నాకు గుర్తొచ్చే సంఘటన వ్రాస్తాను. నన్ను మొదటి సారి మానీయ సుబ్రహ్మణ్యం గారు పోలవరం పంపించారు. నేను ఉద్యోగం లో చేరి రెండు సంవత్సరాలు దాటింది...
నాకు గుర్తొచ్చే సంఘటన వ్రాస్తాను. నన్ను మొదటి సారి మానీయ సుబ్రహ్మణ్యం గారు పోలవరం పంపించారు. నేను ఉద్యోగం లో చేరి రెండు సంవత్సరాలు దాటింది. నాకు 40 రోజులు ఎర్నేడ్ లేవు ఉంది. మా ఆఫీస్ లో మాట్లాడుకుని విస్తారక్ గా వెళ్లచ్చా అని నేనె మా ప్రచారక్ శ్రీనివాస్ గారిని అడిగాను. వయసు 22 యెల్లే. కొంచంభయం వేసింది. అది వారు గమనించారు. అది సుబ్రహ్మణ్యం గారికి చెప్పారు. అప్పుడు వారు నాతో...
మూర్తి! మనం సంఘ ప్రతినిధి గా వెళ్తు న్నాం. మన స్థాయిని సంఘం పెంచు తుంది. ఆ మానసిక విశ్వాసం తో వెళ్ళు అన్నారు. అక్కడ sbi లో పనిచేసే వారింట్లో ఉండు అని ఉత్తరం వ్రాసి ఇచ్చారు. నేను వారిని కలిసి వారింట్లోనే ఉన్నాను. గోదావరీ తీరం వాళ్ళిల్లు. రోజూ గోదావరి స్నానం.
పోలవరం శాఖ దృఢతరం చేయాలి. తాళ్ల పూడి లో, ప్రక్కిలంక లో అప్పుడప్పుడు నడిచే శాఖల్లో శారీరక్ నేర్పించాలి. కుమార దేవం లో కొత్త శాఖ ప్రారంభించాలి, అది నా లక్ష్యం. అన్ని చోట్లా కొత్త పరిచయాలే. అన్నీ గోదావరీ తీర గ్రామాలు. ఉత్షాహంగా వెళ్ళాను. ఆ సంవత్సరం పూజనీయ రజ్జూ భయ్యా గారు జిల్లా శిబిరానికి వస్తున్నారు. చాలా మంది శిబిరానికి వచ్చారు. నా టార్గెట్ పూర్తి అయింది. ఎంత ఆనందమో.
మళ్లీ ఏలూరు చేరుకున్నాను. మాననీయ సుబ్రహ్మణ్యం గారు నన్ను చూస్తూనే పని బాగానే జరిగిందోయ్. అనుభవాలు చెప్పు అంటూ నాతో కూర్చున్నారు.
నా ఎదురుగా మా సుబ్రహ్మణ్యం గారు. Msc చేసి తన జీవితం సంఘానికి సమర్పించిన మహనీయుడు. కుటుంబం వదిలేసి అప్పటికే 4 సంవత్సరాలు అయ్యింది. ఒక్క నెల రోజులు వెళ్లివచ్చిన నాపై ఇంత శ్రద్ధ. నా కళ్ళు నీళ్లు తిరిగాయి. ఇలా ఎంత మంది సంఘానికి సర్వస్వార్పణ చేసిన వారు. తలుచుకుంటేనే నా కనిపించే ఒకే ఒక సంతృప్తి, నాకు భగవంతుడు వారితో సన్నిహితంగా మెలిగే అవకాశం ఇవ్వడం.
ఈ సంవత్సరం కార్యకర్తలనందరినీ స్వల్ప కాలిక విస్తారుకులుగా రమ్మని పిలుపు నిచ్చింది. వెల్దామా ?
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments