Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సంఘ పెద్దలు వారి చతురోక్తులు. - megaminds

స్వర్గీయ చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలియని పాత వారుండరు. వారు ఆంద్ర యూనివర్సిటీ లో తెలుగు ప్రొఫెసర్ గా ఉండే వారు. నిండైన విగ్రహం....

స్వర్గీయ చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలియని పాత వారుండరు. వారు ఆంద్ర యూనివర్సిటీ లో తెలుగు ప్రొఫెసర్ గా ఉండే వారు. నిండైన విగ్రహం. ధోతి, లాల్చీతో తెలుగుదనం ఉట్టిపడుతూ వారు నడుస్తుంటే, మాట్లాడుతుంటే వారిని వదిలి మేముండలేక పోయే వాళ్ళం. విశాఖపట్టణం లో నివాసం.
శని వారం సాయంత్రం బయలుదేరి ఆదివారం పూర్తిగా దూర ప్రాంతాలకు రైలు ప్రయాణం. ఆదివారం శాఖ, కార్యకర్తల సమావేశం, అప్పుడప్పుడు నగరాల్లో పెద్దల సమావేశాలు, బౌద్ధిక్ వర్గలు, కార్యకర్తల ఇళ్ళల్లో భోజనాలు అంతా ఉత్సాహంగా, అందరికి ఉత్సాహంగా సాగేది వారి పర్యటన. వారు చాలా కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యవాహ్, ప్రాంత సంఘచాలక్, క్షేత్ర సంఘ చాలకులు గా పని చేశారు.
ఉపన్యాసాల మధ్యలో గొప్ప ఆనందం కలిగించే చలోక్తులు ఉండేవి. స్పష్టంగా, సూటిగా వారు సంఘ అభిప్రాయాలు చెబుతుంటే అందరు అరటి పండు వలిచి పెట్టినట్లుగా ఉంది అనేవారు. విమర్శలు కూడా హాస్యం పుట్టించేవిగా ఉండేవి.
వాడు ముక్కు సూటిగా వెళ్తాడు, కాని పాపం వాడి ముక్కె వంకర అని వారు అనగానే కూర్చున్న వారు ఘొల్లున నవ్వే వారు. అంటే వాడెప్పుడు వంకర పనులే చేస్తాడంటూ వారు నవ్వుల మధ్య చెప్పేవారు.
ఒకడు స్నేహితుడితో చిన్న సరదా ఒప్పందం ప్రతిపాదించాడట. నీవు వేరు సెనగ పప్పు పట్టుకురా, నేను పొట్టు పట్టుకొస్తాను. కలిపి సగం సగం చేసుకొని, ఎంచక్కా ఊదుకొని తిందాం, అన్నాడట. ఈ సంఘటన చెప్పి మొదటి వాడికి పప్పు సగం అయ్యింది, పొట్టు ఊదుకోవాలి. అదే రెండవ వాడికి అన్నీ లాభాలే. ఇటువంటి ఒప్పందాలు చేసుకోకూడదు అని చెప్పేవారు.
వారు వస్తున్నారంటేనే స్వయంసేవకులు ఎంతో ఉత్సాహంగా పని చేసి, కార్యక్రమాలను విజయవంతం చేసేవారు.
వారితో మీ అనుభవాలు కామెంట్స్ లో వ్రాయండి. కొత్త తరానికి చేరుతాయి.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments