10 హిందూ దేవాలయాలు కట్టిందెవరు? నాశనం చేసిందెవరు? మన భారత దేశం ఎన్నో దురాక్రమణలకు గురయ్యుంది శకులు, హూణులు, మొగలులు, డచ్, పోర్చుగీ...
మన భారత దేశం ఎన్నో దురాక్రమణలకు గురయ్యుంది శకులు, హూణులు, మొగలులు, డచ్, పోర్చుగీసు, బ్రిటీష్ వాళ్ళు ఇలా ఎంతో మందిమన దేశాన్ని దోచుకున్నారు.. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ కొంత మంది దనాన్ని సంపద ను దోచుకోవడమే కాక మన శ్రద్దాకేంద్రాలను, స్త్రీ ల ను అవమానించారు. వీటి తో పాటుగా ఎన్నో హిందూ దేవాలయాలు నాశనం చేసారు... సుబ్రహ్మణ్య స్వామి ప్రతిసారీ చెబుతూఉంటారు 3000 పైన దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి అంటారు. హిందూ దేవాలయాలే కాక బౌద్ధ స్తూపాలు.. జైన మందిరాలను నాశనం చేసారు... అయితే వాటిలో కొన్ని ప్రముఖ మైన దేవాలయాలు ఎవరు నిర్మించారు ఎవరు ధ్వంసం చేసారు, ధ్వంసం చేసిన వాటిపై దర్గాలు, మసీదు లు, ఖాంకాలు, మజార్ లు అలాగే సమాదులు ఎక్కడెక్కడ నిర్మించారు అనే విషయం తెలుసుకుందాము.
1. మార్తాండ్ సూర్య దేవాలయం కాశ్మీర్:
అతి పురాతన దేవాలయాలలో మార్తాండ్ సూర్య దేవాలయం ఒకటి. మార్తాండ్ దేవాలయం ను ప్రస్తుతం Devils Cave గా పిలుస్తున్నారు. ఈ దేవాలయం ను 5 వ శతాబ్దంలో లలితాదిత్యుడు కట్టించాడు. ముస్లిం దురాక్రమణ రాజులలో ఒకడైన సిఖిందర్ బిట్సిఖాన్ మార్తాండ్ దేవాలయం ను తునా తునకలు చేసాడు. నిర్మాణం బలంగా ఉండటం వలన కొన్ని నెలలు పట్టింది దీనిని శిధిలాల రూపంలో కి మార్చడానికి. ఈ దేవాలయం ప్రస్తుతం కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది.
2. మోథెరా సూర్య దేవాలయం:
మొథెరా సూర్య దేవాలయం 10వ శతాబ్దం లో సోలంకి రాజులు నిర్మించారు. పూర్తి వాస్తు తో కూడుకున్న దేవాలయం. ఇక్కడ ఉన్న ప్రతి శిలా భారత వైభవం ను చరిత్ర ను తెలియజేస్తుంది. సోలంకి రాజు లు సూర్య వంశానికి చెందిన వారు సూర్యొపాసకులు. ఈ దేవాలయం పక్కన ఒక పెద్ద జలవాటిక కలదు.
భీమదేవ రాజు ఈ దేవాలయం ను 11వ శతాబ్దంలో పూర్తి చేశాడు. ఈ దేవాలయం కు పురాణ ప్రాశస్త్యం కలదు రాముడు రావణ వధ అనంతరం వశిష్ట గురుదేవులు చెప్పిన మేరకు రావణుడు బ్రాహ్మణుడు కావడం వలన పాపవిముక్తికై ఇక్కడ ఉన్న మొతెరాక్ దగ్గరకు వచ్చి జలవాటిక లో స్నానమాచరించి యజ్ఞం చేసి ఈ ప్రాంతం ను సీతాపూరము గా ప్రసిద్ది చెందింది. పురాణాలలో దీనిని ధర్మారణ్య గా పిలిచేవారు తరువాత కాలంలో మొథెరా గా మారింది. ఘజనీ మహమ్మద్ దీనిని ఎన్నోసార్లు దండెత్తి సిరి సంపద లను దోచుకున్నాడు ఇక్కడ ఉన్న సూర్య విగ్రహం బంగారం తో చేయబడింది దానిని ఘజిని దొంగిలించాడు. తరువాత అల్లవుద్దీన్ ఖిల్జీ ఈ దేవాలయం ను సర్వ నాశనం చేసాడు. ఇది కూడా చాలా భలమైన రాయితో కట్టబడింది. ఇప్పటికీ అక్కడ సూర్య కిరణాలు ప్రతి రోజు సాయంత్రం పండుతాయి అంత వాస్తు కలిగిన దేవాలయం.
3. రామ జన్మభూమి అయోధ్య:
ముఖ్యంగా చెప్పాలంటే అయోధ్య అనగానే గుర్తొచ్చేది రాముడు. రాముడు కొడుకు కుశుడు తన తండ్రి జ్ఞాపకార్థం అయోధ్య లో గుడి కట్టించాడు. తరువాత కాలంలో విక్రమాదిత్యుడు ఆ రామమందిరాన్ని పునర్నిర్మాణం చేశాడు.
మొగలాయిల కాలంలో ఎన్నొ దాడులు ఈ నిర్మాణం పైన చేశారు అయినా చెక్కుచెదరలేదు. 1528 లో రామమందిరాన్ని బాబర్ కూల్చివేసి మసీదు నమూనా గా మార్చి ఒక కట్టడాన్ని నిర్మించాడు. అక్కడ ఒక్కసారి కూడా నమాజు జరగలేదు. అది కేవలం మసీదు ను పోలిన కట్టడం మాత్రమే అని మనం తెలుసుకోవాలి. 1992 డిసెంబర్6 న కరసేవ జరిగి ఆ కట్టడాన్ని కూల్చివేసారు హిందువులు. దీని గురించి ఎన్నొ వాదప్రతివాదనలు తరువాత అది రామమందిరము అని కోర్టు తీర్పు ఇచ్చింది. అక్కడ మనం ఇప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఓ భవ్యమైన రామమందిరాన్ని నిర్మించాలి.
4. కాశీ విశ్వనాధుడు వారణాసి:
వారణాసి అనగానే పవిత్ర గంగానది, విశ్వనాధుడు కళ్ళ ముందు కనిపిస్తాయి. ప్రతి హిందువు తన జీవితం లో ఒక్కసారైనా దర్శించే ఆధ్యాత్మిక నగరం వారణాసి. ప్రపంచంలో ఉన్న అతిపురాతనమైన నగరాలలో ఒకటి మరియు అత్యంత ప్రాచీనమైన కట్టడాలు కలిగిన ప్రదేశం. 3500 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉన్నట్లు కొన్ని శాసనాలు, రాత పత్రాలు తెలుపుతున్నయి. ప్రతి కొడుకూ ఈ దేశం లో తన పూర్వికులకు, తల్లిదండ్రులు లకు పిండప్రదానము చేసి లేదా అస్తికలు పవిత్ర గంగానది లో కలిపి పున్నామ నరకం నుండి రక్షింపబడతారు. అంతే కాకుండా దీనికి Temple Town అని కూడా పిలుస్తారు. మనదేశాన్ని పరిపాలించిన ప్రతి దురక్రమణదారుడు ఈ దేవాలయ సంపదను కాజేశారు దానితో పాటు గా ఇక్కడ ఉన్న జ్యొతిర్లింగాన్ని కూడా కాజేశారు. 16 వ శతాబ్దంలో అక్బర్ మనుమడు ఔరంగజేబు ఈ దేవాలయం ను 1669లో కూల్చివేసి జ్ఞానవపి అనే మసీదు ను నిర్మాణం చేశాడు. ప్రస్తుతం అక్కడ ఉన్న దేవాలయం 1780 లో మరాఠా మహారాణి అహల్యా హోల్కర్ నిర్మించింది. దానిని 1839 లో మహారాజా రంజిత్ సిన్హా బంగారు తాపడం తో గోపురం నిర్మాణం చేసాడు ఈయన పంజాబ్ సిక్కు రాజు.
5. కృష్ణ జన్మభూమి మధుర:
శ్రీ కృష్ణ జన్మభూమి మధుర లో ఓ భవ్యమైన దేవాలయం ను కృష్ణుడి మనుమడు వజ్ర తన తాత జ్ఞాపకం ఈ దేవాలయం ను కట్టించాడు. ఈ గుడి చరిత్ర కూడా 5000 సంవత్సరాల పైమాటే. తరువాత కాలంలో 2వ చంద్రగుప్తుడు 4వ శతాబ్దంలో పునర్నిర్మాణం చేశాడు. దీనిని ఔరంగజేబు కూల్చివేసాడు అక్కడ ఒక దర్గాను నిర్మాణం చేశాడు. తరువాత ఎన్నో వివాదాల మధ్య అక్కడ ఉన్న దర్గాను 1965 లో పూర్తి గా పరిశోధన చేస్తే దేవకీ వసుదేవులు ఉన్న ఖారగార గధి తాలూకు కొన్ని ఆనవాళ్ళు లభ్యమయ్యాయి.
6. సోమనాథ్ దేవాలయం సౌరాష్ట్ర:
సోమనాథ్ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయం ను ఎన్నోసార్లు లూటీ చేశారు, సంపద ను దోచుకున్నారు. ఘజిని మహమ్మద్ 17 సార్లు దండెత్తి ఈ దేవాలయం ను ధ్వంసం చేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ, ఎంతో మంది ముష్కరమూకలు దాడి చేసి ఈ దేవాలయం ను సర్వ నాశనం చేసారు. ఇది ప్రస్తుతం సౌరాష్ట్ర గుజరాత్ లో సిందుసాగరం ఒడ్డున ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మనం కట్టుకున్న ఒకేఒక్క దేవాలయం. దీనిని 1951 లో పటేల్ జీ మరియు KM Munshi అధ్వర్యంలో మొదటి రాష్ట్ర పతి బాబురాజేంద్రపసాద్ చేతులమీదుగా ప్రతిష్ట చేసారు. ఈ దేవాలయం చాళుక్యుల శిల్ప సంపద ను పోలి ఉంటుంది.
7. హంపి దేవాలయాలు కర్ణాటక:
విజయ నగర సామ్రాజ్యం ను ఏర్పటుచేసిన కృష్ణ దేవరాయలు హంపి నగరం ను కేంద్రం గా చేసుకొని పరిపాలించాడు.
హంపి లో ఎన్నో ఎకశిలా గుడులు విగ్రహాలు ఉన్నవి. రాతి కట్టడాలు ఎక్కువ మనకు విజయనగరం సామ్రాజ్యం లో కనిపిస్తాయి. కళలు, కళాకారులకు ఈ సామ్రాజ్యం పెట్టింది పేరు. ఇక్కడ ఉన్న ఎన్నో కట్టడాలను ముస్లిం లు ఉత్తర భారత్ జరిగిన అన్ని దాడులు దక్షిణ భారత దేశం లో జరగలేదు కాని నష్టం అయితే బానే జరిగింది.
8. రుద్ర మహాలయ్ గుజరాత్:
రుద్ర మహాలయ దేవాలయం గుజరాత్ లోని పటాన్ జిల్లాలో సిద్ధాపూర్ లో ఉంది. 943 లో మహారాజు సోలంకి ఈ దేవాలయం ను మొదలుపెట్టగా 1140 లో సిద్ది రాజా జయ సిన్హా ఈ దేవాలయం ను పూర్తిచేశాడు. దీనిని అల్లాఉద్దీన్ ఖిల్జీ 1410 లో కూల్చివేశాడు. ఆ తరువాత అహ్మద్ షా ఇలా ఎందరో ముస్లిం రాజు లు ఈ దేవాలయం ను దోచుకుని నాశనం చేసారు.
9. మదన మోహన దేవాలయం బౄందావనం:
మదన మోహన దేవాలయం బౄందావనం ఈ దేవాలయం ఖాలి ఘాట్ దగ్గర బృందావనం లో ఉండేది ఇది పూర్తి శిల్ప సంపదతో అద్భుతమైన శక్తి కేంద్రం గా వర్దిల్లింది. దీనిని మొగలులో ఔరంగజేబ్ పరిపాలనలో ఈ దేవాలయం ను సర్వనాశనం చేసాడు. అయితే దీనిని నందలాల్ వసు 19 వ శతాబ్దం లో రాజస్థాన్ లొని కైరొలి లొ నిర్మింపచేసడు పాతదేవాలయ నమూనాతో అద్బుతమైన శిల్ప సౌందర్యం తో మరలా బృందావనం లో కూడా 1819 లో నంద కుమార్ బోస్ అనే బెంగాలి 19 వ శతాబ్దంలో కట్టించాడు కాని ఈ దేవాలయం అంత ప్రసిద్ది చెందలేదు.
10. మధుర మీనక్షీ దేవాలయం:
మధుర మీనక్షీ దేవాలయం అతిపురాతనమైనది. మధురై ఒక అధ్యాత్మిక నగరం కూడా శివ పార్వతులు ఇక్కడ కొలువై ఉన్నారు. మీనాక్షీ అమ్మవారికి పార్వతీ దేవి అని చేప కళ్ళ అమ్మవారుగా ఇక్కడ భక్తులు కొలుస్తారు
అయితే ఈ దేవాలయం కు సంబందించి ఎవరు మొదట దీనిని నిర్మించారు అనేది తెలియదు ముస్లిం దురాక్రమణ దారుడైన మాలిక్ కాఫుర్ దీనిని 1310 లో ద్వసం చేసి ఎన్నొసార్లు దొచుకున్నాడు. తరువాత 17 వ శతాబ్దంలో అర్యనాధ ముదలియార్ దీనిని పునర్నిర్మాణం చేసాడు.
ఇలా ఎన్నో వేల చిన్న పెద్ద దేవాలయాలు నాశనం చేసారు మరియు మన సంపద మొత్తాన్ని దోచుకోవడమే కాక మన సంస్కృతి ని, ఎంతో మంది ని మతమార్పిడి చేసారు, స్త్రీ లను అవమానించారు, గోహత్య చేశారు. ఇప్పటికైనా మనమంతా మేల్కొని మన పురాతనమైన అన్ని దేవాలయాలను పునర్నిర్మాణం చేయాలని కోరుకుందాము..
మన దేవాలయాల గురించి వాటిపై జరిగిన దాడుల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు
ReplyDelete