Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మా గ్రామంలో అన్యమత ప్రచారం వద్దు అంటున్న పెద్దలు యువకులు -Kadapa

హెచ్చరిక: ఈ గ్రామంలో అందరూ హిందువులే అయినందున ఇతర మతస్థులు మత ప్రచారం చేయరాదు.. అట్లు కాదని చేసిన ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. ‘‘మతం మారి...


హెచ్చరిక: ఈ గ్రామంలో అందరూ హిందువులే అయినందున ఇతర మతస్థులు మత ప్రచారం చేయరాదు.. అట్లు కాదని చేసిన ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. ‘‘మతం మారితే కన్నతల్లిని మార్చుకున్నట్లే.’’ ....అని పేర్కొంటూ అక్కడ ఓ బోర్డు కనిపిస్తుంది. ఇదేదో... తిరుమలలోనో, మరేదైనా హిందూ దేవాలయంలో ఏర్పాటు చేసినది కాదు. కడప జిల్లా మైదుకూరు సమీపంలోని కేశలింగాయపల్లి గ్రామస్థులు ఏర్పాటు చేసిన బోర్డులోని సారాంశమిది. తమ ఊరికి పొలిమేరలో ఇరువైపులా   గతేడాది జూన్‌లో ఇలాంటి బోర్డులు వారు నెలకొల్పారు. అప్పటి నుంచి దాన్ని కట్టుబాటుగా మార్చుకుని జీవిస్తున్నారు. సుమారు 250 కుటుంబాలు ఉన్న కేశలింగాయపల్లిలో అందరూ హిందువులే. ఊళ్లో రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయాలున్నాయి. మైదుకూరు నుంచి బ్రహ్మంగారిమఠం వెళ్లే దారిలో ఉన్న ఈ పల్లెలో ఏళ్ల తరబడి గ్రామస్థులు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు. గతంలో  కొన్ని కుటుంబాలు మతమార్పిడికి దిగడం గ్రామస్థులకు నచ్చలేదు. దాంతో ఊరంతా ఏకమై కమిటీగా ఏర్పడింది. తమ గ్రామంలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని గ్రామానికి ఇరువైపులా బోర్డులు నాటారు. ఆ గ్రామస్థులకు హిందూ ఐక్యవేదిక, సమరసత సేవా ఫౌండేషన్‌ మద్దతు తెలిపాయి. ఈ నిషేధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

No comments