Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బ్రిటిష్ వారి కుట్ర - megamindsindia

బ్రిటీష్ వారు భారత దేశ వైభవాన్ని సంపదను, వనరులను, అభివృద్ధిని ఇక్కడి వైజ్ఞానిక సంపదను భారతీయుల మేధాశక్తిని అధ్యయనం చేసి వీటన్నింటికి మ...


బ్రిటీష్ వారు భారత దేశ వైభవాన్ని సంపదను, వనరులను, అభివృద్ధిని ఇక్కడి వైజ్ఞానిక సంపదను భారతీయుల మేధాశక్తిని అధ్యయనం చేసి వీటన్నింటికి మూలాధారం మరియు భారతీయుల సంస్కృతి, జీవన విధానం మనుగడకు, గోవేె ప్రధాన కారణమని, దేశ అభివృద్ధికి గోవే మూలమని, అన్ని కోణాల్లోంచి నిర్ధారించుకొని,
భారతీయుల జీవన విధానం నుండి గోవును తప్పిస్తే తప్ప తమ లక్ష్యం సాధించలేము అని భావించి కొన్ని కుట్రలు చేసినారు. అందులో ఒకటి టీ.
పథకం ప్రకారం దేశంలోని గ్రామాల్లో, పట్టణాల్లోని  చౌరస్తాల్లో ఉచిత చాయ్ పంపకం free tea centers ను ఏర్పాటు చేసి జనాలకు అలవాటయ్యే వరకు ఫ్రీ టీ సెంటర్లను నడిపినారు. ప్రజలు చాయ్ కి బానిసలూ అయ్యారని నిర్ధారించుకొని తరవాత చాయ్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆపి కేవలం చాయ్ పత్తి పాకెట్స్ ఫ్రీగా పంచడం ప్రారంభించారు.
ప్రజలు వాటిని  పట్టుకెళ్లి తమ తమ ఇళ్లల్లో టీ చేసి త్రాగితే దాని రుచి కోల్పోయి చాయ్ కుదరలేదు. జనాలు పరుగెత్తి వారి వద్దకు వెళ్లి టీ బాగాలేదు అని అడుగగా, అప్పుడు వారు అన్నారు. మేము మీకు ఫ్రీగా పంచిన టీ బర్రెపాలతో చేసినాము. టీ ఆవు పాలతో రుచిగా రాదు అన్నారు.
అప్పటి వరకు దేశంలో ఇంటింటికి గోవులు ఉండేవి. వెంటనే దేశంలో బలమైన మార్పు ప్రారంభమై దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లల్లోని కొట్టాల నుండి ఒక అవును బైటకు పంపి ఒక బర్రెను కట్టడం మొదలు పెట్టారు.
సమాజంలో పాలు కొనేవారు సైతం ఆవు పాలు విడిచి బర్రె పాలు కొనడం ప్రారంభమైంది. మెల్లమెల్లగా దేశంలో బర్రె పాల డిమాండ్ ప్రారంభంమై వేగం పుంజుకుంది. అప్పటి వరకు దేశంలోని పాడి పరిశ్రమలో గోవులు ఉండేవి. వాటి స్థానాన్ని బర్రెలు ఆక్రమించాయి.
పెద్ద ఎత్తున గోవులు కబేళాల పాలవడం ప్రారంభమైంది. తత్ కారణంగా వందలాది ఉత్తమ ప్రాచీన జాతులు నశించి పోయినాయి. కోట్లాది గో సంతతి అంతరించి పోయింది. ఇంటింటికి వర్ధిల్లే గోవులు 95% పైగా ఇళ్లల్లో మాయమైనాయి.
బ్రిటిష్ వారి అంచనా ప్రకారం, "భారతీయులు తరతరాలుగా ఆవు పాలు త్రాగడం వల్ల మంచి ఆరోగ్యం, మేధస్సు కలిగి ఉన్నారు. వారిని బర్రెపాలకు మార్చడం వల్ల వారిలో చురుకుదనం, మేధాశక్తి తగ్గిపోతుంది. తద్వార అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి మెల్లమెల్లగా మనిషి బలహీనమవుతాడు. మనకు బానిసలవుతారు." అని అంచనా వేసి వారు పన్నిన కుట్ర సఫలమైంది.
భారతీయులు ఇంటి నుండి  గోవులని సడక్ లోకి తోసివేసిన పాపాన భారతీయుల ఆయుష్షు 100 సంవత్సరాల నుండి ఆయుఃప్రమాణం 60-70  సంవత్సరాలకి పడి పోయింది. ప్రతి యిల్లు రోగాల కుప్పలాగా తయారైంది.
ఇంట్లో గోవులు వున్నంత కాలం అనారోగ్యం, బద్ధకం, గ్రహాచార దోషం, అకాల మృత్యువు, శత్రుపీడ, వాస్తుదోషం, దరిద్రం, రసాయనిక ఎరువులు ఉండేవి కావు.
ఒక చాయి మూలంగా వ్యక్తి, కుటుంబం, గ్రామం, దేశం అలాగే వ్యవసాయం, భూసారం, ఆరోగ్యం, ఉపాధి పతనమై పోయినాయి.
చాయి పట్ల లోభం ఎంతో అనర్ధానికి దారి తీసింది. చాలా లోతుగా అలోచించి బ్రిటిష్ వాళ్ళు 16'th సెంచరీలో ఈస్ట్ ఇండియా కంపనీ చాయ్ పత్తి వ్యాపారం పేరుతో  ప్రవేశించి మనలను లక్షల సంవత్సరాల వెనక్కు నెట్టేసి అందిన కాడికి దోచుకొని వెళ్ళిపోయారు.
బ్రిటిష్ చాయ్ కి పూర్వం దేశంలో అందరూ కేవలం ఆవుపాలు త్రాగేవారు.
బ్రిటిష్ దురాక్రమణకు పూర్వం దేశంలో పూరి గుడిసె మొదలుకొని ధనవంతుని భవంతుల వరకు ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి. అలా ఇళ్లల్లో గోవులు ఉన్నంత కాలం ప్రతి ఇల్లు దైవశక్తితో నిండి ఉండేది. ఆవు వ్యక్తి ఒక్క అనేక అవసరాలకు పెద్ద దిక్కుగా ఉండేది.
           
సమస్త జీవరాశులకు ఆరోగ్య ప్రదాత సూర్య నారాయణుడు. సూర్యునినుండి కొన్ని అద్భుత బంగారు ఔషధీ శక్తులు విడుదలవుతాయి. భూమి పైన వాటిని గ్రహించే శక్తి కేవలం గోమాతకే ఉన్నది. ఆవు ఎండలో మెతమేస్తూ తిరిగేటప్పుడు సూర్యరశ్మి ద్వారా అట్టి దివ్యమైన శక్తుల్ని తన కొమ్ములో ఉండే  సూర్యకేతు నాడి ద్వారా గ్రహించి మూపురం వద్ద ప్రభావితమైన ఆ శక్తులను తన పాలు, పేడ, మూత్రంలోకి వదులుతుంది. మిగిలిన శక్తి తన కాళ్ళ ద్వారా అక్కడి భూమిలోనికి వదులుతుంది.
దేశవాళీ ఆవుపాలల్లో సూర్యుని యొక్క శక్తివంతమైన స్వర్ణ క్రాంతి ఉంటుంది. అది మానవ శరీరానికి అత్యంత శక్తివంతమైన ఔషధ భాండాగారము. పైగా, ఆవుపాలు మానవ శరీరానికి కావాల్సిన అన్నిరకాల పోషకాలతో నిండిన సంపూర్ణ ఆహారము.
ఇప్పుడు ట్రెండ్ మారింది. మళ్ళీ గ్రామాల్లో, పట్టణాల్లో, గోవు ప్రాముఖ్యతను గుర్తించి అన్ని రకాల సమస్యలకు,  రేడియేషన్, పొల్యూషన్, పాలిథిన్, కెమికల్స్, విష రసాయనాల దుష్ప్రభావాలనుండి కేవలం గోవే కాపాడగలదని, అంతే కాక గ్రహాచార దోషం, వాస్తు దోషం, ఇంకా అనేక అనారోగ్య సమస్యల నుండి గోవే కాపాడగలదని గ్రహించిన ఎందరో తమ తమ ఇళ్లల్లో, ఫ్యాక్టరీలలో, ఫామ్ హౌస్ లలో వ్యవసాయ క్షేత్రాల్లో, ఆసుపత్రుల్లో, విద్యా సంస్థల్లో, ఇండస్ట్రీస్ లలో, గోవులు పెట్టుకోవడం ప్రారంభమైంది. మహానగరాల్లో కొన్ని చోట్ల కొత్తగా కట్టే భవంతుల్లో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్స్ మధ్య గోసదనాలను రూపొందిస్తున్నారు.
మానవ శరీరానికి  కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా కలిగి ఉండి సంపూర్ణ ఆహారంగా లభించే దేశవాళీ గోవు పాలనే సేవిద్దాం. తిరిగి శక్తివంతమైన భారత దేశాన్ని నిర్మిద్దాం!
అనంత ఆదిత్య.
వందే గోమాతరం
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments