Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

‘సౌర’ గరిమ-SolarPower

కొత్త ఢిల్లీలో అంతర్జాతీయ సౌరశక్తి సంఘటన- ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్- ఐఎస్‌ఏ- దేశాల తొలి శిఖర సమావేశం జరగడం ప్రపంచ చరిత్రలో వినూతన అధ్య...


కొత్త ఢిల్లీలో అంతర్జాతీయ సౌరశక్తి సంఘటన- ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్- ఐఎస్‌ఏ- దేశాల తొలి శిఖర సమావేశం జరగడం ప్రపంచ చరిత్రలో వినూతన అధ్యాయం, ప్రాకృతికమైన, శుభంకరమైన సహజ ఆర్థిక ప్రగతికి శ్రీకారం. 2015 నవంబర్ ముప్పయ్యవ తేదీన లాంఛనంగా ఏర్పడిన ఈ ‘సౌరశక్తి సంఘటన’ విస్తరించడం ఢిల్లీ మహాసభల సందర్భంగా ప్రస్ఫుటించింది. ‘సౌరశక్తి సంఘటన’ను ఏర్పరచిన ఘనత మన దేశానిదే. 2015లో ఫ్రాన్స్ రాజధానిలో జరిగిన ‘పర్యావరణ పరిరక్షణ సదస్సు’కు హాజరైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ‘సౌరశక్తి కూటమి’ని ఆవిష్కరించాడు. ప్రకృతి నిహితమైన, ప్రకృతికి ప్రాణమైన, సౌర కుటుంబాన్ని వెలిగిస్తున్న సూర్యుని కిరణాల నుంచి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తుండడం దశాబ్దుల కథ. కానీ అణు విద్యుత్, జల విద్యుత్, వాయు విద్యుత్, థర్మల్ విద్యుత్ వంటి వాటికంటె సౌర విద్యుచ్ఛక్తికి క్రమంగా ప్రాధాన్యం పెరుగుతుండడానికి ఈ ‘సంఘటన’ ఏర్పాటు ప్రతీక! సౌర విద్యుత్ ప్రాధాన్యంతోపాటు మన దేశ ప్రాధాన్యం పెరుగుతుండడం సమాంతర పరిణామం! రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐక్యరాజ్యసమితి అవతరించాక రక్షణ కూటములు, ఆర్థిక సమాఖ్యలు, వాణిజ్య కూటములు, రాజకీయ దౌత్య కూటములు, వ్యూహాత్మక సంఘటనలు అనేకం ఏర్పడడం దశాబ్దులుగా నడుస్తున్న చరిత్ర. ఈ కూటములకు అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా వంటి అగ్రదేశాలు కేంద్ర బిందువులు కావడం అంతర్జాతీయ సమాజంపై ఈ దేశాల ఆధిపత్యానికి నిదర్శనం. ఈ దేశాల ప్రమేయం లేకుండా, విస్తృతమైన ‘అంతర్జాతీయ సమాఖ్య’ ఒకటి ఏర్పడడానికి ‘సౌరశక్తి కూటమి’ శ్రీకారం. మన ప్రభుత్వం సాధించిన వ్యూహాత్మక విజయం ఇది. ప్రపంచంలోని నూట ఇరవై ఒక్క దేశాలకు ఈ ‘్భగోళిక సమాఖ్య’లో సభ్యత్వం సహజంగానే లభిస్తోంది. ఇంతవరకు యాబయి ఆరు దేశాలు ‘ఐఎస్‌ఏ’లో ఆధికారికంగా భాగస్వాములయ్యాయి. ఢిల్లీ మహాసభకు ఇరవై మూడుదేశాల ప్రభుత్వ అధినేతలు, మరో పది దేశాల మంత్రులు హాజరు కావడం అంతర్జాతీయ సమాజ దృష్టిని ఆకర్షించిన పరిణామం. ప్రధానంగా చైనాకు ఈ పరిణామం గొప్ప అసౌకర్యం. వాణిజ్య విస్తరణను, రాజకీయ వ్యూహాత్మక దురాక్రమణను కొనసాగిస్తున్న చైనాకు ‘అంతర్జాతీయ సౌరశక్తి సమాఖ్య’ ప్రతిఘటన శక్తి! ఇది మన దేశం సాధించిన వ్యూహాత్మక విజయం. ఈ విజయానికి ఫ్రాన్స్ ‘సౌరశక్తి సమాఖ్య’లో చేరడంతో మరింతగా ప్రాధాన్యం పెరిగింది. ఫ్రాన్స్ ఈ సహజ ‘్భగోళిక సమాఖ్య’ సరిహద్దులకు ఆవల నెలకొని ఉంది. అయినప్పటికీ ఫ్రాన్స్ ఈ సమాఖ్య సభ్యత్వం స్వీకరించడం మన దేశానికి లభించిన మరో వ్యూహాత్మక విజయం. పాశ్చాత్య ప్రపంచంలో అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఫ్రాన్స్ ఎదుగుతోంది. ఆసియాలో చైనా వ్యూహాత్మక దురాక్రమణను ప్రతిఘటించడానికి జరుగుతున్న కృషిలో మన దేశం కేంద్ర బిందువు. సౌర సమాఖ్య ద్వారా బలపడిన, బలపడుతున్న ‘్భరత్- ఫ్రాన్స్’ బంధం అంతర్జాతీయ సమాజానికి ఆసక్తిని కలిగిస్తున్న మరో పరిణామం! మన ప్రధానమంత్రితో కలిసి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్యునేల్ మాక్రాన్ ఢిల్లీ సదస్సుకు సంయుక్త అధ్యక్షతను వహించడం పెరిగిన ద్వైపాక్షిక మైత్రికి నిదర్శనం!
సౌరశక్తి సమాఖ్య ఏర్పాటుకు అవసరమైన సహజ భూమిక భూగోళం నైసర్గిక స్వరూపంలో నిహితమై ఉంది. భూమి ఉత్తర దక్షిణాలుగా నూట ఎనబయి ‘్భగ’- డిగ్రీ-లుగా విభక్తమై ఉంది. భూమధ్య రేఖకు దక్షిణంగా తొంబయి ‘్భగ’లుగా, ఉత్తరంగా తొంబయి ‘్భగ’లుగా భూగోళం ఏర్పడి ఉండడానికి ప్రధాన కారణం సూర్యునికీ, భూమికీ మధ్య ఉన్న పరిభ్రమణ సంబంధం. ఈ ‘్భగ’లను ‘అక్షాంశములు’- లాటిట్యూడ్స్- అని అంటున్నాము. భూమధ్య రేఖనుంచి దక్షిణంగా తొంబయ్యవ అక్షాంశంపై దక్షిణ ధ్రువం నెలకొని ఉంది. భూమధ్యరేఖకు ఉత్తరంగా తొంబయ్యవ ‘డిగ్రీ’ల అక్షాంశంపై ఉత్తర ధ్రువం ఏర్పడి ఉంది! కానీ భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న ఇరవై మూడున్నర డిగ్రీల అక్షాంశరేఖకు, ఉత్తరంగాఉన్న ఇరవై మూడున్నర డిగ్రీల అక్షాంశ రేఖకు మధ్య గల ‘గగనం’లో మాత్రమే సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తున్నాడు, సాపేక్షం- రిలేటివ్-గా సంచరిస్తున్నాడు. దక్షిణాన ఇరవై మూడున్నర డిగ్రీలపై ఉన్నది ‘మకర రేఖ’- ట్రాపిక్ ఆఫ్ కాప్రికార్న్- ఉత్తరాన ఇరవై మూడున్నర డిగ్రీలపై కర్కటక రేఖ- ట్రాపిక్ ఆప్ కాన్సర్- నెలకొని ఉంది. కర్కటక రేఖ నుంచి మకర రేఖ వరకు సూర్యుడు ‘సాపేక్షం’గా సంచరించే ఆరు నెలల సమయం ‘దక్షిణాయనం’. మకరరేఖ నుంచి కర్కటక రేఖ వరకు సూర్యుడు సంచరించే మరో ఆరునెలలు ‘ఉత్తరాయణం’! మన దేశం కర్కటక రేఖకు ఇరువైపులా విస్తరించి ఉంది.
సౌరశక్తి సమాఖ్యలో భాగస్వాములు కాగల దేశాలన్నీ మకరరేఖకు, కర్కటక రేఖకు మధ్య విస్తరించి ఉన్నాయి. అందువల్లనే ఈ దేశాలలో ఏడాది పొడువునా సూర్యకాంతి పుష్కలంగా లభిస్తోంది. ఈ దేశాలలో సౌరశక్తి ఉత్పత్తి అత్యధికంగా జరుగుతుంది. ఈ ‘్ధ్యస’తో ‘సౌర శక్తి’ కూటమిని ఏర్పాటు చేయడం నరేంద్ర మోదీ దౌత్య నీతి పటిమకు నిదర్శనం. చైనా, అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా దేశాలు ‘కర్కటక’కు రేఖకు ఉత్తరంగా చాలా దూరంలో నెలకొని ఉన్నాయి. అందువల్ల ఈ దేశాలు సౌరశక్తి కూటమి సభ్యత్వం పొందకుండా భౌగోళిక స్థితి నిరోధిస్తోంది. ‘నొప్పింపక తానొవ్వక’ అన్నట్టుగా పై ‘అగ్రరాజ్యాలు’ లేని అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయడం మోదీ చాణక్య నీతి! ఫ్రాన్స్ సభ్యత్వం మాత్రమే అపవాదం. అందువల్ల సహజంగానే మన దేశం ఈ కూటమిని నడిపించనుంది. భారత నాయకత్వం ఇతర దేశాలను వ్యూహాత్మకంగా దురాక్రమించడానికి కాదు, ఇతర దేశాల సమష్టి హితం కోసం పాటుపడడానికి మాత్రమే! సౌరశక్తి కూటమి ద్వారా మరోసారి ఈ వాస్తవం ధ్రువపడింది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా దేశాలు ప్రధానంగా ప్రవర్ధమాన దేశాలు ఈకూటమిలో భాగస్వామ్యం వహించనున్నాయి! ఈ కూటమి ప్రధాన కార్యాలయం మన దేశంలో ఏర్పడి ఉంది!
సౌరశక్తి ప్రాకృతిక శక్తి, సహజమైన శక్తి! అనాదిగా వేద ఋషులు, భారతీయులు ఈ సనాతన సృష్టిగత వాస్తవాన్ని గుర్తించారు! ‘సూర్య ఆత్మా జగతః’- ‘సూర్యుడు జగత్తునకు ఆత్మ- కేంద్ర బిందువు-!’ అని భారతీయులు చాటి చెప్పారు. అందువల్లనే సూర్యకాంతిని నిరంతరం పొందగల ‘మకర- కర్కాటక’ రేఖామధ్య దేశాలు మానవ జీవనానికి, జీవన సాంస్కృతిక వికాసానికి అత్యంత సుఖకరమైన ‘నెలవు’లయ్యాయి. ఈ ‘మకర- కర్కాటక’ క్షేత్రానికి ఆవలి వైపున ఉన్న ‘ధ్రువ’ దేశాలకు సౌరశక్తి సౌలభ్యం లేదు, సూర్యకాంతి సౌలభ్యం లేదు. అందువల్ల సౌరశక్తి వాడకం, ఉత్పత్తి పెరిగేకొద్దీ అంతర్జాతీయ సమాజంలో మన దేశానికి, ‘సౌరశక్తి కూటమి’కి ప్రాధాన్యం పెరగనుంది.! భవిష్యత్ భారత్‌ది, భారతీయ సంస్కారానిది.

No comments