"ఛీ... ఇదేం బతుకు" వందోసారి అనుకున్నాడు జ్యోతి రాజ్. కోపంతో... చికాకుతో.... విసుగుతో బండరాళ్లను ఎక్కేస్తున్నాడు. వేగంగా.... మరి...
"ఛీ... ఇదేం బతుకు"
వందోసారి అనుకున్నాడు జ్యోతి రాజ్.
కోపంతో... చికాకుతో.... విసుగుతో బండరాళ్లను ఎక్కేస్తున్నాడు. వేగంగా.... మరింత వేగంగా ఎక్కేస్తున్నాడు...
"ఈ బతుకు వృధా... దీనికన్నా చావడం మేలు... చిన్నప్పుడే ఇంట్లోంచిపారిపోయాను.... తల్లిదండ్రులకు అన్యాయం చేశాను... హోటల్ బాయ్ గా పనిచేశాను... తిట్లు, చివాట్లు తినడమే పనిగా బతికాను... మదురై నుంచి చిత్రదుర్గ పారిపోయాను. అక్కడ ఒక అమ్మ ఆశ్రయం ఇచ్చింది. ఇంటి పనులు చేయించుకుని ఇంత అన్నం పెట్టేది. ఇప్పుడు నాకు అన్యాయంగా అదే అమ్మ చేయని దొంగతనం అంటగట్టింది.... ఎందుకీ బతుకు బతకడం... ఇంతకన్నా చావడం మేలు" నూటొక్కటో సారి అనుకున్నాడు జ్యోతిరాజ్. కొండపైకి ఎగబాకేస్తున్నాడు. అవలీలగా బండరాళ్లను ఎక్కేస్తున్నాడు. "ఇక్కడ నుంచి కిందకి దూకేస్తే...." అనుకున్నాడు. " లేదు... ఈ ఎత్తు సరిపోదు. కాళ్లూ చేతులు విరుగుతాయేమో కానీ చావనేమో.... మళ్లీ ఆ బతుకెందుకు? చావాలి... నేను చావాలి" మళ్లీ అనుకున్నాడు.
నూట రెండో సారి. కొండపైకి ఇంకా ఇంకా ఎగబాకనారంభించాడు. కోపం, విసుగు, ఆవేశం, ఉద్రేకం, ఉద్వేగం కలగలిసి చకచకా పైకి ఎక్కించేస్తున్నాయి. తాను ఎంత ఎత్తు ఎక్కాడో తెలియడం లేదు. చప్పట్లు ... కేరింతలు వినిపిస్తున్నాయి. ఇదేమిటి.... కిందకి చూశాడు జ్యోతిరాజ్. తాను పైకెక్కుతుంటే కింద జనం గుమిగూడారు . "వారెవా... బ్రదర్... యూ కెన్ డూ ఇట్... కమాన్.... ఎక్కు.... కొండ చివరికి ఎక్కు...." కిందనుంచి కేకలు... అరుపులు...
కమాన్.... కమాన్... యూ కెన్ డూ ఇట్....జ్యోతిరాజ్ కి ఆశ్చర్యం వేసింది. తాను చచ్చిపోవాలనుకుంటే వీళ్లంతా యూ కెన్ డూ ఇట్ అని ప్రోత్సహిస్తున్నారేమిటి? కోపంగా, అసహనంగా ఇంకా వేగంగా పైకెక్కాడు...."నేను చచ్చిపోతాను" అనుకున్నాడు....
నూట మూడో సారి....కానీ చప్పట్లు పెరిగాయి... జనం పెరిగారు.... అందరూ కేకలు వేస్తూ "గ్రేట్... అమేజింగ్... ఆస్సమ్" అని అరుస్తున్నారు...."గ్రేట్ మంకీ మ్యాన్" కిందనుంచి ఒక కేక పైదాకా వినిపించింది."నేను చావాలనుకుంటున్నాను...." గట్టిగా అరవాలనుకున్నాడు. కానీ అరవలేకపోయాడు.అవలీలగా పైకి ఎగబాకాడు.... కొండ శిఖరం చేరాడు....అక్కడనుంచి కిందకి చూశాడు... జనం చీమల్లా కనిపిస్తున్నారు.... కానీ వాళ్లు చప్పట్లు కొడుతున్నట్టు అర్థమైంది. ఎందుకో కిందకి దూకాలని అనిపించలేదు.
ఎక్కినట్టే అవలీలగా కిందకి దిగపాకాడు.ప్రజలు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ అభినందించారు. "అద్భుతం అన్నయ్యా... భలేగా ఎక్కావు... నువ్వు నిజంగా మంకీ మ్యాన్ వి....మళ్లీ ఒకసారి ఎక్కి చూపించవా?" సాహసకృత్యం చూసిన ప్రజలు నోటితో అభినందనలు, నోట్ తో సాయం చేశారు. నాలుగైదు వందలు పోగయ్యాయి....ఆ డబ్బు జేబులో పెట్టుకున్నాడు జ్యోతిరాజ్...రెండో రోజు చిత్రదుర్గ్ కోట గోడను అలాగే ఎగబాకాడు...అదే అభినందనలు... మూడో రోజూ.... నాలుగో రోజు.... అయిదో రోజు....జ్యోతిరాజ్ రోజూ చిత్రదుర్గ్ కోటను ఎగబాకుతూనే ఉన్నాడు. ప్రజలకు ఆనందాన్నిస్తూనే ఉన్నాడు. డబ్బులు వస్తూనే ఉన్నాయి. కొండలు, కోటగోడలే కాదు ....రికార్డు బుక్కుల్లోకి, విడియో ఫిల్ముల్లోకి ఎక్కాడు. వార్తల్లో వ్యక్తి అయ్యాడు...."ఆ క్షణంలో నేను చావాలనుకున్నాను. కానీ ఆ క్షణమే నాలో ఎవరికీ లేని ఒక స్పెషల్ సామర్థ్యం ఉందని కూడా తెలిసింది. ఎవరూ చేయలేని పనిని నేను చేయగలనని తెలిసింది. అందుకే ఇక చావాలనుకోవడం లేదు" అంటాడు జ్యోతిరాజ్, ది మంకీ మ్యాన్ ఆఫ్ ఇండియా. జ్యోతిరాజ్ ఇప్పటికీ రోజూ చిత్రదుర్గ్ కోట గోడ ఎక్కుతూనే ఉన్నాడు....
చనిపోయేందుకు కాదు.... బతికి ఉండేందుకు .....
(ఈ మంకీ మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లో రాక్ క్లైంబర్ అనో మంకీ మ్యాన్ ఆఫ్ చిత్రదుర్గ్ అనో టైప్ చేయండి. బ్రహ్మాండమైన విడియోలు దొరుకుతాయి)

No comments