Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశం లో యువకులు మారుతున్నారు. - megaminds

దేశం లో రాజా కీయ నాయకుల వెంట, కుల సంఘాల నాయకుల వెంట, మత దురహంకారుల వెంట యువకుల సంఖ్య తగ్గుతున్నది. ఈ యెస్ బాస్ పనులు మానేసి స్వంత వృత్త...


దేశం లో రాజా కీయ నాయకుల వెంట, కుల సంఘాల నాయకుల వెంట, మత దురహంకారుల వెంట యువకుల సంఖ్య తగ్గుతున్నది. ఈ యెస్ బాస్ పనులు మానేసి స్వంత వృత్తుల్లో స్థిరపడి డబ్బులు సంపాదించి గౌరవముగా జీవిస్తున్నారు.
గుంపులు గుంపులుగా విభజన వాదుల మూక గోల చేసి తమ పనులు సాధించుకునేవి. ఈ గ్రూప్ లీడర్లను ముట్టు కోవాలంటే పోలీస్ కూడా భయం వేసేది. ఈ అసాంఘిక శక్తులను రాజకీయనాయకుల వత్తాసు కు భయం సృష్టించడం ద్వారా సంకుచిత పనులు పూర్తి చేసుకునే వారు.
ఈ దేశ యువకులకు ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిర పడటానికి చేసే ప్రయత్నాలకు అవకాశం దొరుకుతున్నది. ఓటింగ్ శాతం పెరుగుతున్నది. నిజంగా ఇది హర్షించ వలసిన విషయం. లేని పోనీ అసత్య ప్రచారాలు యువకులను కదిలించలేక పోతున్నాయి. సోషల్ మీడియా లో నిజాలు బహిర్గతం అవుతున్నాయి. పత్రికల పక్ష పాత వైఖరి
సంకుచిత వ్యాఖ్యలు సమాజాన్ని కదిలించడం లేదు. యువకులు నిజానిజాలను విశ్లేషణ చేస్తున్నారు. నాయకులకు యువకుల్లో కదలిక లేదు అని ఎంత గగ్గోలు పెట్టినా మార్పు గమనిస్తున్నారు.
ఇంకా కొన్ని సెక్షన్ల లోమార్పు రావాలిసి ఉన్నా, దేశ భవిష్యత్తు నిర్ణయం చేయడం లో తప్పు దోవ పట్టించే వారికి అవకాశము తగ్గుతున్నది. స్వతంత్రం పేరుతో అక్రమాలను ప్రజలు అర్థం చేసు కుంటున్నారు. వీటన్నిటికి తోడు పోలీస్, సైన్యం, అవినీతి నిరోధక శాఖలకు తమ పని చేసుకోవడం లో అడ్డంకులు తొలగు తున్నాయి.
యువకులు తమ చదువును, సంపాద నను, శాంతియుత జీవనానికి అవసరం అయిన దారులు వెతుక్కుంటూ, దేశం లో మార్పులను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రభుత్వం మాత్రమె అన్ని పనులు చేస్తుందనే భ్రమలు తొలగించుకొని మన స్థాయి పెంచుకోవాలి. దేశం అభివృద్ధి చెందితేనే మనమూ అభివృద్ధి చెందుతామని యువకులు గ్రహిస్తున్నారు.
మీ అభిప్రాయాలు వ్రాయండి.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

1 comment