవడమే గొప్ప విషయం అని. మనుషులు మార్గం ఎంచుకొని ఎదగడానికి విధులు కొన్ని, నిషేధాలు కొన్ని రోజూ ఆచరించాల్సినవి ఉంటాయి. విధి అంటే తప్పకుండా చేయాల్సినవి అని, నిషేధం అంటే చేయకూడని పనులు అని. వీటిని మనం ఎంచుకునే లక్ష్యానిక్ వెళ్ళే మార్గం లో మనం అనుసరించే పద్ధతులు. ఇవి మనమే నిర్ణయించుకుంటాము. అనుభవజ్ఞుల జీవన
పద్ధతులనుండి కూడా పొందవచ్చు.
ఎందుకో మన దేశం లో నిషేధాల ప్రచారం బాగా జరిగి, తప్పు చేయక పోవడమే గొప్ప విషయంగా గణింపబడుతుంది. వాడు అబద్ధం ఆడడు, సిగరెట్ తాగాడు లాంటివి గొప్పవిషయాలే అయినా, ఏ మంచి పనులు కూడా చేయాలనే విషయం అవకాశం మేరకు అని తప్పించు కోవడానికే ప్రయత్నిస్తారు. హిందూ సమాజం లో నిషేధాలకు ఉన్న గుర్తింపు విధులకు ఉండవు. మంచి వాడంటే మంచి పనులు చేసే వాడి కంటే చెడు పనులు చేయని వాడని చెప్పడం ఎక్కువ జరుగు తుంటుంది. బానిసత్వమ్ కారణం కూడా ఇటువంటి ఆలోచనలకి అడ్డంకి కావచ్చు.
మంచి చేయాలనే తలపు ఉండే వాడికి లక్ష్యాలు, మార్గాలు కూడా దొరుకుతాయి. దేశం అంటే ప్రజలు కదా! ప్రజలకు సేవ చేయడానికి మంచి చేయడానికి మనం సమయం, బుద్ధి, పని మన డైరీ లో కేటాయిస్తున్నామా? మన పనులకే మనకు తీరిక లేదు కదా! మళ్ళీ మరొకటా అని వద్దులే అనుకుంటాము. ఈ భావాన్ని పక్కన పెడితే యువకులు సమాజానికి చాలా పని చేయవచ్చు. ప్రజలకు మంచి చేయాలనే తలపు దానికి యోజన, నిర్వహణ కు సమయాన్ని, పని చేసే తత్వాన్ని మనకు జీవితం లో భాగంగా చేయ గలగాలి.
ప్రభుత్వవమే అన్ని పనులు చేసేది అని మనకు అనిపిస్తుంది. అది చేయలేక పోతే తిట్టడమే మనం చేసే పెద్ద సామాజిక కార్యంగా మనం అనుకుంటుంటాము. నిజమే ప్రభుత్వం చేసినంత పని మనిషి ఒక్కడు చేయలేదు. కాని వాడి పరిధిలో పనికి వాడు సమయం కేటాయిస్తాడా? కనీసం ఆ దృష్టి మనకు ఉంటుందా? అలా ఆలోచన వస్తే తప్పక చేయగలం. దానివల్ల ఓ పదిమంది బాగుపడతారంటే ఆ మేరకు దేశం బాగుపడ్డట్లే కదా! ఇప్పుడు మీరు చేయగలిగే మంచి పనులు గూర్చి ఆలోచించండి. కామెంట్స్ లో వ్రాయండి. నేను కూడా కొన్ని వ్రాస్తాను. ఇలా చేయవచ్చు అని మీకనిపిస్తే తప్పక చేద్దాం.
No comments