ఒక పడవ ఇంజన్ చెడిపోయింది. యజమాని ఎంత ప్రయత్నించినా అది బాగుపడలేదు. చాలా మంది ఇంజనీర్లు, కన్సల్టెంట్లు, ఎక్స్ పర్టులు వచ్చారు. వెళ్లారు....
ఒక పడవ ఇంజన్ చెడిపోయింది.
యజమాని ఎంత ప్రయత్నించినా అది బాగుపడలేదు. చాలా మంది ఇంజనీర్లు, కన్సల్టెంట్లు, ఎక్స్ పర్టులు వచ్చారు. వెళ్లారు.
ఇంజన్ మాత్రం యథాతథం.
చివరికి ఒక ముసలి మెకానిక్ వచ్చాడు.
" పడవను నేను బాగు చేస్తాను" అన్నాడు.
ఎందరో నిపుణులు చేయలేనిది ఈ ముసలి మెకానిక్ ఏం చేయగలడు అనుకున్నాడు యజమాని, అయినా ఒకసారి ప్రయత్నిస్తే పోయేదేమిటిలెమ్మని " సరే...నీ ఫీజు ఎంత?' అని అడిగాడు.
"అయ్యా....వెయ్యి రూపాయలు. అదీ పనయ్యాకే ఇవ్వండి"
"సరే ...కానీ..."
ఆ మెకానిక్ ఇంజన్ ను కాసేపు పరిశీలనగా చూశాడు. ఆ తరువాత తన టూల్ బాక్స్ ను తీసి సుత్తి బయటపెట్టాడు.
ఒక చోట నెమ్మదిగా దెబ్బ వేశాడు.
అంతే...
ఇంజన్ స్టార్టయింది.
యజమాని ఇదంతా చూశాడు.
"ఏమయ్యా...నువ్వు ఒక చిన్న దెబ్బ వేశావు. దానికే వెయ్యి రూపాయలా?"
"చిత్తం...నుత్తి దెబ్బకి రెండు రూపాయలండీ. అయితే ఎక్కడ కొట్టాలో తెలిసినందుకు 998 రూపాయలండీ" అన్నాడు ఆ ముసలి మెకానిక్ ....
No comments