ఈ ధర్మం అనే పదం రకరకాల అర్థాల్లో వాడబడుతుంది. కాబట్టి కొంచం అర్థం చేసుకోవడం లో ఇబ్బంది ఉంటుంది. కొంత విస్తరణకు ప్రయత్నం చేస్తాను ఒక వస్త...
ఈ ధర్మం అనే పదం రకరకాల అర్థాల్లో వాడబడుతుంది. కాబట్టి కొంచం అర్థం చేసుకోవడం లో ఇబ్బంది ఉంటుంది. కొంత విస్తరణకు ప్రయత్నం చేస్తాను
ఒక వస్తువు లక్షణాలను తెలియ జేసేది దాని ధర్మం గా చెబుతుంటారు. ఒక వస్తువు స్థితి: ఘన, ద్రవ, వాయు స్థితి.
వస్తువు యొక్క రసాయన, భౌతిక ధర్మాలు . విజ్ఞాన శాస్త్రం లో వీటి విషయాలు చెప్పబడతాయి.
వస్తువు యొక్క రసాయన, భౌతిక ధర్మాలు . విజ్ఞాన శాస్త్రం లో వీటి విషయాలు చెప్పబడతాయి.
బిచ్చగాళ్ళు అడిగే దానాన్ని వాళ్ళు ధర్మం చెయ్యి బాబు అంటారు.
న్యాయం చెప్పేవారిని ధర్మాదికారిగా చెబుతారు. తీర్పు చెప్పే వారు చెప్పేది ధర్మం అంటారు. ఇది మరో వాడుక
ఈ రోజుల్లో ప్రతీది ఇంగ్లిష్ నుండి నేర్చు కుంటున్నారు కాబాట్టి దీనికి సరైన పదం వారి దగ్గర లేదు. కాబట్టి వివేకానందుడు విశ్వ మత సభలో వాడిన రిలీజియన్ అనే పదం తర్జునా చేసి ధర్మం అంటే మతం అని వాద బడింది. ఇలా వాడడం వాళ్ళ సెకులరిజం కి తర్జుమా సర్వధర్మ సమ భావన గా చెప్పబడింది. నిజానికి మతం, ధర్మము వేరు వేరు పదాలు. మతం అంటే అభిప్రాయం, నమ్మకం- దీనిపై అంటే భగవంతుడిని చేరే మార్గం అనే ద్రుష్టి తో వాడతారు.
ఇలా రక రకాల అర్థాల్లో వాడినా, అసలు ధర్మం అనే పదానికి అర్థం : ధారాయతి ఇతి ధర్మ అన్నారు. అంటే కలిపి ఉంచునది ధర్మం. ఈ సమాజంలో, వ్యక్తుల మధ్య, సృష్టి, పరమాత్ముడికి మధ్య బంధం తెలియ జేసేది ధర్మము అనవచ్చు. రేపు మరికొంత వ్రాస్తాను..
No comments