Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కులవివక్షలకి ఇక సెలవు పెడదాం-stop casteism

                                     తుచ్ఛ అహంకార జనీత వర్ణ వివక్ష, కుల వివక్ష లకు స్వస్తి చెబుదాం. చాందోగ్య ఉపనిషత్తులో నాలుగవ అధ్యాయంలో ...

                                     తుచ్ఛ అహంకార జనీత వర్ణ వివక్ష, కుల వివక్ష లకు స్వస్తి చెబుదాం. చాందోగ్య ఉపనిషత్తులో నాలుగవ అధ్యాయంలో సత్యకామ జాబాల యొక్క కథ వివరణ అనేది సమాజంలో కులం, మతం మరియు కుటుంబం యొక్క అడ్డంకులను అధిగమించే పురాతన శ్లోకాల మేధోమధనానికి ఒక ఉదాహరణ. సమాజంలోని ఏ వర్ణానుసారం జన్మించినా, ఒక మనిషి బ్రాహ్మణుడు అయ్యేది అతని కుటుంబం లేదా తల్లిదండ్రుల వంశపారంపర్యంగానో, వారసత్వంగానో, జన్మ వల్లనో కాదు !
                                   సత్యాన్వేషణ, నిజాయితీ, సత్యావలంబన మాత్రమే మొదటగా ఉండాల్సిన లక్షణాలు. అతను బ్రాహ్మసత్యాన్ని కనుగునే మార్గదర్శిగా జీవితాన్ని మార్చుకోగలగాలి. అతను ఒక శూద్రుడైనా లేదా ఏదైనా ఇతర వర్ణానికి చెందినా ఏమాత్రం తేడా లేదు ఉండదు. ఇది సాధారణ శిష్యుడి నుండి బ్రహ్మజ్ఞ్యానం కోసం అన్వేషించే అసలైన సత్యాన్వేషకులకు ఉండే తేడా."బ్రహ్మ విద్య" బాట పట్టే ఏ వర్ణస్థుడికైనా ఉండాల్సిన విధి నియమాలు అతని సత్ప్రవర్తన, నైతిక విలువలు, శ్రద్దాభక్తులు మరియూ నిరంతర ఆసక్తి.భగవద్గీతలో అర్జునునికి ఉపదేశిస్తూ వర్ణ వ్యవస్థపై, జీవ సృష్టిపై సహజంగా అందరికి కలిగే అన్ని సందేహాలను శ్రీకృష్ణ పరమాత్మ సందేహ నివృత్తి చేస్తారు. కరుడుతుంటాడు."చాతుర్వర్ణయం మయా సృష్టం గుణ కర్మ విభాగసహ" - నేను నాలుగు వర్ణాల జీవులను (జన్మ ఆధారం కాదు) వారి వారి లక్షణాలు గుణాలు మరియు వారి వారి పూర్వజన్మ కర్మానుసారం లేదా వారి వారి కర్మలను బట్టి సృష్టించాను."మరో మాటలో చెప్పాలంటే, ఒక క్షత్రియ, వైశ్య లేదా ఒక శూద్రుడు తన గుణకర్మ లక్షణాల ప్రవర్తన మరియు నడవడిక, నైతిక విలువల ద్వారా బ్రాహ్మణుడిగా మారవచ్చు. అలాగే మరోవైపు ఒక బ్రాహ్మణుడు సమాజంలో తన అభ్యంతరకరమైన ప్రవర్తన మరియు అచింతయ ప్రవర్తన ద్వారా తనను తాను నాశనం చేసుకుంటూ శూద్రునిగా మారిపొగలడు. సత్యకామ పేరు చాలా ముఖ్యమైనది. సత్య లేదా జీజ్ఞ్యాసతో పరబ్రహ్మాన్ని అన్వేషించే, కోరుకునే వ్యక్తి అంటే తానే బ్రాహ్మణుడు, బ్రహ్మ సృష్టి. 
                           ఉపనిషద్ కధానుసారం సత్యకాముడు ఒక పనిమనిషి మరియు వ్యభిచారి యొక్క కుమారుడు!అతను జ్ఞానం కోరుకుంటూ, సత్యాన్వేషియై ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మవిద్య సాధనావలంబాకుడై స్వయానా బ్రాహ్మణుడిగా, ఋషి పుంగవుడిగా తనను తాను మార్చుకున్న మహనీయుడు.
                                   ఈ పోస్టులో హిమాంశు భట్ గారి ఆర్టికల్ కి నా స్వేచ్చానుకరణ.వైభవోపేతమైన మన సంస్కృతిలో అన్ని వర్ణాల వారు, అతి ముఖ్యంగా శూద్ర వర్ణపు సాధువులు, సంతులు, ఋషులు హైందవ సమాజాన్ని ఎలా ప్రభావితం చేశారో చూద్దాం.శూద్ర హిందూ సాధువులు - హిమాంశు భట్ హిందూ సామ్రాజ్య చరిత్రలో సమాజాన్ని దేవుని పట్ల తమ భక్తిశ్రద్ధలతో చాలామంది శూద్ర హిందూ సాధువులు ప్రభావితం చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. అలాగే ఈ శూద్ర సాధువులు హైందవ సమాజాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, సర్వశక్తిమంతుడైన దేవుని ప్రతిరూపంగా హిందూ సన్యాసులై హిందువా సమాజంచే పూజలు అందుకున్నారు. వారు తమ తమ జీవిత కాలాల్లో హిందూ సదువులుగా గుర్తించబడటానికి కులపరమైన, సమాజపరంగా చాలా అడ్డంకులు ఎదుర్కొనీ కూడా హైందవ సమాజంలో కుల వ్యవస్థను తృణీకరిస్తూ ఒక వ్యక్తి, శూద్రునిగా లేదా వర్ణాలలో జన్మించినా తమ తమ కర్మానుసారంగా, చేపట్టిన శుద్ధ కర్మల ద్వారా మనస్సు పరిశుద్దం చేసుకుని దేవునికి అత్యంత ప్రీతిపాత్రుడవచ్చని తమ తమ నిరూపించారు. బ్రిటిష్ వారు రాక మునుపు సమాజం ఎలా ఉండేదో ఎలా ఈ సాధువులు దేవుళ్లను ఎలా ప్రసన్నం చేసుకోగలరో తమ జీవితాలతో నిరూపించారు.
                             వేదాలనేవి చాలామంది బ్రాహ్మణులు తామే బోధించాలని వ్యాఖ్యానించడానికి తమకే హక్కు ఉందనే వాదనలని చెప్పుకుంటూ, ఉండే సమయంలో కూడా బదరి వంటి ఋషులు శూద్రులకు కూడా ఆ హక్కు, నిబద్దత ఉందని వేదాలు తమ తమ శిష్యులకి బోధించి నిరూపించారు. మరియు అనేక శూద్రులు మరియు అవర్నులు పురాతన కాలంలో కూడా వేదాలు నేర్చుకున్నారు అలాగే అన్ని వర్ణాల వారికి కూడా నేర్పిస్తూ శ్రద్దాసక్తులు పెంపొందించారు.దీనికి ఉదాహరణ రైక్వ ఋషి తన శిష్యుడు జనశృతి పౌత్రాయణ. అయితే, గులాబ్ రావు మహారాజు (కున్బి) విషయంలో, ఆయన వేదాలను బ్రాహ్మణులకు కూడా బోధించాడు.మనకి కూడా తెలుసు, హైందవ సాధువులు, గురువులు అయినా పోతులూరి వీరబ్రహ్మం, భక్త తుకారాం లకు బ్రాహ్మణ శిష్యులు ఉండేవారన్న విషయం కూడా మనకి తెలిసిన విషయమే. సాధువు తుకారాం గారు మరొక సాధువు బహీనాబాయి గారి గురువులు. మరొక సాధువు బుల్లాసాహిబ్ (కుంభి) మరొక సాధువు భిక్ష సాహిబ్ అనే బ్రాహ్మణుడికి గురువు గారు. అలాగే దేవర దాసీమయ్య కి కూడా చాలామంది బ్రాహ్మణ శిష్యులు ఉండేవారు. భక్త కబీర్ సూరత్ గోపాల్ మరియు జగదాస్ అనే బ్రర్హమణుల గురువు గారు.ఇంకా చూసుకుంటే కొందరు శూద్ర సాధువులు రాజ్యాలనేలే రాజులకు కూడా గురువులుగా వ్యవహరించారు. లక్ష్మణ సేనుడు అనే బెంగాల్ రాజుకి దోయి అనే సాధువు గురువు. పంబట్టి అనే సాధువు శ్రీ పరమహంస అనే బ్రాహ్మణునికి గురువు.
Image result for stop casteism
                              గోరక్షనాధ్ మహారాణి కర్పతినాధ యొక్క గురువు, రామానంద రాయ ఒరిస్సా రాజు ప్రతాపరుద్ర దేవుని గురువు. సేన న్హావి బంధోగర్హ్ రాజు యొక్క గురువు సంత్ నామ్ దేవ్ గారు మహాదజీ షిండే గారి గురువు. వాల్మీకి రామాయణంలో మహారాజు శ్రీ రాముడు శూద్ర ఋషి మాతంగునికి ఆయన శిష్యురాలు శబరిని దర్శించి తరించిన విషయం అందరికి విరచితమే.కొన్ని పురాణాలు పరమాత్మ శూద్రునిగా ధరించిన అవతారాల గురించి కూడా వివరిస్తాయి. శ్రీమద్భాగవతం లో విష్ణుమూర్తి శూద్రునిగా అవతరించడమవతరించడం, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణా, శూద్ర, ఆదివాసిగా అవతరించి రంతి దేవ మహారాజుని పరీక్షించడం మనకు తెలిసిన పురాణ కధలే. మహాభారతంలోని శూద్రుడు, ధృతరాష్ట్రుని మహామంత్రి అయిన విదురుడు యముని అవతారం అనేది జగద్విదితమే. చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణత్వం అనే వర్ణం సిద్దించడానికి వాల్మీకి వశిష్ట మహామునుల ఉదాహరణలు వివరిస్తూ శ్రీమద్ విరాట్ బ్రహ్మేంద్రస్వామి పోతులూరి స్వాములు తన కుమారులకు ఇలా వివరిస్తారు.
                                    శూద్ర, వైశ్య, క్షత్రియ వర్ణాల్లో జన్మించినా తపస్సు, జ్ఞ్యానాలచే ఆధ్యాత్మిక సాయుజ్యం చేరిన వాళ్ళు బ్రాహ్మణులే అవుతారు.అలాగే బ్రాహ్మణ గర్భంలో జన్మించినా తపో, జ్ఞ్యాన సంపద గ్రహించనివాడు శూద్రునితో సమానం.శూద్ర, బ్రాహ్మణ అనే వర్ణాలు జన్మతః కాదు, కేవలం సాధనతో మాత్రమే సాధ్యం.కొన్ని బ్రాహ్మణ కులాలు తమ మూలాల్లో శూద్రుల ఋషులను కలిగి ఉన్నారు.
                                  ఉదాహరణకి మహారాష్ట్ర లోని కోస్త ప్రాత బ్రాహ్మణులకు బ్రాహ్మణ రాజు అయినా పరశురాముడు కైవర్త మూల ఋషి.చిత్ పవనులు, కోకణస్థులు అనే బ్రాహ్మణులు తమకు బ్రాహ్మణత్వం పరశురాముడి నుంచి సిద్దించిందని చెప్తారు. అలాగే, సూరత్ కి చెందిన మట్టి బ్రాహ్మణులు, కర్ణాటక కు చెందిన కనర ప్రజలు మత్స్య ఋషికి చెందిన వారి వారసులుగా చెప్తారు.మహారాష్ట్రకు చెందిన షెనావి బ్రాహ్మణులు తాము పరశురాముడు ఏరికూర్చిన మత్స్యకారుల ఋషి పుంగవుల వారసులుగా చెప్తారు. కేరళకు చెందిన నంబూద్రి బ్రాహ్మణులు కూడా తాము పరశురాముడు ఏరికూర్చిన మత్స్యకారుల ఋషి పుంగవుల వారసులుగా చెప్తారు.
                                  బెంగాల్ కు చెందిన వ్యాసోక్త బ్రాహ్మణులు వ్యాసుని శిష్యులైన కైవర్త, మాహిష్య కులాలకు చెందిన మత్స్యకారుల వంశాంకురాలుగా చెప్పుకుంటారు. శూద్రుల హిందూ సాంప్రదాయాలకు చెందిన పూజా పునస్కారాల వ్యవహారాలు చక్కదిద్దే కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఇప్పటికి ఉన్నాయి.బెంగాల్ కె చెందిన మధ్యశ్రేణి బ్రాహ్మణులు నభశాఖ (నవ శాఖ) కులాలు అనగా కుమ్మరి, కమ్మరి, మంగలి కులాలకు చెందిన వారి వ్యవహారాలూ చూస్తారు.బెంగాల్ కే చెందిన రాపలి బ్రాహ్మణులు రాపలి ప్రజల పూజా పునస్కారాల వ్యవహారాలు చక్కదిద్దుతూ ఉంటారు.మాలి బ్రాహ్మణులు మాలి ప్రజలను,చమర్వ బ్రాహ్మణులు చమార్ ప్రజల ఆచార వ్యవహారాలూ చూసుకుంటారు.
                                     కుమ్హర్ని శూద్ర అనే కాశ్మీర్ రాణి "బండ్ల్లీ" కు ఒక బ్రాహ్మణునికి జన్మించిన కుమారుల సంతానమైన డకౌత్ బ్రాహ్మణులు వారిని "గుజరాతి" అని కూడా పిలుస్తారు.అలాగే కొన్ని బ్రాహ్మణ కానీ వర్ణాల వారు ఉన్న పూర్వజులు కలిగిన వారు కూడా బ్రాహ్మణులుగా వర్ణత్వం సిద్దించుకున్నారు. కాయవ్య అనే వంశపు బ్రాహ్మణులు నిషాద అనే తల్లికి, మరొక క్షత్రియ తండ్రికి పుట్టారు.సకల పురాణాలను కలియుగ ప్రజల కోసం వ్యాసుని ద్వారా ఇచ్చిన "సూత సంహిత" గా పేరొందిన "సూత" మహాముని, అలాగే "సత్య కామ జాబాలి" లు కూడా గౌతమ మహాముని ద్వారా బ్రాహ్మణత్వం ప్రసాదింపబడిన శూద్ర వర్ణస్థులు. మంగలి కులానికి చెందిన "మాతంగ మహర్షి" తన తపో బలానికి, సాధించిన తన జ్ఞ్యాన సంపదకు బ్రాహ్మణత్వం సాధించిన ధన్యుడు. ఇంకొందరు శూద్రులుగా పుట్టి బ్రాహ్మణత్వం సిద్దించినమహామునులు చూసుకుంటే, దత్తుడు, మత్స్య, రాజా దత్త, వైభంధకుడు, పూర్ణానంద. కాన్హాయణులకు పూర్వజుడైన కాన్హా కూడా శూద్రునిగా జన్మించి మహాఋషి అయ్యి తన తపోబలంతో "ఓక" అనే రాజు యొక్క ప్రాణాలు కాపాడాడు. అట్లాగే శూద్ర ఋషుల గోత్రాలతో చాలామంది బ్రాహ్మణులు ఇప్పటికి కలిగి ఉన్నారు.
                                  ఉదాహరణకి పరాశర, వ్యాస, వత్స గోత్రాలు, వీరి వంశానుచారులు నేడు వాత్స్యాయన, మాతంగ, అనే గోత్రాలతో, కాశ్యప ఋషి వారసుడైన మాతంగ.శబర లేదా శవర కూడా బ్రాహ్మణులూ వాడే గోత్రము ఇది అడవుల్లో నివసించే ఆదివాసుల నుంచి వారసత్వనగా వచ్చిన బ్రాహ్మణుల గోత్రాలు. అలాగే సత్యకామ జాబాల నుంచి వచ్చిన జాబాల గోత్రం ఇది గౌతమ మహర్షి నుంచి వచ్చిందది. వేదాలు ఉపాసన పట్టిన బ్రాహ్మణులు శూద్ర, క్షత్రియ, వైశ్య వంటి కులాల్లో పుట్టినా, జ్ఞ్యానం, తపో, భక్తి మార్గాల్లో ముక్తి పొందిన ఎవరైనా స్వయానా బ్రహ్మమే, బ్రాహ్మణుడే....కొన్ని ప్రదేశాల్లో, కాశి వంటి పుణ్య క్షేత్రాల్లో శూద్ర వర్ణాలకు చెందిన కులాల్లోని బ్రాహ్మణులు పూజాది కార్యక్రమాలు ఇప్పటికీ నిర్వహిస్తూ ఉంటారు. అక్కడి ఈ శూద్ర కులాల పేర్లు నాయీ, కూర్మి, కియోరి, కహార్, తేలి, హల్వాయి, మాలి మరియూ మంజాయి. సాధుసంతులుగా మారిన శూద్ర ఋషులు. కుల ప్రసక్తి లేకుండా దేవుణ్ణి తెలుసుకున్న వారి గురించి శ్రీ బసవ స్వామి గారు ఇలా సెలవిచ్చారు. భక్తి కాలం పెంపొందిన సమాజంలో అన్ని కులాల్లో శ్రద్దగా పనిచేసుకుంటూనే, వివక్ష ఎదిరిస్తూనే, చాలామంది దేవుడికి ప్రీతిపాత్రులయ్యారు. వర్కారి తెగకు చెందిన స్వామి ఏక్ నాధ్ గారు బ్రాహ్మణ జన్మ ఎత్తని ఇతర సాధువుల గురించి వివరిస్తూ..
సాంఖ్యుడు వీధులు శుభ్రం చేసేవాడు.
అగస్త్యుడు అడవుల్లో వేటాడే విలుకాడు.
దుర్వాసుడు ఒక నేతగాడు
దధీచి తాళాలు బాగుచేసేవాడు
కశ్యపుడు ఒక కమ్మరి
రోమజ కూడా కమ్మరి.
కౌండిల్య ఒక మంగలి.
                                      కాబట్టి, ఎందుకు మీరు ఈ తెలియని అజ్ఞానంలో వక్రీకరణల బలి అయ్యి కులం ఆధారిత వివక్షను సమర్ధించాలి? దేవుడు గోరా తో కలిసి కునాలు తయారు చేసాడు, చొఖునితో కలిసి పశువులు మేపాడు, సవత తో కలిసి పశువులు పాలాడు, కబీర్ తో కలిసి వస్త్రాలు నేసాడు, రోహిదాస్ తో కలిసి రంగులు అడ్డాడు, సజన అనే కసాయి తో కలిసి మాంసం అమ్మడు, నరహరి తో కలిసి బంగారు ఆభరణాలు తయారు చేసాడు, అలాగే దామాజీ తో కలిసి ఒక దేవదూత అయ్యాడు. మనిషికే గానీ దేవునికేక్కడివి వర్ణ వివక్ష, కుల వివక్ష, జాతి వివక్ష ??
ధర్మో రక్షతి రక్షితః
జై హింద్
జై శ్రీరాం
మాతా భారతీ కీ జై

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments