Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కర్ణాటకలో తెలుగువాళ్ళ ఆత్మగౌరవ నినాదం పనిచేస్తుందా?

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పుట్టింది అని ఎన్టీరామారావు గొప్పగా చెప్పేవారు.. ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపార...

Image may contain: 3 people, people smiling
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పుట్టింది అని ఎన్టీరామారావు గొప్పగా చెప్పేవారు.. ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపారు.. 
తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారి సంక్షేమం కోసం తెలుగుదేశం పని చేస్తుంది అని తరచూ సుద్దులు చెపుతుంటారు చంద్రబాబు..
రాష్ట్ర విభజన తర్వాత రెండు కళ్ల సిద్ధాంతం బెడిసికొట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైపోయింది ఆ పార్టీ.. ఏపీకి సీఎం అయి కూర్చున్న బాబు గారు తెలంగాణలో టీడీపీని దాదాపు నిర్వీర్యం చేశారు..
తెలుగుదేశం అనే పేరు పెట్టుకున్న ఆ పార్టీ తెలుగు భాష, సంస్కృతుల వికాసానికి ఏనాడు కూడా చిత్త శుద్దితో పని చేసినట్లు కనిపించలేదు.. పైగా వారి జమానా అంతా బట్లర్ ఇంగ్లీష్ పాలనే..
తెలుగుదేశం నిజంగానే తెలుగు వారి కోసం పుట్టిన పార్టీ అయితే ఆంధ్ర, తెలంగాణాలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా అక్కడ పోటీ చేసి ఉనికి చాటుకునే ప్రయత్నం చేయాలి.. కానీ ఈ సాహసం ఎప్పుడూ చేయలేదు.. పైగా తమకు అమెరికా, అండమాన్ లలో కూడా శాఖలు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటారు.. అమెరికాలోనూ అధికారంలోకి వస్తాం అని లోకేశ్ బాబు జోకేశారు.. అది వేరే విషయం అనుకోండి..
అసలు విషయానికి వద్దాం..
బీజేపీతో మిత్రధర్మనికి తూట్లు పొడిచిన తెలుగుదేశం వారు కర్ణాటకలో ఆ పార్టీకి ఓటు వేయొద్దు, కాంగ్రెస్ వేయండి అని అక్కడి తెలుగు వారిని బతిమిలాడుతున్నారు.. అంటే ఎన్టీయార్ ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆత్మగౌరవ నినాదం ఇచ్చారో, ఆ స్ఫూర్తికి ఇప్పుడు విఘాతం కలిగించే దుస్సాహాసానికి ఒడిగట్టారన్నమాట..
టీడీపీకి నిజంగా తెలుగు వారిపై ప్రేమ ఉంటే, వారి మాట కర్ణాటక తెలుగువారు వింటారు అనే నమ్మకం గనక ఉంటే, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఉనికి చాటుకోవచ్చు కదా?.. నిజంగానే వారు టీడీపీని విశ్వసిస్తే, తెలుగువారి ఆధిక్యత ఉన్న ప్రాంతాల్లో కొన్ని సీట్లు అయినా రాకపోవా?.. కర్నాటకలో ఈ ప్రయత్నం ఫలిస్తే తమిళనాడు, ఒడిశా.. ఇంకా మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ కూడా ఉన్నాయి..
అయినా పోటీ చేస్తే పోయేదేమీ లేదు కదా?.. డిపాజిట్లు తప్ప..

No comments