Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందువులు హిందువుగా జీవించాలి - megamindsindia

అయేషా గా మారిన అతీరా (Real story happened in Kerala) 23 సంవత్సరాల "అతిరా" (హిందువు)  అమ్మాయి కేరళలో కాసర్గాడ్ అనే ప్రాంతానికి ...

అయేషా గా మారిన అతీరా
(Real story happened in Kerala)
23 సంవత్సరాల "అతిరా" (హిందువు)  అమ్మాయి కేరళలో కాసర్గాడ్ అనే ప్రాంతానికి చెందింది. చెప్పా పెట్టకుండా ఒక రోజు రాత్రి ఇంటిలో నుండి పారిపోయింది. పారిపోతూ ఒక 15 పేజీల ఉత్తరం రాసివెళ్లింది.
పొద్దున్నే లేచి చూసేసరికి తమ కూతురు కనబడకపోవడంతో గుండెలు బాదుకున్నారు తల్లిదండ్రులు. తాను రాసిన పదిహేను పేజీలు ఉత్తరం చదివారు. దాంట్లో ఒకచోట నేను ముస్లిం మతం గూర్చి, ఖురాన్ గూర్చి తెలుసుకోవడానికి వెళ్తున్నాను, నా గురించి వెతకద్దు అని రాసి ఉంది. అది చదివి భయపడిన తల్లిదండ్రులు ఇదేదో లవ్ జిహాద్ ( ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుని మతమార్పిడి చేయటం) లాగా ఉంది అని పోలీస్ స్టేషన్,  హై కోర్టుని ఆశ్రయించారు.
కోర్టు అతీరాని వేతకమని పోలీసులకి ఆదేశించింది. అతిరా కోసం పోలీసులు గాలించి ఒక నెల తర్వాత అతీరాని పట్టుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు అతీరా తన అమ్మ నాన్న తో కలిసి ఇంటికి వెళ్ళింది.
కానీ అప్పటికే అతీరా - అయేషా గా మారిపోయింది. తన ముస్లిం స్నేహితుల మాటలు నమ్మి ముస్లిం మతంలోకి మారింది. ఆ తర్వాత తన పేరుని అతీరా నుండి అయేషా గా మార్చుకుంది.
అమ్మానాన్న తో కలిసి ఇంటికి వచ్చాక బురఖా (ముసుగు) వేసుకొని మీడియా ముందుకు వచ్చి తన ఇష్టపూర్వకంగానే ముస్లిం మతంలోకి మారాను అని అంది !
Image result for love jihad
కొన్ని నెలల తరువాత అదే అదే మీడియా ముందుకు వచ్చి ముసుగు తీసి "ఓం నమశ్శివాయ" అంటూ తనకు జరిగిన అన్యాయాన్ని, తాను మోసపోయిన విదానాన్ని వివరించింది !
జూలై మొదటి వారంలో అతీరా తన ఇంటి నుండి పారిపోతూ 15 పేజీల ఉత్తరం రాసింది.
అతీరా తల్లితండ్రులు కేరళ హైకోర్టు కెళ్ళి ఇలా తమ బిడ్డ ముస్లిం మతం గూర్చి తెలుసుకుంటాను అని వెళ్లి ఇలా ముస్లిం మతంలోకి మారిపోయి వచ్చింది దీనివెనుక ఏదో కుట్ర ఉంది అని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అతీరా తన తల్లి తండ్రులతో ఇంటికి వెళ్ళింది.
కొన్ని నెలలు పోయిన తరువాత అతీరా మాములు మనిషి అయ్యింది. తాను  ఎందుకు ఇంటి నుండి పారిపోయానో, ఎందుకు ముస్లిం మతంలోకి మారానో, దానికి కారణాలు ఏంటో మీడియా ముందుకోచ్చి ఇలా వివరించింది.
అతీరా మాటల్లో......
ఓం నమశ్శివాయ ! నా ముస్లిమ్ స్నేహితులు నన్ను తప్పుదోవ పట్టించారు. హిందువులు (నేను) ముర్ఖులు, రాయిని, చెట్టుని పూజిస్తారు. హిందువులకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. నిజానికి అల్లాహ్ ఒక్కడే నిజమైన దేవుడు. ఆయన్నే మనం పూజించాలి. అని నా స్నేహితులు నాకు విషం నూరిపోశారు.
ఆ తరువాత వాళ్ళు ముస్లిం మతం గూర్చిన కొన్ని పుస్తకాలు ఇచ్చారు, వాటిలో ఓ పుస్తకం నరకం గూర్చి ఉంది. నరకం గూర్చిన ఆ పుస్తకం చదివిన తరువాత నాకు చాలా భయం వేసి రాత్రులు నిద్ర పట్టలేదు. చివరికి నేను అనుకున్నాను ముస్లిం మతంలోకి నేను మారకపోతే నేను కూడా ఆ నరకానికే పోతాను అని భయపడ్డాను.
ఆ తరువాత వాళ్ళు ముస్లిం మత ప్రచారకుడు & ఉగ్రవాది అయిన జాకీర్ నాయక్ యొక్క ప్రసంగాలు వినమని ఇచ్చారు అవి కూడా విన్నాను.
వాళ్ళ మాటలు విన్నాక, పుస్తకాలు చదివాక ముస్లిం మతంలోకి మరిపోవాలి, హిందూ మతం చాలా చెడ్డది అనే భావన నాలో కలిగింది.
ఆ తరువాత నన్ను ఒక వాట్సప్ గ్రూప్ లో అడ్ చేశారు, ఆ గ్రూప్ లో నాలాంటి వారు ఒక 7 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు కూడా హిందువులే, ముస్లిం అబ్బాయిలని ప్రేమించి ముస్లిం మతంలోకి మారారు !
కోర్టు ఆదేశం మేరకు నేను ఇంటికి వెళ్ళాక మా అమ్మనాన్నని కూడా ముస్లిం మతంలోకి మారమన్నాను. వాళ్ళు దానికి ఒప్పోకోలేదు,
వాళ్లు ఒప్పుకొని ప్రతి సారి వాళ్ళ మీద నేను కోపం తో ఊగిపోయేదాన్ని. ఖురాన్ లో ఇలా రాసి ఉంది "అల్లాని నమ్మని వాళ్లు కాఫీర్లు, వాళ్ళ మీద ప్రేమ చూపించకూడదు అని".
నేను ఇలా ముస్లిం గా మారటం ఇంట్లో అమ్మానాన్న కి ఇష్టం ఉండదు కాబట్టి, ఇంట్లో ఉండటం కన్నా బయటకి వెళ్లిపోవడం కరెక్ట్ అని
మా ముస్లిం స్నేహితులు చెప్పిన ముస్లిం సంస్థల వారితో కలిశాను. Popular front of india లో సిరాజ్ అనే వ్యక్తి నాతో కలిసి మా అమ్మానాన్న నా గూర్చి కోర్టు కెళితే కోర్టులో నేను ఎలా వాదించాలి, ఏమి మాట్లాడాలి అనేది కూడా ట్రైనింగ్ ఇచ్చాడు.
చివరిగా మా అమ్మానాన్న నన్ను కాపాడుకునే ప్రయత్నంగా ఆర్ష్య విద్య సమాజం వారిని కలిశారు. ఆర్ష్య విద్యా వారు నాకు సరైన సమాచారాన్ని ఇచ్చారు. వారు ఖురాన్ నాకు ఇచ్చి మళ్ళీ ఇంకోసారి చదవమన్నారు.
మనసులో ఏదో ఉద్దేశ్యం పెట్టుకొకుండా,
పక్కవారి మాటలు నమ్మి అదే నిజం అనుకోకుండా, ఖురాన్ ఉన్నది ఉన్నట్టుగా చదవమన్నారు.
ఓపెన్ మైండెడ్ తో ఎటువంటి ఆలోచన లేకుండా ఖురాన్ చదివాను. ఈసారి చదువుతున్నప్పుడు నాలో చాలా సందేహాలు మొదలయ్యాయి.
మళ్లీ మళ్లీ కురాన్ చదివాను, నాకు ఖురాన్ లో చాలా తప్పులు ఉన్నాయని అర్థం అయింది.
ఇస్లాం మతం సరైనది కాదని తెల్సిపోయింది.
ఆర్ష్య సమాజం వారు నన్ను ఎలాంటి బలవంతం పెట్టలేదు నాకు నేనుగా ఖురాన్ ని పూర్తిగా అధ్యయనం చేసి దాంట్లో తప్పులు ఉన్నాయని అర్థం చేసుకొని ఇస్లాం సరైన మతం కాదని అందులో నుండి బయటకొచ్చేసాను.
నిజానికి అతీరా చాలా అదృష్టవంతురాలు. సరైన సమయంలో అతీరా తల్లిదండ్రులు స్పందించి  తమ కూతురిని కాపాడుకున్నారు,  లేదంటే అతీరా చివరికి ISIS తీవ్రవాదిగానో లేదా లష్కరే తోయిబా కి సెక్స్ వాంఛలను తీర్చే బానిసగానో మారిపోయేది.
హిందువులలో ఉన్న ప్రధాన సమస్య అన్ని మాతాల సారం ఒకటే, అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని గుడ్డిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా నమ్ముతారు. కనీసం మనం మన రామాయణం, భారతం కూడా చదవం, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఏమి చెప్పరు.
ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ మత మార్పిడి మాఫియా, ఇస్లాం మాఫియా అమాయక హిందువుల్ని తమ మతం లోకి మార్చుకోవాలని ఊరూరా తిరుగుతున్నారు.
క్రైస్తవులు, ముస్లింలు ప్రచారకులు
హిందువులు ఉండే గ్రామాల్లో, స్కూళ్లల్లో, కాలేజీల్లో, రైలు, బస్సు, ఎక్కడపడితే అక్కడ మతప్రచారం పేరుతో మాయ మాటలు చెప్పి,
హిందు మతం మీద విషం నూరిపోసి,
హిందువుల దేవుళ్ళు రాళ్లు, సైతానులు అని, నిజమైన దేవుడు యేసు, అల్లా మాత్రమే
రాముణ్ణి కృష్ణుడిని పూజిస్తే  నరకానికి పోతాము అని హిందువుల్ని భయపెడుతున్నారు. తమ మతాల్లోకి మార్చుకుంటున్నారు.
మనం హిందువులం, అన్ని మతాలు సారం ఒకటే అనే అబద్దాన్నీ నమ్మాల్సిన పనిలేదు.  మన పిల్లలకి, మన స్నేహితులతో జరుగుతున్న పరిణామలపై చర్చిద్దాం. ముఖ్యంగా బైబిల్, ఖురాన్ కి హిందూ గ్రంధాలకి ఉన్న తేడాని వివరిద్దాం. వారిని మతమార్పిడి నుండి కాపాడుకుందాం. లేదంటే మీ పిల్లలు కూడా మీ స్నేహితులు కూడా అతీరా లాగా మోసపోయి ఇంటికి దూరమై, మతం మారిపోయి,  తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు.
కేరళ లో పత్రికలలో వచ్చిన  వార్త ......యాదిరెడ్డి

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments