ఒకాయన చనిపోగానే నరకానికి వెళ్ళాడు. నరకంలోకి పోగానే అక్కడ బోలెడన్ని సెక్షన్లు కనిపించాయి. ఒక్కో దేశం తరఫున ఒక్కొక్క నరకం. ముందుగా జర్మనీ నర...
ఒకాయన చనిపోగానే నరకానికి వెళ్ళాడు.
నరకంలోకి పోగానే అక్కడ బోలెడన్ని సెక్షన్లు కనిపించాయి. ఒక్కో దేశం తరఫున ఒక్కొక్క నరకం.
ముందుగా జర్మనీ నరకంలోకి వెళ్లాడు.
"ఇక్కడ ఏయే శిక్షలు విధిస్తారు?"
"ఇక్కడకి రాగానే ముందు ఎలక్ట్రిక్ చైర్ లో ఒక గంట సేపు కూచోబెడతారు. ఆ తరువాత మేకుల పడకపైన పడుకోబెడతారు. ఆ తరువాత జర్మన్ భటులు వచ్చి రోజు రోజంతా చావబాదుతారు."
అక్కడి శిక్షలు, ఆర్తనాదాలు చూసి ఆయన భయపడిపోయాడు.
పక్కనే ఉన్న అమెరికన్ నరకానికి వెళ్ళాడు.
ఆ తరువాత రష్యన్ నరకానికి వెళ్లాడు.
అన్ని నరకాల్లోనూ అవే శిక్షలు. అవే ఆర్తనాదాలు.
చివరగా ఆయన భారతీయ నరకంలోకి వెళ్లాడు.
అక్కడ పొడవాటి క్యూ ఉంది. పాపులందరూ పోటీపడుతున్నారు.... "త్వరగా శిక్ష వేయండి.... కమాన్.... క్విక్ ....." అని పోటాపోటీగా ప్రాధేయపడుతున్నారు. ఆయన బోల్డంత ఆశ్చర్యపడిపోయాడు. "ఇక్కడ ఏయే శిక్షలు విధిస్తారు?"
"ఇక్కడకి రాగానే ముందు ఎలక్ట్రిక్ చైర్ లో ఒక గంట సేపు కూచోబెడతారు. ఆ తరువాత మేకుల పడకపైన పడుకోబెడతారు. ఆ తరువాత భారతీయ భటులు వచ్చి రోజు రోజంతా చావబాదుతారు."
"మిగతా నరకాల్లోనూ ఇవే శిక్షలు ఉన్నాయి కదా. అయినా ఇక్కడెందుకు ఇంత రద్దీ?" కుతూహలం ఆపుకోలేక ఆయన అడిగేశాడు.
"ఏముంది.... ఇక్కడ మెయింటెనెన్స్ వెరీ బాడ్..... ఎలక్ట్రిక్ చెయిర్ పనిచేయదు. మేకుల మంచంలో మేకులన్నీ ఎవరో దొంగిలించుకుపోయారు. ఇక భటుడు రాగానే రిజిస్టర్ లో సంతకం చేసి కాంటిన్ కి వెళ్లి కాఫీ తాగుతూంటాడు."

No comments