Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గోవధలోని గోవుల వ్యథ! మీకు తెలుసా? about COW SLAUGHTERS

  గోవధలోని గోవుల వ్యథ! మీకు తెలుసా?.... ప్రపంచంలోనే అతిపెద్ద గోవధశాల (ఆవులను వధించే కర్మాగారము) హైదరాబాదుకు 30 కిలోమీటర్ల దూరంలో పఠాన్...

 Image result for COW SLAUGHTERS

గోవధలోని గోవుల వ్యథ! మీకు తెలుసా?.... ప్రపంచంలోనే అతిపెద్ద గోవధశాల (ఆవులను వధించే కర్మాగారము) హైదరాబాదుకు 30 కిలోమీటర్ల దూరంలో పఠాన్‌చెరుకు సమీపంలో రుద్రారమ్‌ అనే గ్రామంలో సుమారు 400 ఎకరాల స్థలంలో, పూర్తి భద్రతతో, ‘‘అల్‌కబిర్‌’’ అను పేరుతో ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో పనిచేసే వారిలో ఎక్కువమంది హిందువులు కావటం.
అల్‌కబీర్‌ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రుద్రారం గ్రామం, పఠాన్‌చెరు, మెదక్‌జిల్లా, తెలంగాణా స్టేట్‌ - 500033.
క్రూరత్వమే వణికిపోయే వైనం, జీవహింసయే ధారుణమంటే - అందునా భారతదేశంలో అతి ఎక్కువమంది గోమాతగా పూజింపబడే జీవిని చిత్రాతిచిత్ర హింసలకు గురిచేస్తూ వధించి, అంతర్జాతీయ వ్యాపారంగా నిర్విరామంగా జరుగుతున్న దమనకాండవైనం ఇది....వీటిని (గోవులను) బాధ తెలియకుండా వధిస్తారని ఊహిస్తే... అది పొరపాటే అవుతుంది.
గోవులు తుది శ్వాస విడిచేవరకు చాలా సుదర్ఘీమైన చిత్రహింసల పర్వం కొనసాగుతుందిక్కడ. ముందుగా ఈ గోవులను సామూహికంగా 20-25 వరకు ఒక ట్రక్కుల్లో ఎక్కించి దూరప్రాంతాల నుండి ఇక్కడకు తరలిస్తారు. దారి మధ్యలో అవి కదలటానికి గాని, గాలి చొరబడటానికి గాని ట్రక్కులో స్థలముండదు.
ఎందుకంటే ఒక గోవు పట్టే స్థలములో రెండు లేక మూడు గోవులను నిల్పుతారు. అంతేకాదు దారిమధ్యలో వాటికి సరియైన తిండిగాని కనీసం నీరు కూడా అందని దుస్థితి వాటిది. ఈ విధంగా అల్‌కబీర్‌కు చేరే సరికి గోవులకు వాటి కాళ్ళమీద అవి నిల్చోలేని దైన్య (దయనీయ) స్థితిలోలో ఉంటాయి. అటువంటప్పుడు వాటిని బలవంతంగా లోనికి యీడ్చుకొని పోతున్నప్పుడు అవి పెట్టే రోధనలు, వాటి నిస్సహాయ దుస్థితి గమనిస్తే - మానవత్వం మసకబారిన వైనం మాటలకందనిది.
చివరగా గోవులను వధశాలకు చేర్చటం జరుగుతుంది. అక్కడ వెయ్యికి పైగా గోవులను నిల్వ ఉంచే గిడ్డంగులు ఉన్నాయి. బహుశా వాటికి చివరగా గాలిని శ్వాసించే అవకాశం ఇక్కడేనేమో? ఈ గిడ్డంగుల్లో గోవులను నాలుగు రోజులు కనీసం తిండి, నీరు అందనీయకుండా ఆకలితో, దాహంతో మాడుస్తారు.
ఆ తరువాత గోవుల కాళ్ళను విరగ్గొడతారు. వాటి కళ్లను తొలగిస్తారు. అప్పుడే గోవులు పనికిరానివిగా ధృవీకరణ పత్రం పొందటం జరుగుతుంది. అంతకుముందే అవి నాలుగు రోజులుగా తిండి నీరు లేనికారణంగా గోవులలోని హెమోగ్లోబిన్‌ రక్తములో నుండి వెడలి స్థూల మాంసంగా (కొవ్వుగా) తయారవుతుంది. అలా హెమోగ్లోబిన్‌తో నిండిన గోమాంసము అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత ధర పలుకుతుంది.
ఇక ఈ స్థితిలోని గోవులను నీటిలో శుభ్రం చేసే నీటి పంపుల వద్దకు తెస్తారు. శుభ్రం చేసే సమయంలో నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఇంతటి ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని గోవులపై ధారగా పోస్తారు. ఈవిధంగా చేసినందువల్ల వీటి చర్మం నునుపెక్కి వొలచటానికి సులభమౌతుంది. కానీ, ఈ సమయంలో అవి (గోవులు) ఎంతో భయంతో బిక్కచచ్చిపోయి ఉండే హృదయ విదారకమైనస్థితి. గోవుగా ఎందుకు పుట్టామా అన్నట్టు, ఇంకా ప్రాణం ఎందుకు పోలేదని రోధిస్తున్న వైనం... భూమి మీద జాలి, దయ, కరుణ అన్నవి మృగ్యమైపోయిన వైనం...రాక్షసత్వానికి పరాకాష్ట. రావణకాష్టం నిరంతరం కాలుతుందో లేదో తెలియదుకానీ గోవుల దమన కాండ మాత్రం రుద్రారంలో నిర్విరామంగా జరుగుతున్నది.
ఆ తర్వాత గొలుసులతో ఉన్న కొక్కాలకు ఒక్కొక్క గోవును తలక్రిందులుగా ఒక కాలుని ఆ కొక్కాలకు తగిలించి వేలాడదీస్తారు. రక్తం ఏకధాటిగా ఏరులౌతున్న దృశ్యం చూసిన ఏ మనిషికైన మనసు మండి మసిగాక మానదు. అయినా అప్పటికి ఆ గోవులను పూర్తిగా చంపనట్టే. గోవులను పూర్తిగా చంపిన తర్వాత వాటి చర్మము ఉబ్బి గట్టిపడుతుంది. అటువంటి చర్మము మార్కెట్టులో తక్కువ ధర పలుకుతుంది. కాని ప్రాణమున్నప్పుడే వొలిచిన గోవుల చర్మము చాలా పలుచనగా ఉండటమే కాదు, వాటి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్టులో అత్యంత ధర పలుకుతుంది. ఒకప్రక్క గోవుల మెడలు సగం తెగి రక్తం కారుతుంటే, మరొకప్రక్క గోవుల కడుపులో రంధ్రం చేసి, అందులోకి అతివేగంగా గాలిని జొప్పిస్తారు. అప్పటికి గాని గోవులోపలి భాగాలు ఉబ్బి, చర్మం వొలవటం అనే పక్రియ సులభతరం కాదు. చర్మం పూర్తిగా వొలిచిన తర్వాత ఆ గోవులను నాలుగు భాగాలుగా (తల, కాళ్లు, మధ్యభాగము, తోక) ముక్కలు చేస్తారు. అల్‌కబీర్‌లోని యంత్రాలు గోవుల లోపలి ఎముకలను తీసివేసి, గట్టిపడిన మాంసాన్ని చిన్నచిన్న ముక్కలు చేసి చల్లని క్యాన్స్లో భద్రపరచి, షిప్పింగ్‌ ద్వారా ముంబాయి నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతున్నది.
ఇందులో ఆశ్చర్యపడవలసింది, బాధపడవలసిన విషయం ఏమంటే గోవులను పైన చెప్పిన విధంగా చిత్రహింసలకు గురిచేసి వాటిమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయడానికి మూలకారణమైన మెదక్‌జిల్లా, పఠాన్‌చెరు సమీపంలోని రుద్రారంలోని అల్‌కబీర్‌ కర్మాగారంలో పనిచేసేవారిలో ఎక్కువమంది హిందువులని చెప్పడానికి సిగ్గుపడాలి.... భారతదేశం మన దేశంలోని ప్రజలున్నారు. కానీ ఎవరికి పడుతోంది గోవథలోని గోవుల వ్యధ?
అల్‌కబీర్‌ సంస్థ డైరెక్టర్‌ సుభాష్‌ సబర్‌వాల్‌ స్వదేశం భారతదేశమైనా ప్రస్తుతం ఉండటం దుబాయ్‌, ఇతని సోదరుడు సతీష్‌ సబర్‌వాల్‌ పైన వివరించిన కర్మాగారాన్ని నిర్వహిస్తున్నది. మిగిలిన ముఖ్యులు దిలిప్‌ హిమ్మత్‌కొఠారి, బి.యన్‌.రామన్‌ మొదలగువారు. గోవులను ముక్కలుగా చేసే యంత్రాలు కేరళా ప్రాంతం నుండి, ఆ యంత్రాల వద్ద ఉండి గోవులను పైన పేర్కొన్న విధంగా చిత్రహింసలకు గురిచేసి, ముక్కలైన గోమాంసాన్ని ప్యాకింగ్‌ చేసేవరకు పనిచేసే వారిలో ఉండే ముంబై నుండి వచ్చినప్పటికి, నిర్వహణ విభాగంలోని వారు, సెక్యూరిటీ సిబ్బంది మొదలగు వారిలో ప్రధానంగా ఎక్కువమంది హిందువులున్నారని చెప్పటానికి సిగ్గుపడాలి హిందూజాతి,హిందూ ధర్మం!
మెదక్‌ జిల్లాలోని రుద్రారంలో ఉన్న అల్‌కబీర్‌ లాంటి గోవధ కర్మాగారాలు అనేకం భారతదేశంలోని ప్రధాననగరంలో చాలానే  ఉన్నాయి. వాటికి యజమానులు, నిర్వహించేవారు ప్రవాస భారతీయులు మరియు అండదండలు మెండుగా వున్నవే. ఈ గోవధ కర్మాగారాలలో పనిచేసేవారికి చెల్లించే వేతనాలు చాలా ఎక్కువగాను మరియు చాలా ఆకర్షణీయంగాను ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఇంచుమించు సివిల్‌ సర్వెంట్స్ జీతాలకు సమానంగా ఉంటాయంటే అందరికీ ఆశ్చర్యం కలగకమానదు. ఇందులో పనిచేసే వారి జీతాలు కనిష్టం నెలకు 50,000 నుండి 75,000 వేల వరకు ఉన్నాయని(2015) నికరసమాచారం. ఇందులో పనిచేసే వెటర్నరియన్స్ యొక్క ఉద్యోగానికి గాని, వారి ఆరోగ్యానికి గాని రక్షణ లేదని సమాచారం.
ఇక్కడ బాధాకర విషయం ఏమంటే ఎగుమతి అవుతున్న మాంసం హానికరమైన క్రిములు సోకినవై ఉంటే అటువంటి వాటిని ఆహారంగా తీసుకునే వారి ఆరోగ్యం ప్రశ్నార్థకమే? నిజానికి ప్రభుత్వంలో పనిచేసే వెటర్నరియన్స్ ప్రధాన బాధ్యత ఏమంటే ఆహారానికి పనికివచ్చే జంతువులు ఆరోగ్యంగా ఉండేట్లు చూడటం, మరియు అవి ఎలాంటి హానికరమైన వ్యాధి బారిన పడకుండా చూడటం. కానీ అవినీతి పరులైన పై అధికారులు తప్పుడు ధృవీకరణ పత్రాలు డబ్బుకు లాలూచిపడి ఇవ్వటం, అల్‌కబీర్‌ వారి తొత్తులుగా మెసలటం బాధాకరమైన విషయమేకాదు,
ఇతరులెవరు రుద్రారంలోని అల్‌కబీర్‌లోకి ప్రవేశించడం దుర్లభం, దుర్భేద్యం. ఎందుకంటే అక్కడ పనిచేయని ఇతరులు లోనికి ప్రవేశించడమే కాదు, ఆ పరిసరాలలో సంచరించడం కూడా ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుంది. పోలీసు అధికారులకే ప్రవేశం నిషిద్ధం అంటే ఇంక ఇతరుల గురించి ఆలోచన అనవసరం. ఇతరులెవరు ఆ పరిసరాలలో సంచరించే వీలుగాని, గమనించే వెసులుబాటుగాని లేకుండా క్రూరాతి క్రూరమైన వేట కుక్కలు కాపలా ఉంటాయి. అందుకనే ఆ కార్మగారం మహానగరానికి అతి సమీపంలో ఉన్నా లేనట్టే, ప్రభుత్వంలోని ఎందరో ముఖ్యులకు తెలిసినా తెలియనట్టే. మనకు సమీపంలోని అల్‌కబీర్‌లో ఇంతగా దారుణాలు గోవులపై జరుగుతున్నా జరగనట్లే. అసలు ఇది మన చట్టాలు పర్యవేక్షణలో ఉన్నట్టా లేనట్టా! ఒకవేళ ఉంటే మానవ హక్కుల సంఘాలున్నట్టే, జంతుపరిరక్షణ సంఘాలు నీలి క్రాస్‌ లాంటి సంస్థలు (బ్లూక్రాస్‌) ఉన్నాయి. మరి కుక్కలకు, కుందేళ్ళకు జరుగుతున్న అన్యాయాలకు స్పందించినట్టు ఇంత దమన కాండ గోవులపై జరుగుతున్నదని తెలిసినా, మిన్నకున్నారంటే.. రక్షించడానికి ప్రభుత్వాలు, హక్కుల సంఘాలు, జంతువులపై జాలి చూపించే రంగుల క్రాస్‌ సంస్థలు నిర్లిప్తంగా ఉండి, దేవుడిమీద భారం వేయలి మానవులకు మరే ఇతర ప్రాణులకు ఆయువు తీరేంతవరకు జీవించే స్వేచ్ఛ ఉన్నట్టే గోవులు జీవించి ఉండగానే వాటిని పాశవికంగా చంపి, వాటి మాంసంతో, చర్మాలతో వ్యాపారాలు చేసేవారి ఆగడాలకు అంతే లేదా?

No comments