Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సంఘ ఋషి - స్వర్గీయ దత్తోపంత్ థేంగ్డే జి - megaminds

తను MA LLb చేసి సంఘ ప్రచారకులుగా వచ్చిన దత్తోపంత్ జి కేరళ లో సంఘం విస్తరణకు వెళ్లారు. పూజ్య గురూజీ మార్గదర్శనం తో వివిధ అనుబంధ సంస్థలు ప్ర...

తను MA LLb చేసి సంఘ ప్రచారకులుగా వచ్చిన దత్తోపంత్ జి కేరళ లో సంఘం విస్తరణకు వెళ్లారు. పూజ్య గురూజీ మార్గదర్శనం తో వివిధ అనుబంధ సంస్థలు ప్రారంభించి జాతీయ స్థాయిలో వాటిని నిలబెట్టారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారితో చాలా సార్లు కలిసి సంఘ భావాలు పంచేవారు.
కార్మిక రంగ సంస్థ BMS ప్రారంభించే ముందు INTUC కార్యాలయంలో పని చేశారు. కార్య సాధకుడికి పని నేర్చుకోవడం లో హెచ్చు తగ్గులు లేవు. కార్మిక రంగం అంటూనే ఎర్ర జెండా, కమ్యూనిస్టు భావాలుగా మాట్లాడే సమయం అది. రష్యా,చైనా లలో ఆ పార్టీ వివిధ ప్రయోగాలు, వాటిని గొప్పగా చెప్పుకునే రోజుల్లో, భారతీయ ఆత్మ తో సంస్థ పురుడోసుకుంది.
కార్మికులు ఒక వర్గం దాని పోరాటం పెట్టు బడి దారుల పై అంటూ గ్రూప్ లు కట్టే సమయంలో, World Labour Unite, అనే నినాదం అందరి నోళ్ళల్లో నానేది.
దత్తోపంత్ జి కార్మికుల్లో దేశభక్తి తెచ్చి భారత్ మాతకీ జై అనిపించారు. వర్గం పక్కనపెట్టి వారి మాటను మార్చి Labour, unite the world అన్నారు. కార్మికులకు విడగొట్టడం కాదు ప్రపంచాన్ని ఏకం చేయమని గొప్ప లక్ష్యం ఇచ్చారు.
Nationalise the Industry, కమ్యూని
ష్టుల నినాదాన్ని మార్చి Nationalise the labour అని వారిని దేశ భక్తులు చేశారు. యాజమాన్యం, కార్మికులు అనే భావన పక్కన పెట్టి యాజమాన్యం లో కాశర్మికులు అంటూ Labourise the Industry అనే కొత్త ఆలోచన నిచ్చారు. దాని ద్వారా Industrialise the Nation
అని దేశం లో పరిశ్రమలు పెరిగే ఆలోచన నిచ్చారు. నదీ ప్రవాహం మార్చిన ఆది శంకరాచార్యుడు వారు. ఈ రోజు దేశం లో అతి పెద్ద సంస్థ అయిపోయింది.
కార్మికులతో కలిసి లైన్ లో నిలబడి పళ్ళెం పట్టుకుని భోజనం చేసిన వారిని నేను చూసాను. ఎంత సాధారణ జీవితమో, అంత ఉన్నత ఆలోచనలు. సంఘానికి సైద్దాంతిక భూమిక ఇచ్చిన వారు, భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచి లాంటి అనేక సంస్థల నిర్మాత. దేశ గమనం మార్చీ ఎందరో కార్యకర్తలను పెంచిన తండ్రి, గురువు, సన్నిహితులు వారు వెళ్ళిపోయినా వారి భావాలు, ఆచరణాత్మక ప్రణాళికలు నడిపిస్తున్నాయి. వారి పాదాలకు ప్రణామం చేస్తూ ఆపుతాను.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments