మనకు ఒక అస్తిత్వం, విద్య, తిండి ఇచ్చే సమాజానికి మనమంతా రుణపడి ఉంటాము. దాన్ని మన జీవితం లొనే తీర్చుకోవాలి. మనతో పాటు మరి కొన్ని జీవితాలక...
మనకు ఒక అస్తిత్వం, విద్య, తిండి ఇచ్చే సమాజానికి మనమంతా రుణపడి ఉంటాము. దాన్ని మన జీవితం లొనే తీర్చుకోవాలి. మనతో పాటు మరి కొన్ని జీవితాలకు మనం వెలుగునివ్వాలి. ఇది మన సమస్యల తరువాత చూడాల్సింది
కాదు. ఇది కూడా మన సమస్యలలో ఒక భాగం.
పేద వాడలో సమస్యలు మనం చూస్తేనే అర్థం అవుతుంది. నేను గుంటూరు లో ఒక హరిజనవాడలో అంబేద్కర్ జయంతి ఉత్సవం నిర్వహించడానికి వెళ్ళాము. కుటుంబాలను గౌరవంగా పిలవడానికి స్థానిక మహిళా లాయర్ కుంకుమ భరిణ పట్టుకొని వచ్చింది. గుడిసె లోకి వెళ్ళాము. అక్కయ్య గారు అని పిలిస్తే ఆవిడ భయపడుతూ వచ్చింది. మన లాయర్ గారు మాట్లాడుతూ చీకటిగా ఉంది కొంచం లైట్ వేయండి బొట్టు పెట్టి వెళ్తాము అంది. ఆవిడ కరెంటు లేదు అంది. బయటి స్ట్రీట్ లైట్ వెలుగుతుందే, అని ప్రశ్నించింది. ఆమె సమాధానం చెప్పలేదు. అక్కయ్య గారు మీరు బొట్టు పెట్టండి అన్నాను. సరే అని ఆమె బొట్టు పెట్టి కార్యక్రమానికి ఆహ్వానించింది. అలా మంచి కార్యక్రమం పూర్తి చేసాము. మధ్యలో లాయర్ గారితో పాపం ఆమె కరెంటు లేదంటే కనెక్షన్ లేదని కదా? మీరు బయట ఉందాని చెబుతారు ఏమిటి? కరెంట్ కనెక్షన్ లేదని నేను అనుకోలేదండి, అంటూ బాధ పడింది. గుంటూర్ పట్టణం లో అటు వంటి ఇళ్లకు ఆమె ఇదివరకు వెళ్ళలేదు. సమస్య త్వరగా అర్థం కాలేదు.
అటువంటి గుడిసెలలో కరెంటు లేని ఇల్లే కాదు, పుస్తకాలు లేని చదువులు ఉంటాయి. పచ్చడి కూడా సరిపోని భోజనాలు ఉంటాయి. అవి మనం చూస్తే మనకు సమస్య అర్థం అవుతుంది.
యువకులు దేశ మొత్తం కాదు, మన దగ్గరలో స్లమ్ కి వెళ్తే భార్యా భర్తా కూలీలకి వెళ్ళితే నియంత్రణ లేని పిల్లలు సరైన మార్గం చూపించే వాడు ఉండదు. మనం అటువంటి వాడలలో పిల్లలకి మంచి దేశ భక్తి గీతం, మంచి కథ, మంచి భజన, మంచి నడవడి నేర్పవచ్చు. వారం లో ఒక రోజు కాని రెండు రోజులు కాని ఈ పని నిర్వహించవచ్చు. ఇంట్లో ఎలా చదువుకోవాలో చెప్పవచ్చు. 20 మందిని మనం నియమితంగా కలుస్తుంటే మన సంస్కారాలు వాళ్లకు చేరుతాయి. ఇది దేశ కార్యమే.
R s s ఇటువంటి వేల కార్యక్రమాలు నిర్వహి స్తున్నది. మీరూ నిర్వహించవచ్చు. ఎవరైనా ఉపాధ్యాయుడు దొరికితే లెక్కలు,ఇంగ్లిష్ ట్యూషన్ చెప్పించవచ్చు. మన జీవితం లో 10 మంది బాగుపడ్డా సమాజం లో కొంత బాగుపడి నట్లే కదా దీనికి పెద్ద డబ్బు ఖర్చు ఉండదు. మన తో స్నేహమే వారికి మనమిచ్చే తాయిలం. ఇవి ప్రయత్నం చేసి మీ అనుభవాలు, చూసినవి కూడా ఫేస్ బుక్ లో పెట్టవచ్చు. ఈ అనుభవం మనకు ఎంతో తృప్తినిస్తుంది. అది
చాల మందికి స్ఫూర్తినిస్తాయి.
చాల మందికి స్ఫూర్తినిస్తాయి.
No comments