ఈ దేశ ప్రజలందరూ ప్రత్యక్షంగానో పరోక్షం గానో పన్నులు చెల్లిస్తారు. అవి కేంద్ర, రాష్ట్ర ప్రభువాల చేతుల్లోకి వెళ్తాయి వారు దేశాభి వృద్ది ...
ఈ దేశ ప్రజలందరూ ప్రత్యక్షంగానో పరోక్షం గానో పన్నులు చెల్లిస్తారు. అవి కేంద్ర, రాష్ట్ర ప్రభువాల చేతుల్లోకి వెళ్తాయి వారు దేశాభి వృద్ది కి ప్రణాళికలు వేస్తారు. వాటి కోసం డబ్బు ఖర్చు పెడతారు. అది దేశ కార్యం అంటే ! మరి సామాన్య యువకులు దేశ కార్యం ఎలా చేస్తారు? ప్రభుత్వం మనల్ని బాగా స్వాములు చేయదు కదా అని ఒక మిత్రుడు నా పోస్టింగ్ చూసి అడిగారు. కొంచం గొట్టు ప్రశ్న లా ఉంది కదా!
దేశ కార్యం అంటే దేశమంతా ఒక్కసారిగా చేసే ప్రణాళిక మాత్రమె కాదు. 70 ఏళ్లుగా మన ప్రభుత్వాలు ఆ పని చేస్తున్నా అందరికి ఒక్క సారి చేరదు. చిన్న చిన్న టార్గెట్ లతో వెళ్తుంటారు. 70 ఏళ్లుగా చేస్తున్నా విద్యుత్తు అన్ని గ్రామాలకు చేరలేదు. రిజర్వేషన్ సౌకర్యం ఇస్తున్నా ఇంకా ఆ సౌకర్యం పొందని వారున్నారు. ఇరిగేషన్ ప్రోజెక్స్ కట్టినా ఇంకా నీరు చేరని పొలాలున్నాయి. ఇలా 70 ఏళ్లుగా కష్టపడుతున్న అభివృద్ధి చెందడం చాలా దూరంగానే వుంది. ఆ పని నిరంతరం చేయాల్సిందే.
మరి
సామాన్య యువకులు దేశ కార్యం అంటే ఏమి చేయాలి? ఫండ్స్ ఎక్కడ నుండి?
ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. మనకు సామాజిక ఉద్యమాలు నిర్వహించే వారు కూడా
ప్రభుత్వానికి సమస్య చూపించి అక్కడ ఆలోచించాలని చెప్పటమే. అది దేశ
కార్యమే. కాని అది మాత్రమె దేశ కార్యమని ఇదివరలో చెప్పుకునే వారు.
ఉద్యమాలు నిర్వహించడం లో నాయకుల నిబద్దత సడలి అసంపూర్తిగా అభాసు పాలయినవి
బోలెడు.
యువకుడికి తన పరిధి ఎంత అనేది నిర్ణయించు కుని సమాజ పని చేయాలంటే మరి ఏమి చేయాలి. ప్రభుత్వం ఏమి చేయాలని ఒక ఉచిత సలహా పడేయటం, తప్ప యువకులు ఏమి చేయాలి. గుండెల్లో ఉత్సాహం ఉంటుంది. చేతుల్లో సత్తువ ఉంటుంది, దేశం బాగు పడాలని కోరికా ఉంటుంది. మరి వారు దేశ కార్యం ఎలా చేయగలరు ? ఏమి చేయాలి ? యువత శక్తి సమాజానికి ఎలా ఉపయోగ పడాలి?
చేయని వాడు ఎలాగూ చేయడు. చేద్దామనుకునే వారికి ఎలా , ఏమి చేయాలో చెప్పండి.
మరో వ్యాసం లో నేనూ కొన్ని చెబుతాను. ననస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments