1893లో చికాగో వేదికగా జరిగిన సర్మమత సమ్మేళనానికి తొలిసారిగా హాజరైన స్వామి వివేకానందుడు ఒక్క మాటతోనే ప్రపంచాన్ని భారతవైపు తిప్పుకునేలా చేశ...
1893లో చికాగో వేదికగా జరిగిన సర్మమత సమ్మేళనానికి తొలిసారిగా హాజరైన స్వామి వివేకానందుడు ఒక్క మాటతోనే ప్రపంచాన్ని భారతవైపు తిప్పుకునేలా చేశారు.
సెప్టెంబర్ 11 న వారి మొదటి ఉపన్యాసం లో అమెరికన్ సోదర,సోదరీమణులారా వాక్యం తీసుకొని 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో విస్డమ్ స్టడీ సెంటర్ ఆద్వర్యంలో విధ్యార్థులంతా కలిసి స్వామి వివేకానంద స్పూర్తి తో అందరిపట్ల ఈ దేశం మనది ఈ దేశం అంతా ఒకటి సోదరభావంతో మెలగాలనే సంకల్పంతో దేశ భక్తి కలిగి ఉండాలి అని. స్వామి వివేకానంద మాస్క్ లు మరియు టోపీలు ధరించి వరల్డ్ హిందూ కాంగ్రెస్ చికాగో మహసభలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 5 నుండి సెల్ఫీ విథ్ వివేకానంద కార్యక్రమం ను రూపొందించి విధార్థుల లోకి వెళ్ళగా అనూహ్యమైన స్పందన విధ్యార్థులనుండి వచ్చింది. విశ్వవిద్యాలయ విధ్యార్థులందరూ I am Vivekananda I for My Nation అనే Slogan తో సెల్ఫీ లు దిగి సోషల్ మీడియా లో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో విశ్వవిద్యాలయ ఉపకులపతి, రెక్టార్ , డైరెక్టర్ లు మరియు అధ్యాపకులు కూడా పాల్గొనడం జరిగింది.
విశ్వవిద్యాలయం అంతటా దేశ భక్తి వాతావరణం లో భారత్ మాతా కీ జై, వివేకానంద కి జై లతో మార్మోగింది. సుమారు 1500 మంది విధ్యార్థులు 200 ల సెల్ఫీల పైన దిగి వివేకానందుని పై అభిమానాన్ని చాటుకున్నారు. చివరిగా సెప్టెంబర్ 11 న విశ్వవిద్యాలయం లో ఆడిటోరియం లో 200 మంది విధ్యార్థులతో సభ నిర్వహించడం జరిగింది ముఖ్య వక్త శ్రీ పూర్ణ ప్రభాకర్ గారు మాట్లాడుతూ దేశం లో యువత వివేకానంద ను ఆదర్శంగా తీసుకొని దేశం కోసం పనిచేయాలని, స్వాభిమానము,స్వావలంబన తో జీవించాలని, వివేకానంద ఆశయసాదన కోసం పనిచేయాలని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమం లో అనేకమంది అధ్యాపకులు కూడా పాల్గొని మార్గదర్శనము చేయడం జరిగింది. చివరిగా అందరూ కలిసి ఒక పెద్ద సెల్ఫీ దిగి దేశం లో యువత కు ఆదర్శంగా జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం విధ్యార్థులు ఆదర్శంగా నిలిచారు.
దేశం లో సాంకేతిక విశ్వవిద్యాలయం అయినప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి దేశం లో ఉన్న అనేక విశ్వవిద్యాలయాలకు ఒక కొత్త Trend ని తీసుకొచ్చారు అనే చెప్పొచ్చు. చివరి గా వారి Slogan... I am Vivekananda I am for My Nation. భారత్ మాతాకీ జై.
No comments