అమిత్ షా మొదలుపెట్టిన ఆపరేషన్ దక్షిణాది రాష్ట్రాలు 2013లో మొదలుపెట్టిన మోడీ – అమిత్ షా జోడి జైత్రయాత్ర విజయవంతంగా సాగుతోంది. అనుకున్న లక...
అమిత్ షా మొదలుపెట్టిన ఆపరేషన్
దక్షిణాది రాష్ట్రాలు
2013లో మొదలుపెట్టిన మోడీ – అమిత్ షా జోడి జైత్రయాత్ర విజయవంతంగా సాగుతోంది. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటున్నారు. అసేతుహిమాచలంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీ ముద్ర ఉండాలన్నది వారి అంతిమలక్ష్యం. సగం రాష్ట్రాల్లో అయినా ఎప్పుడూ అధికారం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉండాలని కోరుకుంటున్నారు. వీరు సామాన్యులు కాదు.. అనుకున్న గమ్యం వైపు ప్రత్యర్ధులు, సొంత పార్టీలో వ్యతిరేకులు ఊహించిన దానికన్నా వేగంగా దూసుకెళుతున్నారు. 2014లో ఢిల్లీ పీఠం దక్కించుకున్నారు. తర్వాత రాష్ట్రాలపై గురిపెట్టారు. హరియానా, జార్ఖండ్‌లలో అధికారంలోకి వచ్చారు. మహారాష్ట్రలో మిత్రులనే దాటేశారు. అసోంలో జీరో నుంచి మొదలై పగ్గాలు అందిపుచ్చుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో పాగా వేశారు. కాశ్మీర్‌లో పట్టు సాధించి మిత్రపక్షంతో కలిసి అధికారం పంచుకుంటున్నారు. ఉత్తరాది నుంచి పశ్చిమ అక్కడి నుంచి ఈశాన్య ప్రాంతానికి విస్తరించారు. మధ్య భారతంలో యూపీలోనూ ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యం సంపాదించారు. అమిత్‌షా సోషల్ ఇంజినీరింగ్ మహిమ మాయ చేసింది. ఏకపక్షంగా అధికారం దక్కింది. మరి ఇప్పుడు టార్గెట్ దక్షణాది రాష్ట్రాలు.. ఇందులో ముందువరసలో ఉంది తెలంగాణ.

తెలంగాణలో ఉన్న భావజాలం.. హిందూ సంస్థలకు బలమైన పునాదులు కావొచ్చు పార్టీ దృష్టి మాత్రం రాష్ట్రంపై పడింది. అమిత్ షా ఆపరేషన్ 2019 మరికొద్దిరోజుల్లోనే మొదలుకానున్నట్టు పార్టీలో ప్రచారముంది. యూపీ తర్వాత తన లక్ష్యం తెలంగాణ అని గతంలోనే అమిత్ షా పార్టీ నాయకులకు ఇదివరకే చెప్పారు. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను సిద్దం చేశారట. అవసరమైతే కొత్త నాయకత్వం కింద పనిచేయడానికి సిద్దంగా ఉండాలని రాష్ట్ర నాయకులకు సంకేతాలు కూడా గతంలోనే ఇచ్చినట్టు చెబుతున్నారు.
తెలంగాణలో పార్టీకి ఓటు బ్యాంకు ఉంది. అర్బన్ ఓటింగ్ కూడా ఎక్కువ. అయితే పార్టీకి మాస్ లీడర్ లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. దీంతో అసోం తరహాలో మాస్ ఫోలోయింగ్ ఉన్న నేతను వెతికి మరీ తమగూటిలో చేర్చుకునే పనిలో ఉందట. అమిత్ షా పని మొదలుపెట్టిన తర్వాత రానున్న ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని నేతలు అంటున్నారు. యూపీలో పనిచేసిన బ్యాక్ ఆఫీస్ టీం మొత్తం తెలంగాణలో మకాం వేసి.. సోషల్ ఇంజినీరింగ్ ద్వారా గ్రామస్థాయి క్యాడర్ వరకు యాక్టీవ్ చేయనున్నారట. మరి బీజేపీ ఇక్కడ కూడా తన సత్తా చాటుతుందా? నాలుగు సీట్లు ఉన్న హరియాణాలో అధికారంలోకి వచ్చాం…ఏమిలేని ఈశాన్యంలో కమ్యూనిష్ఠు లకోటలో పాగావేశారు మొత్తం ఈశాన్యములో కాషాయం అయింది .
ఐదు సీట్లున్న తెలంగాణలో పార్టీ గెలవదా అంటున్నారు. మరి ఈ లాజిక్ ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి.అవుతుంది అని చెప్పక తప్పదు ఎందుకంటే గతంలో బీజేపీ అంటే తెలుగు రాష్ట్రాలలో బలం లేదు అనేవాళ్ళు కానీ పోయిన 2014 తక్కువ ఓట్ల తేడాతో 20 మంది ఓడిపోయారు ఇంకా కంచు కోటలు చాలా ఉన్నాయి.
అలాగే AP లో కూడా తప్పకుండా అధిక సీట్లలో విజయపథం లో ఉండే అవకాశం లేక పోలేదు మొత్తం భారతదేశం కమలమయం అయ్యే రోజులు దగ్గరే ఉన్నాయి .
మీ అనంత ఆదిత్య

No comments