Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

చతుర్విధ పురుషార్ధాలు - మోక్షం - megaminds

మనిషిని కేవలం శరీరం, లేదా మనసు, బుద్ధి మాత్రమేనా లేక ఇంకాముందు లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అనే శోధన లో మనిషి ముందుకెళ్లినపుడు చరాచర సృష్టి ల...

మనిషిని కేవలం శరీరం, లేదా మనసు, బుద్ధి మాత్రమేనా లేక ఇంకాముందు లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అనే శోధన లో మనిషి ముందుకెళ్లినపుడు చరాచర సృష్టి లో ఒక సంబంధం అన్నింటిలో ఉండే ఒకే తత్వాన్ని మనం ఆత్మగా గ్రహించాము. మనిషి తన పురుషార్థమల సాధనలో ఆనందం పొందడానికి ధర్మ బద్ధము అయిన అర్థము, కామము లలో సంతోషం పొందుతాడు.
అవికూడా కొంత సాధించిన తరువాత మనిషికి శాశ్వత ఆనందం ఇవ్వలేదు. వాటికి ఒక పరిధి ఉంటుంది. ఈ సాధనలో మనిషి పొందే శాశ్వత ఆనందం వీటికి అతీతంగా ఆలోచించగలిగినప్పుడే పొంద గలుగు తాడు. తను ఈ శరీరం, మనసు, బుద్ధి మాత్రమె కాదని ఈ సృష్టి లో అంతర్లీనంగా అన్నింటిలో ఉండే ఆత్మను దర్శించి అన్నిటిని ఒక పరమాత్మ లో మిళితం చేసే మోక్షం అనే సాధన లోకి మనిషి సహజంగానే వెళ్తాడు. ఆ పరమాత్మలో తనూ, తనలోనే అన్నింటిని చూడగలిగే వాడు ఈ శరీరం, మనసు, బుద్ధి కి అతీతంగా మొత్తం జీవకోటి మూలమైన పరమాత్మ తత్వం లో చూడగలిగే స్థితి మోక్షం అంటారు.
శ్రీ రామకృష్ణ పరమహంస తాను కూర్చు న్న పచ్చికలో తను లీనమై ఉన్న సందర్భం లో దానిపై ఒక ఆవు నదిస్తీ దాని గిట్టల పీడనకు తను గురి అయి బాధ అనుభవించిన సంఘటన చెజెబితే ఎవ్వరూ నమ్మలేదు. వారి ఛాతి పై ఆ గిట్టల గుర్తు చూపించాడట. ఇది. ఆ స్థాయి మనిషి పొందే తదాత్మ్యత ఇందులోని ఆనందం మనిషికి ఇచ్చే ఆనందం, ఆ మోక్ష భావన, తను ఈ శరీరం కాదు, తనలో ఉండే దైవత్వానికి ఒక చిన్న షెల్ మాత్రమె ఈ శరీరం, దీని నంటుకొని ఉండే మనసు, బుద్ధి కి అతీతంగా మనం సాధించే పరమ లక్ష్యం ఈ మోక్షం అని గుర్తించడం ఈ జీవన సోపానం లో చివరి మెట్టు అక్కడ ఈ సృష్టి తో మనిషి లీనం అయ్యే స్థితి మన పురుషార్థాలలో చివరిది అయిన మోక్షం. పాశ్చాత్యులు ఇంత వరకు ఆలోచించలేదు. మనిషిని శరీరం, మనసు బుద్ధి వరకే ఆగిపోవడం ఒక్కోసారి పాక్షికంగా ఒక్క విషయం వరకే ఆలోచించడం వాళ్ళ వారికి అంతులేని జవాబు లేని ప్రశ్నలు తలెత్తు తూనే ఉంటాయి.
దీని సాధనకు గీతా చార్యుడు మనకు మూడు మార్గాలు సూచించాడు. వీటిలో నిరంతరం ముందుకు సాగితేనే మనం చివరి మెట్టుకు చేరుకుంటాం. గీతలో కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు , చేరుకునే ఈ లక్ష్యాన్ని మనం మోక్షం అంటాము. అన్ని కలిపే ఆలోచన చేయగలగాలి. కర్మ విహీన భక్తి ఉన్మాదం లాగానూ, భక్తి లేని కర్మ యాంత్రికంగానూ, రస విహీనంగాను, ఈ రెండు లేని జ్ఞానం కుంటిదిగాను , మిగతా శరీర మనసు బుద్ధి ల ఆనందానికి దూరం చేసేదిగానూ అవుతాయి.
కాబట్టి మానవ సమగ్రాభివృద్ధికి మనిషిలోని శరీర, మానస, బుద్ధి, ఆత్మల ఆనందం కోసం మనం సూచించే నాలుగు పురుషార్థాలను కలిపి ఆలోచించాలి. అప్పుడే అన్నీ కలసిన సమగ్ర ఆనందం మనిషి పొందగలుగుతాడు.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments