Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పూజనీయ గురూజీ ని చూడటం నా అదృష్టం - megaminds

నేను 1973 లో పరకాల లో 9వ తరగతి చదువుతున్నాను.  మా సర్వేశం సారు అప్పటికే నన్ను సాయం శాఖ కు ముఖ్యశిక్షక్ అన్నారు. పరకాల డాక్టర్ సౌందరయ్య గ...


నేను 1973 లో పరకాల లో 9వ తరగతి చదువుతున్నాను.  మా సర్వేశం సారు అప్పటికే నన్ను సాయం శాఖ కు ముఖ్యశిక్షక్ అన్నారు. పరకాల డాక్టర్ సౌందరయ్య గారి సంతోష్ హాస్పిటల్ ప్రక్కన సందులో ముందుకు వెళ్తే ఉండే గ్రౌండ్ లో శాఖ జరిగేది.  శ్రీ సుధాకర్ రెడ్డి గారు మా ఖండప్రచారక్.  శ్రీ సాయిని సాంబయ్యగారు మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారితో మాట్లాడారు.  భాగ్యనగర్ లో ముఖ్యశిక్షకులు పై వారి శిబిరం జరుగుతుంది.  మేమంతా వెళ్తున్నాము.  మీ అబ్బాయి ని కూడా తీసుకెళ్తాం.  ఆ శిబిరానికి పూజనీయ గురూజీ, సరసంఘచాలక్ వస్తున్నారు. అంటూ చెప్పారు. అదేమో నా అదృష్టం వారు సరే అన్నారు.

భాగ్యనగర్ కేశవ మెమోరియల్ స్కూల్ లో శిబిరం.  నాకు శిబిరానికి రావడం ఇది మొదటి సారి కాక పోయినా అంతా పెద్దవారే.  నాకు నేనే చిన్నగా కనిపించాను.  వారి ఒక ఉపన్యాసం విన్నాను.  పెద్ద తెల్లగడ్డం మీసాలు, నవ్వుతూ వారు మాట్లాడటం గుర్తుంది.  హిందీ నాకు అంతగా అర్థం కాలేదు.  మరుసటి రోజు భోజనం పంక్తి నుండి వారు ముందుగా లేచి వెళ్లారు.  వారితో మరో నలుగురు వెళ్లారు.  ఎవరో నేనెఱుఁగను. పంక్తి చివర్లో నేనున్నాను.  వారు నా ముందుగా వెళ్లారు.  పెద్ద ఎత్తు లేరు, తెల్లటి మనిషి, తెల్లటి గడ్డం, చక చకా నడుస్తూ వెళ్లారు. నాకు ఇంతే గుర్తుంది.

 వారు కూచున్న పంక్తి కి నేను వడ్డన చేయలేదు.  కానీ వారిని దగ్గరగా చూడగలిగాను.  సంఘం అంతగా తెలీదు.  వారు దేశం మొత్తానికి సంఘ అధ్యక్షులని మాత్రమే తెలుసు.  అప్పటికే మా శాఖ లో ఉత్సవాల్లో డాక్టర్జీ తో పాటు వారి ఫోటో పెట్టే వాళ్ళం.  శ్రద్ధగా వారి ఫోటోలకి పూల మాలలు వేసేవాళ్ళం. కాబట్టి వారిని నేను గుర్తించాను.  శిబిరం లో ఏమిజరిగిందీ, ఎవరు మాట్లాడిందీ నాకేమీ గుర్తు లేదు.

ఈ శిబిరం రెండురోజులు జనవరి మాసం లో జరిగింది.  శిబిరం తరువాత రాత్రి ఆగే వాళ్ళకి తుల్జా భవన్ లో అవకాశం ఉండింది.  ఉదయం శాఖకు వెళ్తూ శ్రీ సుధాకర్ రెడ్డి గారు టూరిస్టు హోటల్ దగ్గరికి తెచ్చి, ఆ ఎదురుగా కాచిగుడా స్టేషన్, మీ పెద్దనాన్న గారింటికి వెళ్లగలవా అన్నారు. వెళ్తానన్నాను.  యఖుత్పురా లో మా పెద్దనాన్న గారింటికి వెళ్ళాను.

ఎలాగైతే నేమి నేను గురూజీ ని చూసాను.  ఆ సంవత్సరం వారు శిక్షా వర్గ కు రాలేదట.  అప్పటికి వారు కాన్సర్ తో బాధ పడుతున్నట్లు నాకు తెలియదు.  వారు జూన్ నెలలో వారి శరీరం వదిలి పరమాత్ముడిని చేరారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments