ఇది వారంలో రెండు మూడు వ్యాసాలూ వ్రాసాను. కాని నేడు ఉపరాష్ట్రపతి పదవిని 10 సంవత్సరాలు వెలగబెట్టిన హమీద్ అన్సారీ దేశం లో ముస్లిం సమాజం అభ...
ఇది వారంలో రెండు మూడు వ్యాసాలూ వ్రాసాను. కాని నేడు ఉపరాష్ట్రపతి పదవిని 10 సంవత్సరాలు వెలగబెట్టిన హమీద్ అన్సారీ దేశం లో ముస్లిం సమాజం అభద్రతా భావం గూర్చి మాట్లాడిన తరువాత నేను యువకులంతా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం లో చేరి, శిక్షణ పొంది, ఆ సంస్థ ఎక్కడ దేశ కార్యం చేయమంటే అక్కడ ఆ పద్ధతిని అనుసరించి చేయాలని చెబుతాను.
సంఘం ప్రారంభం నుండి రాజకీయకు, ప్రభుత్వాలకు అతీతంగా పని చెస్తూన్నది. ఈ దేశ యువకులు ప్రఖర దేశ భక్తులుగా తయారు అవ్వాలని, సంఘటిత శక్తి గా ఎదగాలని, అన్ని రంగాల్లో ఈ సంఘ శక్తిని పంపాలని, అక్కడ కూడా జాతీయ సిద్ధాంతాలు, కర్మణ్యత, నిబద్ధత, త్యాగ భావాలు, సమాజం నాది అని తలపు నిర్మాణం చేయడమే ధ్యేయంగా గత 90 సంవత్సరాలుగా పని చేస్తుంది.
అనేక హేళనలను, విరోధాలను ఎదుర్కొని నిలబడింది. పెరిగింది. దేశ వ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా ఈ శక్తిని పెంచింది. సమాజం లో ఆదరణ పెంచుకుంది. దేశం లో ప్రజలు నమ్ము తున్నారు, ప్రశంసిస్తున్నారు. అన్ని సమస్యల పరిష్కారం కోసం సంఘం ఉద్యమించాలని కోరుకుంటున్నారు. ఇది ఆనంద పడే పరిణామమే. కాని దీని శక్తి పెరగడం తో విరోధులు ఏకం అవుతున్నారు. అదీ భయపడాల్సిన పని కాదు. ఎదుర్కోవడానికి శక్తి పెంచుకోవాలి.
దేశం లో పరమ వైభవ స్థితి నిర్మాణం లో అందరి జీవితాలు, వారి శక్తి ఉపయోగ పడాలి. అయితే సంఘం గురించి తెలుసుకోవడం, ప్రశంసించడం వల్ల దేశం లో వాతావరణం కొంత కనపడుతుంది. కాని చేయాల్సిన పని పూర్తి చేయాలంటే యువకుల శక్తి కేంద్రీకరించి శ్రమించాలి. అలా శ్రమించడానికి కొత్త యువకులు నిరంతరం సంఘం లో చేరాలి.
సమాజాన్ని విచ్చిన్నం చేసే శక్తులు కొన్ని దేశం బయట నుండి అయితే మరికొన్ని అంతర్గతమయినవి. కలిసి కొట్లాడుతున్నవి. నీతి నియమాలతో యుద్ధం మరో మలుపు తిరుగుతోంది. ఉప రాష్ట్రపతి లాంటి వాడు కూడా 10 సంవత్సరాల ఏలుబడి తరువాత దిగిపోతూ, రాజ్యాంగ పదవి స్థాయిని కూడా ప్రక్కన పెట్టి, మతపరంగా దేశాన్ని చీల్చ ప్రయత్నం చేస్తున్నారంటే, ఈ సమస్య మూలాల నుండి పెకిలించి వేయడానికి, సమాజం లో అందరికి ఒకే దేశం, ఒకే ప్రజా, ఒకే జాతి, ఒకే చరిత్ర, ఒకే సంస్కృతి, ఒకే ధ్యేయం నిర్మాణం చేయడం మనందరి కర్తవ్యంగా కలిపి నడిపించ గల ప్రచండ శక్తిని పెంచాలి. ఈ జాతి బలం ఈ జాతీయుల జాగృతి, సంఘటిత శక్తి, సత్ శీలం ఉండే కార్యకర్తలే అనే విషయం లో అపనమ్మకం ఏమీ లేదు. దేశం త్వరగా వచ్చే మార్పులకు మనం ఆధారం, వాహకులం కావాలి.
ఇంత ముఖ్యమైన పనిలో మన యోగదానం ఉండాలని తలుచే అందరూ తమ చేయి వేయాలి, కదం తో కదం కలిపి నడవాలి, పదం తో పదం కలిపి పాడాలి. మన ఈ తపః శక్తి దేశాన్ని తప్పక మారుస్తుంది. ఈ యజ్ఞం లో మనమూ సమిధలం అవుదాము. మన మేధస్సును జోడించి ఈ పనిని సుసంప న్నము చేయాలంటే, ఆవులింతలు తీస్తూ కదలడం కాదు. శరావతీ జలపాతం లా దూకాల్సింది ఉంది. అందరూ కదుల్తారు కదూ..
No comments