Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఈ కథ లో నీతి మీరే చెప్పాలి చదివి

                  పడవ ప్రమాదంలో చిక్కుకుంది.  అలల తాకిడికి భయంకరంగా అటూ ఇటూ ఊగుతోంది.  విపరీతమైన గాలులు వీస్తున్నాయి... చూస్తూ చూస్తూనే తుఫ...

                  పడవ ప్రమాదంలో చిక్కుకుంది. అలల తాకిడికి భయంకరంగా అటూ ఇటూ ఊగుతోంది. విపరీతమైన గాలులు వీస్తున్నాయి... చూస్తూ చూస్తూనే తుఫాను ముంచుకొచ్చింది. పడవలో వారంతా ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉన్నారు. ఒక ప్రయాణికుడు మాత్రం బిగ్గరగా ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టనారంభించాడు. "బాబోయ్ ... ఈ దిక్కుమాలిన పడవ ఎక్కానురోయ్... ఇది ఎందుకూ పనికిరాదు... ఇక్కడ నాకు రక్షణేది" అని అరవ సాగాడు. వారి అరుపుల వల్ల ఇతరులకూ భయం పట్టుకుంది.
                 పడవ సరంగు అది చూశాడు. ఒక్క ఉదుటున ఆ వ్యక్తికి తాడు కట్టి, నీళ్లలోకి విసిరేశాడు. వాడు అయ్యో కుయ్యో అంటూ కేకలు వేశాడు. కాపాడండి... కాపాడండి అంటూ అరిచాడు. సరంగు నెమ్మదిగా తాడు లాగి వాడిని పడవలోకి తీసుకొచ్చాడు.
ఈసారి వాడు ఉలుకూ పలుకూ లేకుండా ఒక మూలన కూచున్నాడు."ఇప్పుడు అర్థమైందా నీకు రక్షణ ఎక్కడుందో? ఎంత ప్రమాదంలో ఉన్నా ఈ పడవే నీకు దిక్కు..."

No comments