Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సాగరతీరంలో ఒక అందమైన పీత - raka sudhakar

సాగరతీరంలో ఒక అందమైన పీత.... ఎనిమిది కాళ్ల బుడిబుడి నడకలతో హొయలుపోతూ తీరమంతటా సందడి చేస్తోంది. ఇసుకపై దాని కాలి అడుగుజాడలు అందంగా గీసిన ముగ...

సాగరతీరంలో ఒక అందమైన పీత....
ఎనిమిది కాళ్ల బుడిబుడి నడకలతో హొయలుపోతూ తీరమంతటా సందడి చేస్తోంది.
ఇసుకపై దాని కాలి అడుగుజాడలు అందంగా గీసిన ముగ్గులా కనబడుతున్నాయి.
అంతలోనే సముద్రపుటల విసురుగా వచ్చింది.
ఆ అడుగుజాడలు చెరిపేసింది.
పీతకి కోపం వచ్చింది.
"ఏమిటిది సముద్రా.... నువ్వు నాకు దోస్తువనుకున్నాను. నా అందమైన అడుగుజాడలను ఎందుకు చెరిపేస్తున్నావు..." అని విసురుగా విమర్శించేసింది. అంతటితో ఆగకుండా "నేనంటే నీకు అసూయ" అంటూ మెటికలు విరిచింది.
"లేదు మిత్రమా.... నీ అడుగుజాడలను పట్టుకుని ఎవరైనా వేటగాడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడేమోనని నా భయం. అందుకే అడుగుజాడలు దొరక్కుండా చేశాను."
పీత కృతజ్ఞతతో సముద్రాన్ని ముద్దాడింది.
మిత్రుడినే అనుమానించినందుకు సిగ్గుతో తలవంచుకుంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments