Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారతీయత - హిందుత్వం - జాతీయత - గందరగోళం-india

అనాదిగాఇది హిందూ దేశం . దీన్నె భారతదేశం అనీ అన్నారు . రెండింటికి తేడా ఏమీ లేదు . ఏ మతం వారైనా ఇక్కడి వారి జాతీయత ఒక్క...


అనాదిగాఇది హిందూ దేశం. దీన్నె భారతదేశం అనీ అన్నారు. రెండింటికి తేడా ఏమీ లేదు. మతం వారైనా ఇక్కడి వారి జాతీయత ఒక్కటే. ఇక్కడ శైవులు, వైష్ణవులు, శాక్తేయులు
గాణపత్యులు, వైదికులు, శాస్త పూజకులు, బౌద్ధులు, జైనులు, అయ్యప్ప భక్తులు, ఇంకా రకరకాల దేవతారాధన చేసె వారు, అసలు దేవుడే లేడనే వారు, ప్రకృతి ఆరాధకులు ఎన్ని రకాల వారున్నా జాతీయతను అనుసరించి అందరూ హిందువులే. మనం దేవుళ్లకు చుట్టరికాలు కూడ కలిపేసుకున్నాము.
ఏకం సత్, విప్రాహ బహుధా వదంతి. దేవుడొక్కడే, యొగులు రకరకాలుగా చెబుతారు అనే విషయం నమ్మె వాళ్లము కాబట్టి, ఎవరి పద్ధతి వారిది అని మెలిగే వారము.
ఈదేశం పైకి క్రీస్తు పూర్వం నుండే గ్రీకుల నుండి దండయాత్రలు జరిగాయి. పళ్లుండే చెట్లకే కదా రాళ్లు పడతాయి. ప్రపంచంలో అత్యధిక డబ్బుండే దేశం. వారి తరువాత హూణులు,శకులు, కుషాణులు, టర్కి, సిరియా, ఆఫ్గనిస్థాన్ మీదుగా పశ్చిమాసియా మూకలు అనేకం దండయాత్రలు చేెసారు. రకరకాల వంశాల వారు, ఊసర క్షేత్రం నుండి సింధు, గంగా మైదానాలను చూసి ఇక్కడే రాజ్యం చేస్తూ ఉండి పోయారు. వాళ్ల మతాల లోకి నయాన, భయాన ఇక్కడి జాతీయులనె మతం మార్చారు. మన భారతీయ పద్ధతిని అనుసరంచి ఇది మరో పద్ధతిలో దేవుడిని ఆరాధించటం గా ఇక్కడి హిందువులు మారారు.
ఇంగ్లీషువాడు విభజించి పాలించే పద్ధతిలో మతంమారిన వారినివిదేశాలనుండి వచ్చిన వారితో కలిపి మీరు వేరు మిగతావారు వేరు, రెండు వేరు జాతులు గా నమ్మబలి కాడు. విధం గా హిందూ జాతీయ తను విడగొట్టి వారిని ముస్లిం జాతి అన్నాడు. వారికి వేరే దేశం నినాదం తొ జిన్నా ముస్లిం లీగ్ అని పార్టి పెట్టి, పాకిస్తాన్ ను హిందూ జాతీయత 
ను విడగొట్టి సాధించారు. మిగిలిన భారత దేశం లో ఉన్న ముస్లిమ్సు కూడ ఇక్కడి జాతీయత లో కలిసిపోకుండా విడిగావుంచే ప్రయత్నం నెహ్రు గారి కాంగ్రెస్‌, కమ్యునిష్టుల ప్రయత్నం గా వేరే ఓటుబాంకు గా, మన జాతీయత భారతీయత అని, అందులో ముస్లిం, హిందూ అని, రెండు మతాలు భాయి, భాయి అని, ఒకే జాతీయతను చీల్చి, మిగిలిన హిందువులను కూడ విడగొట్టే ప్రయత్నాలను కొనసాగించారు
దేశ జాతీయత హిందుత్వం ని ఇంగ్లీషు వాడు ఇందులోనండి ముస్లిముల ను విడగొట్టడానికి దీన్ని ఒక మతం గా సృష్టించి, ముస్లిములని వారి పూర్వికులుగా అరబ్బులను, టర్కీవారిని సిరియన్ లను, ఇరాన్, ఇరాక్ వారిని సృష్టించి దేశజాతీ యత నుండి విడగొట్టి, దేశ జాతీయత భారతీయత అందులో హిందువులు, ముస్లిమ్లు రెండు మతాలు అన్నాడు. మన వాళ్లు రాజ్యాంగం లో హిందు ను నిర్వచిస్తూ ఏమి రాయాలొ తెలియక ముస్లిములు
క్రిస్టియన్ లు కాకుండా అని, అందులో బౌద్దులు, జైనులు, సిక్కుల ను కలుపుకొని అని వ్రాసారు.
మిగిలిన హిందువుల లో సామాజిక అసమానతల విషయమై పెద్ద చర్చ జరిగి అందులొ కులాల వారిగా విభజన, ఆరక్షణలు ఇత్యాదులు జరిగి
మళ్లి గ్రుపుల రాజకీయీకరణ జరిగి విభజనను స్థిరీకరిస్తున్నారు. స్వతంత్రం వచ్చాక జాతీయతను పెంచడం అంటె నీవు వేరు, నేను వేరు కాని అందరం భారతీయులం అనే ప్రచారం జరిగి విభజన పెంచారు.
ఇందులో ఎవరైనా కలపడం కొరకు ఆలొచిస్తే వాడి కులం ఏమిటి? వాడి నెందుకు మనం అనుసరించాలి, కులం వారి డామినెషన్ పెరుగు తందేమొ? కమిటి లో మన కులం వాడున్నాడా? ఇలా మనం ఒక జాతీయులం అనేది పోయి, ఒకరికి మరొకరు శత్రువులు గా భావించే పరిస్థితి దాపురించినది. పాత అసమానత కాకుండా కొత్త అభద్రతా భావం పెరిగింది.
భారత ప్రజల విభజనలో మొదట్లో కలవారు, లేని వారు అని పాడిన కమ్యునిష్టులు తరువాత కులాలు, ఆర్య, ద్రావిడ సిద్ధాంతాలు అన్నీ విఫలం అయ్యాక, పశ్చిమ దేశాలు ప్రతిపాదించిన దళితులను విడగొట్టడానికి పురాణాల లొ విలన్ల ను దళితులు అని వారిని అగ్రవర్ణాల వారు నాశనం చేసారని పరస్పరం విరుద్దత సృష్ఠించే పని చేస్తున్నారు.
అంగ్లేయులు సృష్టంచిన దేశ జాతీయతను మతం గా మార్చి ముస్లిం లను రెచ్చగొట్టి విడగొట్టిన పద్ద తిలోనే అగ్రవర్ణాలు అని పేరి పెట్టిన వారిపై, వ్యవస్థలపై రెచ్చగొట్టే పుస్తకాలు వ్రాసి,గోమాంసం,పురాణాల విలన్లను దళితులుగా సృష్టి చేసి ఇక్కడి జాతీతయను కాకుండా దాని విభజనకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments