గూగుల్ సెర్చ్ లో సమంతా అనో, తమన్నా అనో టైప్ చేయండి. లక్షలాది ఎంట్రీలతో పాటూ వేలాది ఫోటోలు - అవీ హాట్ హాట్ ఫోటోలు - క్షణాల్లో ప్రత్యక్షమౌతాయ...
గూగుల్ సెర్చ్ లో సమంతా అనో, తమన్నా అనో టైప్ చేయండి. లక్షలాది ఎంట్రీలతో పాటూ వేలాది ఫోటోలు - అవీ హాట్ హాట్ ఫోటోలు - క్షణాల్లో ప్రత్యక్షమౌతాయి. వీళ్ల గొప్పదనం ఏమిటి? వలువలు ఉండవు...అంతే కాదు....విలువలూ ఉండవు. అదే వీళ్ల ఘనత.
ఇప్పుడు బాబ్ ఖాతింగ్ అని టైప్ చేయండి. అసలు బాబ్ ఖాతింగ్ ఎవరు? ఆడా మగా? మనిషా, వస్తువా? అన్న ప్రశ్నలను కాసేపు పక్కనబెట్టండి. జస్ట్ బేర్ విత్ మీ....జస్ట్ టైప్ చేయండి.
బీ ...ఓ...బీ...స్పేస్ ....కే....హెచ్....ఏ....టీ...హెచ్ ...ఐ...ఎన్....జీ.....ఎంటర్
ఫేస్ బుక్ లో స్పేస్ బుక్ చేసుకున్న కొద్దిమంది కుర్రాళ్ల ప్రొఫైల్స్ దర్శనమిస్తాయి. ఓ పది పదిహేను ఎంట్రీలు మనం కావాలనుకున్న బాబ్ ఖాతింగ్ వి దొరుకుతాయి. అన్నీ మణిపూర్ లేదా నాగాలాండ్ కి చెందిన సైట్లే....దాదాపు అన్నిట్లోనూ ఒకే వ్యాసం కనిపిస్తుంది.
మరి...ఖాతింగ్ ఫోటో ఉందా?
లేదు....
ఇంతకీ ఎవరీ బాబ్ ఖాతింగ్? మినిషా లాంబా, చెరిల్ చోప్రాలను తిట్టి మరీ తలుచుకోవలసినంత గొప్ప పనేం చేశాడు ఈ ఖాతింగ్? "ఈయన ప్రొఫైల్ ఉంటే ఎంత? ఫోటో లేకపోతే ఎంత? " అనుకుంటున్నారు కదూ....! ఆయన గురించి తెలుసుకునే దాకా నేనూ అలాగే అనుకున్నాను.
ఖాతింగ్ కీ కహానీ తెలుసుకోవాలంటే మణిపూర్ కొండ లోయల్లోని, అరుణాచల్ పర్వత సానువుల్లోకీ ఫ్లాష్ బ్యాక్ అవ్వాలి. అసలు మన దేశం మ్యాప్ లో అవెక్కడున్నాయో తెలుసుకోవాలి. టైమ్ మిషీన్ లో ఓ అరవై ఏళ్లు వెనక్కి వెళ్లాలి.
ఓకే....రివైండ్
1951...అరుణాచల్ ప్రదేశ్
1951....మనందరి కన్నా ముందు సూర్యుడు మంచుకొండలని ప్రేమతో తడిమే అరుణాచల్ ప్రదేశ్ అది. ఆకాశం వెదజల్లిన మంచు హోలీని అద్దుకుని పంచవర్ణాలతో పరవశించిపోతున్న పొడవాటి పైన్ చెట్లు, వాటి మధ్య కొండచిలువలా మెలితిరిగి పడుకున్న కొండ దారి....దక్షిణం వైపు ఒక్కసారిగా లోయ దిగిపోతుంది. అటువైపు ప్రపంచమనేది లేదని, ఆ ఎత్తైన మట్టి దారి మలుపులో భూమి అంతమైపోయిందని అనిపిస్తుంది. ఆ ప్రాంతం వాళ్లెప్పుడూ ఆ కొండదారి దాటలేదు. ఎప్పుడూ ఎవరూ అక్కడికి రాలేదు. అక్కడొకటి, ఇక్కడొకటి చొప్పున ఎవరో విసిరేసినట్టున్న వెదురు ఇళ్లు....! ఇళ్లముందు మహాసౌందర్యపు మంగొలాయిడ్ ముఖాలు, గులాబీ ఎరుపుతో ధగధగలాడే కండలు తిరిగిన శరీరాలతో మోన్పా జాతి ప్రజలు...
అంతలో కొండదారిలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఒకరు కాదు...ఇద్దరుకాదు...ఓ పాతిక ముఫ్పై మంది వస్తున్నారు. "మనపై మరో ప్రపంచం దాడి చేస్తోందా?"
మోన్పాలు బెదిరిపోయారు. భయంతో కేకలు వేస్తూ కత్తులూ, బల్లాలూ అందుకున్నారు.
ఆగంతకులు మోన్పాల వైపే వచ్చారు. చూస్తూ చూస్తూ ఉండగానే దగ్గరకి వచ్చేశారు. వారి ముందు ఓ యువకుడు నిలుచున్నాడు. వచ్చీరాని హిందీలో, విరిగిన ఇంగ్లీషులో వాళ్లకి అభివాదం చేశాడు. భాష అర్ధం కాకపోయినా అతని కళ్లలో ప్రేమను, ఆప్యాయతను అర్ధం చేసుకున్నారు మోన్పాలు. ఆయన వారికి బిస్కెట్లు తన బ్యాగ్ నుంచి తీసి ఇచ్చాడు. కత్తులు, బల్లాలు కింద పడిపోయాయి. తన వద్ద ఉన్న మౌత్ ఆర్గన్ లో పాటలు వినిపించాడు.
గిరిజనుల గుండెలకు సంగీతమే షార్ట్ కట్ రూటు. మోన్పాలు, ఆ పాతిక ముప్ఫై మంది కలిసి నాట్యం చేశారు. ముందు చేతులు పట్టుకున్నారు. తరువాత అడుగులు కలిపారు. తరువాత మనసులు కలిశాయి. భాష రాకున్నా ఒక్కటైపోయారు.
ఇది చాలా పాత అనుభూతి...దీని గురించి వేదాల్లోనే వ్రాశారు
సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవోమనాంసి జానతాం
దేవాభాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే....
( అడుగులు కలుపు...పదాలు కలుపు, మనసులు కలుస్తాయి. మన పూర్వీకులు చేసింది ఇదే...మనమూ ఇదే చేద్దాం....)
ఆగంతకులు అతిథులైపోయారు...
ఆ సాయంత్రం మోన్పాలు వారి కోసం విందు ఏర్పాటుచేశారు. ఆ విందులో ఆ యువకుడు ఓ కర్ర పాతి, జెండాను ఎగరేశాడు.
ఆ జెండాకి మూడురంగులు. పైన కాషాయం. మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ. తెల్లరంగు మధ్యలో నీలం రంగు చక్రం. దానికి 24 రేఖలు.
"మనమంతా భారతీయులం. మనది భారత దేశం. ఇది మనందరి జాతీయ పతాకం. మీకు మేము..మాకు మీరు..మనందరం ఒక్కటి. మీ కష్టాలలో మేము తోడుంటాం..."అన్నాడా యువకుడు.
విచిత్రం....!!మోన్పాలకు ఆ విషయం అర్థమైంది.
అతిథులు ఆత్మీయులయ్యారు. రెండు మూడు రోజుల తరువాత తన మౌత్ ఆర్గన్ ను, డ్రమ్ములను, మువ్వన్నెల జెండాను అక్కడే వదిలేసి వచ్చేసింది ఆ పటాలం.
భావాత్మక వారధి
ఇదొక చారిత్రిక సంఘటనే కాదు. చరిత్రాత్మక సంఘటన కూడా. అంతవరకూ ఇండియా మ్యాపులో ఉండి, ఇండియన్ల మదిలో లేని ప్రాంతం అది. మిగతా దేశంతో దానికి ఎలాంటి సంబంధమూ లేదు. అసలు బ్రిటిషర్లనేవాళ్లు వచ్చారని, వాళ్లనుంచి రెండువందలేళ్లు పోరాడితే స్వాతంత్రం వచ్చిందని తెలియకుండా శతాబ్దాలు గడిపేసిన ప్రాంతం అది. ఆ ప్రాంతంపేరు తవాంగ్. ఆ యువకుడి పేరు బాబ్ ఖాతింగ్.
స్వాతంత్ర్యం వచ్చిన నాలుగేళ్లకు ప్రధానమంత్రి నెహ్రూ మన దేశపటంలో ఉన్న ఈ ప్రాంతం గురించి అధికారులను ప్రశ్నించారు. అందరూ తెల్లముఖాలు వేశారు. "ముందు అక్కడి ప్రజలతో సంబంధాలు పెంచుకొండి " అని నెహ్రూ ఆదేశించారు. ఆ అజ్ఞాత ప్రదేశానికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. కానీ బాబ్ ఖాతింగ్ ధైర్యంతో ముందుకొచ్చాడు. ఆయన ప్రయత్నంతోటే తవాంగ్ కీ, మిగతా భారతదేశానికి భావాత్మక వారధి ఏర్పడింది. అప్పటి వరకూ దలైలామా పీఠమైన పొటాలా ప్యాలెస్ కి కప్పం కట్టిన తవాంగ్ భారతదేశంలో కలిసిపోయింది. 1952 ఫిబ్రవరి 6 వరకూ తవాంగ్ పేరుకు మాత్రమే ఇండియాలో ఉందన్న మాట. ఆ తరువాతే అది నిజంగా ఇండియాలో కలిసిందన్న మాట. నిన్నమొన్నటి దాకా అరుణాచల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దోర్జీ ఖాండు ఈ తవాంగ్ ప్రాంతం వాడే!!
సెలా కనుమ!!
ఇది ఎంత బలమైన వారధి అంటే 1962లో చైనీయులు భారత్ పై దురాక్రమణ చేశారు. ఈ మోన్పాలను తమ వైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఆశలు చూపించారు. లొంగకపోతే అత్యాచారాలు చేశారు. కానీ తవాంగ్ లోని మోన్పాలు మేం భారతీయులం అని గర్జించారు. గంపెడు చైనా సైనికులు, గుప్పెడు భారతీయ సైనికులు ఆ కొండ దారికి అటూ ఇటూగా భీకర పోరాటం చేశారు. వాళ్ల వద్ద బోలెడు ఆయుధాలు. మనవాళ్లకి చలిని తట్టుకునే సాధనాలు సైతం లేవు. నేల మట్టానికి 13800 అడుగుల ఎత్తున యుద్ధం చెలరేగింది.
ఈ భీకర పోరాట సమయంలోనే జస్వంత్ అనే పంజాబీ జవానుకీ, సెలా అనే మోన్పా అమ్మాయికి మధ్య ప్రేమ చిగురించింది. యుద్ధంలో అందరూ చనిపోయారు. ఒక్క జస్వంత్ మిగిలాడు. అతనికి మందుగుండు అందించే వారు కూడా లేని పరిస్థితి వచ్చింది. జస్వంత్ ను ప్రేమించిన సెలా బారు ఫిరంగుల మధ్యనుంచి వచ్చి ప్రియుడికి తోడుగా నిలిచింది. చివరికి జస్వంత్, ఆయన గుండెలపై తల ఆనించి సెలా రణభూమిలోనే ప్రాణాలిచ్చారు. అప్పట్నుంచీ ఆ కనుమ సెలా కనుమ లేదా సెలా పాస్ అయింది. కొండ దిగువనే ఒక చిన్న గ్రామం వెలసింది. దాని పేరు జస్వంత్ గఢ్.
గిరి కుసుమం బాబ్ ఖాతింగ్
బాబ్ ఖాతింగ్ ఎగరేసిన త్రివర్ణ పతాకం ఇప్పటికీ తవాంగ్ లో వేల వేల త్రివర్ణ పతాకాలై రెపరెపలాడుతోంది. బాబ్ ఖాతింగ్ అసలు పేరు రాలెగ్నావ్ ఖాతింగ్. ఆ పేరు పలకలేని బ్రిటిషర్లు ఆయనను బాబ్ ఖాతింగ్ చేసేశారు. 1912 ఫిబ్రవరి 28 న పుట్టిన ఖాతింగ్ 1942లో 19 హైదరాబాద్ రెజిమెంట్ లో చేరాడు. మణిపూర్ కి చెందిన మొదటి మిలటరీ ఆఫీసర్ ఆయన. తొలి క్యాప్టెన్, తొలి మేజర్ కూడా ఆయనే. ఆయన సాహసానికి 1944లో ఆయనకు కింగ్స్ క్రాస్ ప్రదానం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. సెప్టెంబర్ 12, 1947న ఆయన మణిపూర్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల పాలన శాఖ మంత్రి అయ్యాడు. 1948 లో ఆయన జాదెర్ నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎన్నికయ్యాడు. 1950 లో అస్సాంలో భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు ఆయన గణనీయమైన సేవలందించాడు. అంటే ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయన భూకంప సమయంలో వాలంటీర్ గా పనిచేశాడన్న మాట. సెలా పాస్ అధిగమించి, తవాంగ్ వెళ్లాడన్న మాట. 1957లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రదానం చేసింది. 1971లో ఆయన బర్మా (మ్యాన్మార్) లో భారత రాయబారిగా పనిచేశాడు. 1979లో మణిపూర్ గవర్నర్ కి ప్రత్యేక సలహాదారుగా పనిచేశాడు. ఎక్కడో మారుమూల మణిపూర్ లోని మరీ మారుమూల ఉఖ్రుల్ జిల్లాలోని ఓ కొండ గ్రామంలోపుట్టిన ఖాతింగ్ అరుణాచల్ మ్యాప్ కు అర్ధం కల్పించాడు. అదీ ఆయన ఘనత.
ఉఖ్రుల్ కే దో బేటే!!
నిజానికి తవాంగ్ మాదేనంటూ చైనా మొండివాదన చేస్తున్న తరుణంలో ఖాతింగ్ మొత్తం దేశానికి ప్రాతస్మరణీయుడవ్వాలి. ఆయన ఫోటో ఇంటింటా పెట్టుకోవాలి. తమాషా ఏమిటంటే ఉఖ్రుల్ జిల్లా నుంచే ఇంకో వ్యక్తి కూడా దేశవ్యాప్తంగా పేరొందాడు. ఖాతింగ్ తవాంగ్ ను భారత్ లో కలిపితే, రెండో ఆయన మొత్తం నాగాలాండ్ ను దేశం నుంచి వేరు చేయాలని పోరాడుతున్నాడు. ఆయన పేరు థింగ్లెంగ్ ముయివా. ఇంటర్నెట్ లో ఖాతింగ్ ఫోటో దొరకదు కానీ ముయివా ఫోటో తప్పక దొరుకుతుంది.
అసలు దేవుళ్లను మరిచిపోయి తప్పుడు దేవుళ్లను కొలిచే భారతీయులకు ఖాతింగ్ లు కరువైపోవడం ఎంత ఖాయమో, ముయివాలు దొరకడమూ అంతే ఖాయం.
పి.ఎస్ - ఖాతింగ్ తన కూతురుకి ఏం పేరు పెట్టుకున్నాడో తెలుసా...? సెలా....సెలా కనుమ అంటే ఖాతింగ్ కి అంత ఇష్టం!!

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
Superb
ReplyDeleteTq sodara
ReplyDelete