Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సంఘం పై రకరకాల అభిప్రాయాలు. - megaminds

ఉదయం ఒక పెళ్లి లో ఓ పెద్ద మనిషి కలిసాడు. నా మిత్రుడు నా పరిచయం చేస్తూ సంఘానికి గట్టి కార్య కర్త అని చెప్పాడు. వెంటనే అతడు మీరు నిజంగా గొప్...

ఉదయం ఒక పెళ్లి లో ఓ పెద్ద మనిషి కలిసాడు. నా మిత్రుడు నా పరిచయం చేస్తూ సంఘానికి గట్టి కార్య కర్త అని చెప్పాడు. వెంటనే అతడు మీరు నిజంగా గొప్ప దేశ భక్తులండీ అన్నారు. వారి నాన్నగారు కూడా ఒకప్పుడు సంఘానికి వెళ్లిన వారని పాత జ్ఞాపకాలు చెప్పారు.
పూరి శంకరాచార్యులు ఒక సారి స్వయంసేవకుల దేశభక్తి గూర్చి చెబుతూ వీరు శాఖ లో ఉపవిశ అనగానే నేలపై కూర్చుంటారు. అందుకే నెలతో దగ్గరి సంబంధం. మాతృ భూమి తో అంత సంబంధం దేశ భక్తిని పెంచుతుంది అన్నారు.
బోఫోర్స్ కుంభకోణం జరిగిన సమయం లో డబ్బుల స్కాం ఇంకా పరిశోధన లో ఉండింది. ఇంతకీ ఆ గన్స్ సాంకేతికంగా బాగున్నాయా లేక చెత్త సరుకా అని పరీక్షించాలని ఒక పార్లమెంటు సభ్యుల కమిటీ లో ఒక ఎంపీ సంఘ స్వయంసేవక్ కూడా ఉన్నారు. అవి బాగా పని చేస్తున్నాయని రిపోర్ట్ వచ్చింది. ఇది ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్ట్ అనుకూలంగా ఉంటుంది లే అని ఒకరంటే, అందులో సంఘ స్వయంసేవక్ కూడా ఉన్నారురా వాళ్ళు అలా ధృవీకరించారు. నిజమే ఉంటుందిలే అని మరొకరు అనడం నేను రై లు లో ప్రయాణం చేస్తూ విన్నాను. నాకెంతో సంతోషం అయ్యింది.
సంఘం పై అటువంటి అభిప్రాయాలు విన్నప్పుడు స్వయంసేవక్ ఎంతో ఆనంద పడతాడు. కాని అటువంటి వారిని తయారు చేయడం లో ఒక్కొక్కరి పై ఎంత కష్ట పడితే అటువంటి భావాలు వస్తాయో పని చేసే వాళ్లకు తెలుస్తుంది.
రోజు శాఖకు రావడం, ఆదర్శ వంతుల శిక్షణ, అందులో తీసుకునే జాగ్రత్తలు, శిక్షణ పొందే వారికే తెలుస్తాయి. ఎన్ని రోజుల శిక్షణ, శిక్షా వర్గలు, సమావేశాలు, చర్చలు, ఇలా ఎంత మంది తపన పడితేనో ఇటువంటి ఉత్పాదన వస్తుంది.
సంఘ సిద్ధాంతాలు చదువ వచ్చు, మాట్లాడ వచ్చు. కాని ఆచరణాత్మక శిక్షణ ఉంటేనే నిజమైన స్వయసంసేవక్ తయారు అవుతారూ. అది రోజు జరిగే శాఖల్లో పాల్గొంటేనే దొరుకుతుంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments