Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆత్మసాక్షి

గురువు చెబుతున్నాడు... శిష్యుడు వింటున్నాడు.... "ఒక ఊరిలో ఒక ధనిక వ్యాపారి అద్భుతమైన భవనాన్ని కట్టించాడు. పాలరాతి ఫ్లోరింగ్, అందమైన గవ...

గురువు చెబుతున్నాడు...
శిష్యుడు వింటున్నాడు....
"ఒక ఊరిలో ఒక ధనిక వ్యాపారి అద్భుతమైన భవనాన్ని కట్టించాడు. పాలరాతి ఫ్లోరింగ్, అందమైన గవాక్షాలు, అద్భుతమైన నగిషీలు, కళ్లు మిరుమిట్లు గొలిపే అలంకరణలు... ఇలా ఏ కోణం నుంచి చూసినా ఆ భవనానికి సాటిలేదు"
శిష్యుడు ఆసక్తిగా వింటున్నాడు.
" ఆ ఇంట్లో మాత్రం కుక్కలు, గాడిదలు, పందులు, ఎలకలు నివాసముంటున్నాయి. ఇల్లు పాడుబడిపోతోంది"
" ఆ ఇంటికి కాపలా లేదేమో"


"అవును నాయనా... అదే నిజం"
"ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుంది గురువుగారూ" ఉండబట్టలేక శిష్యుడు అడిగేశాడు.
"మన శరీరమే ఆ భవనం నాయనా. దీనికి ఎనలేని అందం ఉంది. అన్ని అవయవాలు, ఎన్నో వ్యవస్థలూ ఉన్నాయి. కానీ కాపలా సరిగ్గా లేదు. అందుకే కామమనే కుక్క, క్రోధమనే గాడిద, లోభమనే పంది, మోహమనే ఎలకా ఈ దేహ భవనంలో కాపురం చేస్తున్నాయి."
"మరి కాపలాదారుడెవరు గురువుగారూ"
"ఆత్మసాక్షి నాయనా"

No comments