చాలా మందికి వీరసావర్కర్ తెలుసు.భగత్సింగ్ తెలుసు.కాని శ్యాంజీ కృష్ణ వర్మ (1857-1...
చాలా మందికి వీరసావర్కర్ తెలుసు.భగత్సింగ్ తెలుసు.కాని శ్యాంజీ కృష్ణ వర్మ (1857-1930) గురించి తెలిసిన వారు అరుదు.స్వాతంత్ర్య వీరసావర్కర్ కి భగత్ సింఘ్ కి,మదన్ లాల్ ధింగ్రా,మేడం కామ,లాలా హర దయాల్ వంటి వారికి అనుక్షణం సలహాలిస్తూ ఆనాటి బ్రిటిష్ క్రూర నియంతలకు వ్యతిరేకంగా విప్లవాన్ని పూరించిన యోధుడు.సంస్కృతం లో పండితుడు.ఆర్యసమాజ్ స్థాపకుడైన దయానంద సరస్వతి అనుచరుడు.అన్ని భాషల్లో నిష్ణాతుడు శ్యాంజీ కృష్ణ వర్మ .కాంగ్రెస్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, స్వాతంత్ర్యం ఇమ్మని పిటిషన్లుపెట్టుకోవటం ,తలవంచి ప్రార్థించటం,నామ మాత్రపు నిరసన తెలపటం,అవసరమైనప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించడానికి కూడా వెనుకాడని కాంగ్రెస్ ను సిగ్గులేని సంస్తగా అభివర్ణించాడు.
విశేషమేమిటంటే బ్రిటిష్ వాళ్ళ గడ్డపైనుండే విప్లవ వ్యూహాలు రచించినవాడు. ఇంగ్లాండ్ లో చదువుకోవడానికి వచ్చిన భారతీయ విద్యార్థుల్లో దేశభక్త విత్తనాలు నాటి,పెంచి పోషించి,ఆ శస్త్రాలను ఆంగ్లేయులపైకి ప్రయోగించిన దిట్ట.ఇంగ్లాండ్ లో ఇండియా హౌజ్ ని, ద ఇండియన్ సోషలిస్ట్ లను స్థాపించాడు.అంతకుముందు భారత్ లో జునాగఢ్ సంస్థానానికి ముఖ్యమంత్రి గా వున్నప్పుడు ఆంగ్లేయులతో ఎదురైన సవాళ్ళను స్వీకరించి రాజీనామా చేశాడు.
లండన్ లో చదువుకునే వారికి హెర్బట్ స్పెన్సర్ పేరుతో,అలాగే దయానంద సరస్వతి పేరుతో స్కాలర్షిప్స్ ఇచ్చేవారు.స్వాతంత్ర్య సమరం లో ఎందరికో ప్రేరణ నిచ్చిన వారు స్విట్జర్లాండ్ లో 1930 లొ చనిపోయాడు. ఆ తరువాత గుజరాత్ ముఖ్యమంత్రి నరెంద్ర మోడి వున్నప్పుడు శ్యాంజి కృష్ణవర్మ అస్థికలను స్విస్ ప్రభుత్వం గుజరాత్ కి 2003 లో అప్పగించింది.అక్టోబర్ 4న(1857) జన్మించిన వారిని స్మరించుకుని పునీతులవుదాం.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments