Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారతదేశంలో అమృతాంజన్ బామ్-ఉండని ఇల్లంటూ వుండలేదేమో

" తలనొప్పులకు,వంటినొప్పులకు వాడండి "అమృతాంజన్ " భారతదేశంలో అమృతాంజన్ బామ్-ఉండని ఇల్లంటూ వుండలేదేమో!!! అంతగా ప్రాచుర్యం పొ...

Image result for amrutanjan
" తలనొప్పులకు,వంటినొప్పులకు వాడండి "అమృతాంజన్ " భారతదేశంలో అమృతాంజన్ బామ్-ఉండని ఇల్లంటూ వుండలేదేమో!!! అంతగా ప్రాచుర్యం పొందిన ఈ అమృతాంజన్ బాంబ్ ను ఎవరు తయారుచేశారో తెలుసా?? ఇంకెవరు మన తెలుగువాడు కాశీనాధుని.నాగలింగం గారు..ఈయనే కాశీనాధుని.నాగేశ్వరరావుగా ప్రసిద్ధి చెందారు.
ఫ్ర్రెండ్స్ మీకు తెలుసా?? ఈ అమృతాంజన్ అమ్మకాలపై వచ్చిన లాభాలన్నింటినీ "పేదవిద్యార్థుల చదువుకే హెచ్చించారు..నాగేశ్వరరావుగారు.సహాయం కోరి తన దగ్గరకు వచ్చినవారికి లేదనకుండా సహాయం చేసేవారు శ్రీ నాగేశ్వరరావుగారు..అందుకే ఆయనకు "దేశోద్ధారక, విశ్వదాత" అని బిరుదులు..
కృష్ణాజిల్లా లోని ఒకమారుమూల గ్రామంలో నివసించినా..తనదైన ప్రతిభతో దేశరాజకీయాలలో ముద్రవేశారు..అయితే ఏనాడూ పదవిని ఆశించలేదు..
తెలుగువారందరినీ చైతన్యపరిచేందుకు ఒక పత్రిక కావాలన్న తలంపుతో 1908 లో "ఆంథ్రపత్రిక అనే వారపత్రికను ప్రారంభించారు..1914లో దానిని దినపత్రికగా మార్చారు.ఇది తెలుగువారిని జాగృతపరచడంలో ప్రముఖపాత్ర వహించింది.
పాత్రికేయుడుగానూ,వ్యాపారవేత్తగానూ, స్వాతంత్రసమరయోధుడుగానూ, సంఘసంస్కర్తగానూ,గ్రంధాలయోద్యమనాయకుడుగానూ, దాతగానూ దేశానికి,తెలుగుప్రజలకు ఎంతో సేవ చేశారు కాశీనాధుని.నాగేశ్వరరావుగారు..
   
"ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సేవలను ఒకసారి గుర్తుచేసుకుంటూ..నివాళులు అర్పిస్తున్నాము"

No comments