బాబు గో గి నేని… ప్రముఖ హేతువాది… బిగ్‌బాస్-2 సీజన్‌లో ఆయన ఎంట్రీ ఇప్పుడు తెలుగు ప్రజల్లో ఓ పెద్ద టాపిక్… అయితే ఆయన ఆ హౌజులోకి వెళ్లి...
బాబు గో గి నేని… ప్రముఖ హేతువాది… బిగ్‌బాస్-2 సీజన్‌లో ఆయన ఎంట్రీ ఇప్పుడు తెలుగు ప్రజల్లో ఓ పెద్ద టాపిక్… అయితే ఆయన ఆ హౌజులోకి వెళ్లి ఎంత పాపులారిటీ సంపాదిస్తాడో ఏమో గానీ.., ఆయన అక్కడుండగానే, ఓ పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది… ఈసారి మరింత బలంగా… తనపైనే తీవ్ర ఆరోపణలు చేస్తూ…! ఈ వివాదంతో తను ఆ బిగ్‌బాస్ సెలబ్రిటీ ఇమేజీకన్నా మరీ మరీ పాపులర్ అయిపోతున్నాడు… కర్నూలు జిల్లాలో, కొన్ని సంవత్సరాల క్రితం, 2009 ప్రాంతంలో శాంభవి అనే అమ్మాయిని బాల సన్యాసిగా ప్రచారంలోకి తీసుకొస్తే…, జనంలో ఓ మూఢనమ్మకాన్ని స్ప్రెడ్ చేస్తున్నారనీ, ఓ అమ్మాయి హక్కులు కాలరాస్తున్నారనీ, ఇదో ఆధ్యాత్మిక దందా అనీ, ఆమెకు మానసిక చికిత్స చేయించాలనీ అప్పట్లో బాబు గోగినేని దాన్ని వ్యతిరేకించాడు… వివాదం మానవ హక్కుల సంఘం దాకా పోయింది… ఆర్డీవో విచారణ కూడా జరిగింది… ఆమెను స్కూల్‌లో చేర్పించి, చదువు చెప్పించాలనేది అప్పట్లో కోర్టు తీర్పు… అప్పట్లో శాంభవి కాంతకాలం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాళ్లింట్లో ఉందట కూడా… సరే, అదంతా ఓ పెద్ద వివాదం… అనేక కథనాలు వచ్చాయి
నేను దలై లామా పూర్వ జన్మలో స్నేహితులం, ఇద్దరమూ కలిసి గౌతమ బుద్ధుని వద్ద శిష్యులుగా ఉండేవాళ్లం, టిబెట్‌కు మరో 3 సంవత్సరాల్లో స్వాతంత్ర్యం ఇప్పించటానికే నేను జన్మించాను… వీర బ్రహ్మేంద్ర స్వామి వీరభోగ వసంతరాయులుగా మళ్లీ జన్మిస్తాడు… దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు… 2012లో మంచి భూమి మిగులుతుంది, చెడ్డ భూమి నశిస్తుంది… భారతదేశం బాగానే ఉంటుంది గానీ చైనా, పాకిస్థాన్, అమెరికా నాశనం అవుతాయి… ఇలా ఆమె చెప్పేది… తనకు చాలా మానవాతీత, దైవశక్తులున్నాయనీ, దలై లామాతో కూడా టెలిపతిలో మాట్లాడుతుందనీ, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ భాష మాట్లాడుతుందనీ ఎట్సెట్రా ఎట్సెట్రా అనేక ప్రచారాలు జరిగాయి… అప్పుడు ఆ పాప వయస్సు ఏడెనిమిదేళ్లు… సీన్ కట్ చేస్తే… తరువాత ఒకటీరెండు సార్లు ఆమె కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో కనిపించింది… కానీ..? ఆమె వెర్షన్ వేరుగా ఉంది…
ఇప్పుడామె మళ్లీ ప్రత్యక్షమైంది… ధర్మశాలలో ఉంటున్నారట… బాబు గోగినేనిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నది… ‘‘మేం సూర్యనంది నుంచి పారిపోయి వచ్చామని ఏదో ప్రచారం చేస్తున్నాడట… తనే ఓ శవాన్ని మా ఆశ్రమం పక్కన పాతిపెట్టించాడు, చాలా ట్రబుల్స్ క్రియేట్ చేశాడు తను… దీంతో రక్షణ కోసం మేం హిమాచల్ ప్రదేశ్ వచ్చేశాం… నా ఫోటోల్ని కూడా మార్ఫ్ చేయించి తన పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడు… రూమర్స్ క్రియేట్ చేస్తున్నాడు… మేం తనపై కఠినంగా వ్యవహరించదలుచుకున్నాం… తను దలై లామా మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నాడు…’’ అని ఓ వీడియోలో వ్యాఖ్యానించింది… ఇది ఇప్పుడు తెలుగు టీవీ చానెళ్లలో హల్‌చల్ చేస్తున్నది… అకస్మాత్తుగా ఆమె ఈ వివాదానికి ఎందుకు ఇప్పుడే తెరలేపినట్టు..? ఓ మిస్టరీ… నిజంగా అప్పట్లో ఆమె ఉంటున్న ఆశ్రమం కథ ఏమైంది..? నిజంగా ధర్మశాలకు పారిపోయి, రక్షణ పొందాల్సినంత పరిస్థితులు ఎవరు క్రియేట్ చేశారు..? ఏ ఉద్దేశంతో చేశారు..? అసలు ఏమిటీ కథ… అదో మిస్టరీ… ఆమె తండ్రి ఇప్పుడు వాళ్లతో లేడు… తనేమయ్యాడు..? తను మరో వీడియో కూడా తెలుగు చానెళ్లకు పంపబోతున్నదట… అందులో ఇంకేం ఆరోపణలు చేయబోతున్నది..? అనేది తెలియాల్సిఉంది.
No comments