Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూ సమాజం లో కుల వ్యవస్థ- సమరసత. - megaminds

కులం పుట్టుకత తో కాదు.  చేస్తున్న పని, గుణాన్ని బట్టి అని భగవానుడు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పినా, మన జాతి లో పుట్టుక ఆధారం అయ్యింది.  ప్రత...


కులం పుట్టుకత తో కాదు.  చేస్తున్న పని, గుణాన్ని బట్టి అని భగవానుడు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పినా, మన జాతి లో పుట్టుక ఆధారం అయ్యింది.  ప్రతి కులాని కి కొన్ని లక్షణాలు ఉంటాయి.  అవి ఆ కుల సంఘాల వాళ్ళు నేర్పుతుంటారు.  ఈ గుణాలను మనం వెక్కిరించు కోవడాని కి కూడా వాడుకుంటుంటాం.  కొన్ని గుణాలు కుటుంబ పద్ధతులను బట్టి వస్తుంటాయి.  వృత్తిని బట్టి కూడా వస్తుంటాయి.  ఇవి చాలా తప్పుగా సమాజం గుర్తించడం తప్పు.  ఇది స్కిల్ పెంచేది మనం చూడక పోవడానికి కారణం, ఇంగ్లిష్ వాడు, పరాయి పాలకులు, వామ పక్షాలు విపరీత వ్యతిరేకత ప్రచారం చేయడమే.

నేటి సమాజమ్ లో కూడా వృత్తులు కుటుంబ పరంగా రావడం మనం చూస్తున్నాము కదా! సినిమా స్టార్స్ సంతానం ఆ వృత్తి లోకే వస్తుండటం, రాజకీయ నాయకుల సంతానం ఆ విధంగా మారడం మనం చూస్తున్నాము కదా!  వివరాలకి పోవడం వద్దుకాని వైద్యుల, విద్యావేత్తలు, IAS, IPS ల పిల్లలు, అడ్వొకేట్స్, పారిశ్రామిక వేత్తల ఉదాహరణలు ఎన్నో మనం చూస్తుం టాము.  దాన్ని గొప్ప తప్పుగా చూడం.  కాని కుల వ్యవస్థని మనం తీవరం గా విమర్శిస్తుంటాము.

ఈ విభజన ఎంత ఉన్నా మనం ఒక వేరు ఒకే కాండం కి చెందినా శాఖలుగా గుర్తించడం మర్చి పోనంత వరకు కొమ్మలకు, ఆకులకు, పూవులకు, కాయలకు వేరు వేరు పేర్లు ఉన్నాయి.  గుణాలూ వేరు వేరు.  ఉపయోగాలు వేరువేరు కాని అవన్నీ ఆ చెట్టుకు పుట్టాయి.  శోభ నిస్తున్నాయి.  పోషణ తీసుకొని, పోషనని ఇస్తున్నాయి. సజీవ వికసిత సమాజానికి ఇది ఉదాహరణ తప్ప, అసహ్యించుకుని, విమర్శ చేసే విషయం కాదు.  అయితే ఈ శాఖలు మూలాన్ని మర్చిపోవడం, పరస్పర విమర్శలు చేసుకోవడం, మనలోని అరిషద్వార్గాన్ని  సంతృప్తి పరుచుకోవడం కొరకు ఈ వర్గాన్ని వాడు కోవడం వాళ్ళ విభేదాలు పెరిగి సమాజం మొత్తం విషయం వదిలేసి నందు వల్ల మిగతా సమాజాల కంటే రాజకీయంగా తక్కువ చూడబడు తున్నాయి.

దీనికి పరిష్కారమార్గం కులాలను నిర్మూలన చేయాలని నాకూ అనిపించేది.  కాని ప్రతీ మార్పు కేవలం నిర్మూలన చేస్తేనే కొత్త వ్యవస్థ వస్తుందనే వామ పక్ష భావాలు మనపై తెలియకుండానే దాని ప్రభావం చూపబడుతుందని అర్థం చేసుకున్నాను. వివిధత్వం ఉండే శరీర భాగాలు కలిసి ఉంటున్నాయి.  వివిధత్వం ఉన్న వృక్ష భాగాలు కలిసి వృద్ధి చెందుతున్నాయి.  హిందూ భావ జాలం లో సమాజమూ ఒక సజీవ రూపమే.  కాబట్టి ఇక్కడ ఈ వివిధ కులాల మధ్య సమరసత సాధించడం సులభతరమ్ అనే విషయం అర్థం అవుతుంది.  ఈ సమరసత సాధించడానికి కుల సంఘాలు, సమాజ మార్గదర్శులు స్వామీజీలు, సామాజిక నాయకులు కలిసి ఆలోచించాలి.  ఆ శక్తి ఈ దేశానికి రక్షా అవుతుంది.  దానికి ఒక అస్తిత్వం, గుణ సంపద ఉండే మన హిందూ జాతి దృఢతరం అయ్యి ఈ దేశాన్ని సరి చేయగలడు. నమస్సులలతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments