Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మమతా బెనర్జీ దేశద్రోహానికి ఎందుకు పాల్పడుతుంది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ మధ్య- ‘శ్రీరామ నవమి ఉత్సవాలను జరగనివ్వను.. మొహర్రం రోజున దుర్గాపూజ చేయడానికి వీలులేదు.. దీనిని మ...

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ మధ్య- ‘శ్రీరామ నవమి ఉత్సవాలను జరగనివ్వను.. మొహర్రం రోజున దుర్గాపూజ చేయడానికి వీలులేదు.. దీనిని ముస్లిం సంతుష్టీకరణ అని మీరు అనుకుంటే నా జీవితమంతా ఇదే విధానాన్ని అనుసరిస్తా..’ అన్నారు. మొన్న ఝార్ఖండ్‌లోని ఓ మిషనరీ హోంలో పసిపిల్లల అమ్మకం వ్యవహారం వెలుగు చూసింది. దీనిపై మమత మాట్లాడుతూ- ‘ఆ మిషనరీలకు నేను ఆశ్రయం ఇస్తా..’ అని ప్రకటించారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో పసిపిల్లల అమ్మకం జరగడాన్ని ఒక ముఖ్యమంత్రి ఇలా సమర్ధించడం సబబేనా? మమతపై ఇప్పటికే శారదా చిట్‌ఫండ్ స్కాం, నారదా టేప్‌ల స్కాంలు ఉన్నాయి. వాటి నుండి తప్పించుకొని, తృతీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ప్రధాని కావాలని ఆమె భావిస్తోంది.
కాగా, ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు ‘భారత్‌లో సివిల్ వార్ వస్తుంది’ ఓ ఇంగ్లీషు టీవీ చానల్‌లో ప్రకటించాడు. ఇతడు అతివాద, ఉగ్రవాద చైనా ప్రేరేపిత సామ్యవాదుల మద్దతుదారుడు. ఈయన ఇండియాలో సివిల్‌వార్‌ను ప్రోత్సహిస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నది? మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశి ధరూర్- ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ దేశం ‘హిందూ పాకిస్తాన్’గా మారబోతున్నదని వ్యా ఖ్యానించాడు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మోదీని పాకిస్తాన్ నియంత జియా ఉల్ హక్‌తో పోల్చాడు. శశి ధరూర్, దిగ్విజయ్‌లకు ప్రజల్లో, కాంగ్రెస్‌లో ఎంత చెడ్డపేరు ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ‘హిందూ కాషాయ ఉగ్రవాదం’ అనే పదాన్ని సృష్టించి దిగ్విజయ్ గతంలోనే వివాదాలకు ఆజ్యం పోశాడు.
No automatic alt text available.
2004లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇజ్రత్ జహానా అనే ఉగ్రవాద నాయకురాలు ఆయనను హత్యచేయడానికి అహమ్మదాబాద్ వచ్చింది. ఇంటెలిజెన్స్ వర్గాల వల్ల సమాచారం ముందే తెలుసుకున్న గుజరాత్ పోలీసులు ఆమెను ఎన్‌కౌంటర్ చేశారు. అప్పుడో ‘బిహారీ బేటీ’ని నిర్దాక్షిణ్యంగా చంపారని దిగ్విజయ్ నానా రభస చేశాడు. కాంగ్రెస్‌కు చెందిన మరోనేత మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ వెళ్లి అక్కడి ఐఎస్‌ఐ సంస్థతో ‘మీరు సహాయం చేయకపోతే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడం అసాధ్యం’ అని ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ కఠోర సత్యాలు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇలా జరుగుతోందా?
దళితులకు అన్యాయం జరుగుతోందంటూ ఉద్యమాలు నడిపిన పి.ఎల్.విశే్వశ్వరరావు బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలనలో దళిత యువకుడు త్రిలోచన మెహతోను హత్యచేసి, చెట్టుకు వేలాడదీసినప్పుడు ఎందు కు నోరెత్తలేదు? ఎందుకంటే త్రిలోచన మెహతో భాజపా కార్యకర్త కనుక. కర్నాటకలో గౌరీ లంకేశ్ అనే మహిళా జర్నలిస్టును హత్యచేసినప్పుడు అల్లరిచేసిన సూడో సెక్యులరిస్టులు శ్రీనగర్‌లో ఉగ్రవాదులు ‘రైజింగ్ కశ్మీర్’ సంపాదకుడు సయ్యద్ బుఖారీని హత్య చేసినపుడు ఎందుకు ఖండించలేదు? ఈ ద్వంద్వ ప్రమాణాలేమిటి? మన దేశంలో కోట్లాది మంది పూజించే శ్రీరాముడిని కత్తి మహేశ్ అనే విమర్శకుడు తిట్టడం ఏమిటి? అతనికి తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ విధిస్తే కొందరు అది అప్రజాస్వామిక చర్య అని ఆందోళన చేశారు. చట్టబద్ధంగా ఎన్నికైన నరేంద్ర మోదీని, ఆయన మంత్రివర్గంలో కొందరిని హత్య చేసేందుకు వేర్పాటువాదులు, తీవ్రవాదులు ప్రయత్నాలు చేశారు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గానీ, సెక్యులర్ నేతలు గానీ ఏం సమాధానం చెబుతారు?
కొన్ని కులాలను అవహేళన చేస్తూ పుస్తకం రాసిన ప్రొ. కంచె ఐలయ్యపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవు. కానీ- సత్వగుణ స్వభావుడైన పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్‌లో ఉండరాదంటూ నగర బహిష్కరణ శిక్ష విధించారు. ఆయన చేసిన నేరం ఏమిటంటే- ‘హిందువులంతా సంఘటితం కావాలి’అని పిలుపునివ్వడం, యాదాద్రి ఆలయానికి పాదయాత్ర చేయాలని అనుకోవటం. ప్రజలను రెచ్చగొట్టి పరిపూర్ణానంద మతకల్లోలాలు సృష్టిస్తున్నాడని కొందరు ఆరోపిస్తున్నారు. మరి మజ్లిస్ పార్టీ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీల ప్రసంగాలు మత కల్లోలాలు రెచ్చగొట్టేవి కావా? భారత్‌లో హిందువులకు, ముస్లింలకు వేర్వేరు రాజ్యాంగాలున్నాయా? రాజ్యాంగం ఎదుట అందరూ సమానం కాదా?
కేరళలో కొందరు రోమన్ కాథలిక్ బిషప్పులు ఐదుగురు నన్స్‌పై అత్యాచారాలు చేస్తుంటే వారిని అరెస్టుచేశారు. హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయలేదు. మన రాజకీయ నాయకులు మాత్రం ఈ సంఘటనను అసలు పట్టించుకోలేదు.. ఎందుకని? ఎన్నికలలో క్రైస్తవ వర్గాల ఓట్లు తమకు పడవన్న భయం వల్లే. దీనిని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం- సెక్యులరిజం- అంటారా?
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ మధ్య- ‘దేశంలోని సహజ వనరులు అన్నింటిపైనా మైనారిటీలకు మాత్రమే హక్కులు ఉంటాయి’ అన్నారు. ఈ ప్రకటనకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. శశి ధరూర్ చేసిన ‘హిందూ పాకిస్తాన్’ వ్యాఖ్యలపైనా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పలేదు. ఇండియా ‘ఓ పశువుల సంత’ అని గతంలో వ్యాఖ్యానించిన శశి ధరూర్ ఇపుడు మరింత పదునైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మైనారిటీ మేధావుల సమ్మేళనంలో మాట్లాడుతూ-‘గుజరాత్, యూపీ ఎన్నికల సందర్భంగా నేను దేవాలయాలకు వెళ్లిన మాట నిజమే- ఇకపై అలాంటి పొరపాటు జరగదు’ అన్నారు. కులం, మతం పేరిట వోట్లు అడగడం రాజ్యాంగ రీత్యా నేరమే కదా!
ఇండియా చాలా విచిత్రమైన దేశం. ఇక్కడ అందరికీ ముస్లిం, క్రైస్తవ వోట్లు కావాలి. హిందువుల ఓట్లు మాత్రం అక్కర్లేదు. ఎందుకంటే హిందువులు పోలింగ్ సమయంలో ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తుంటారు. లేదా తమ ఓట్లను మూకుమ్మడిగా ఒక మంచి అభ్యర్థికి బదులు తమ తమ కులాలకు చెందిన వారికి వేస్తుంటారు. ఇదే అసలు రహస్యం. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్-‘మోదీ ప్రభుత్వం భారత విద్యావిధానాన్ని భ్రష్టుపట్టించిందని, యూజీసీని రద్దుచేసి హిందూత్వ విషం చిమ్ముతున్నదని, పిల్లలకు విద్య అందుబాటులోకి రాకుండా పోయింద’ని తన పార్టీ పత్రిక ‘పీపుల్స్ డెమోక్రసీ’లో పేర్కొన్నారు. నయా ఉదారవాదం (నియో లిబరలిజం) దేశంలో ప్రవేశించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నయా లిబరలిజం అంటే ఏమిటి? అమెరికన్ మాల్స్‌కు మన్మోహన్ సింగ్ హయాంలో తలుపులు బార్లా తెరిచినప్పుడు వామపక్ష నేతలు మాట్లాడలేదు. చైనా దిగుమతులపై ఇండియా దిగుమతి సుంకం తగ్గించినప్పుడు వీరు నోరెత్తలేదు.
కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రశ్నపత్రాలను కొని విద్యావ్యాపారం చేసినపుడు వీరు మాట్లాడలేదు. నారాయణ కళాశాలల అధినేత ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడు. చంద్రబాబుకు సీపీఎం వారు గతంలో మిత్రులే. అందుకనే కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలపై ‘కామ్రేడ్లు’ నోరు మెదపడం లేదా? భారత్‌లో మతాంతరీకరణలను ప్రోత్సహించిన సోనియా గాంధీకి గతంలో ప్రకాశ్‌కారత్ మద్దతునిచ్చిన విషయం ప్రజలు మరచిపోలేదు.
హిందువులపై, వారి మత గ్రంథాలపై నిత్యం విమర్శించే ‘సెక్యులర్ నేతలు’ ఈ దేశంలో పసిపిల్లల విక్రయంపై గళం విప్పరా? ఈ నేతలంతా కలసి నూరు కోట్ల మంది హిందువులపై ఎందుకింత విషం కక్కుతున్నారు? ఎందుకంటే క్రైస్తవుల్లో, ముస్లింల్లో ఉన్న ఐకమత్యం హిందువులలో లేదు. హిందువుల్లో వందలాది కులాలు, ఉప కులాలు ఉన్నాయి. వీరిలో ఏకతాభావం లేదు. అందుకే చైనా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాలు తమ తమ ఏజెంట్లతో భారత్‌లో కుట్రలు కొనసాగిస్తున్నాయి.
దేశంలో జాతీయ భావన కోసం కృషి చేస్తున్న మోదీ అంటే విపక్షాలకు ఎందుకింత కోపం? మోదీని అపఖ్యాతిపాలు చేయడమే విపక్షాల ఏకైక అజెండా. అందుకే కర్నాటకలో 36 సీట్లు వచ్చిన కుమార స్వామిని సీఎంగా చేసేందుకు కాంగ్రెస్ బరితెగించింది. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ అన్న మోదీ నినాదాన్ని కూడా విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి.

No comments