Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE
Sunday, April 6

Pages

Classic Header

వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర - sardar patel biography in telugu

స్వతంత్ర సమరయోధుడు భారత తొలి ఉప ప్రధానిగా, హోమ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బర్డోలీ వీరుడు వల్లభాయ్ పటేల్ ముందు నుంచీ విభజించు పాలించు విధాన...

స్వతంత్ర సమరయోధుడు భారత తొలి ఉప ప్రధానిగా, హోమ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బర్డోలీ వీరుడు వల్లభాయ్ పటేల్ ముందు నుంచీ విభజించు పాలించు విధానాన్ని అవలంభించిన ఆంగ్లేయులు మత ప్రాతిపదికన దేశాన్ని రెండు ముక్కలు చేశారు. అలాగే వెళ్తూ వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు. దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్ లో కలవచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. ఈ సమస్యను తనదైన శైలిలో పరిష్కరించి ఇండియన్ బిస్మార్క్ గా వల్లభాయ్ పటేల్ మన్ననలు అందుకున్నారు. జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర ఎలాంటిందో భారత యూనియన్ లో స్వదేశీ సంస్థానాలు వీలినంలో పటేల్ ఉక్కు సంకల్పం అలాంటిది.



1947 నాటికి దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వీటిలో కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరుతుగా ఇండియన్ యూనియన్ లో అంతర్భాగమయ్యాయి. మిగతా మూడు సంస్థానాలను భారత్ యూనియన్ లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైంది హైదరాబాద్ సంస్థానం. ఇందులోని 80 శాతం ప్రజలు హిందువులు, మిగతా 20 శాతం ముస్లింలు ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటంతో హైదరాబాద్ ను స్వంతంత్ర రాజ్యంగా ఉంచాలనే ఆలోచన ఆయనది.
 
మరికొంత కాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్ లో విలీనం చేస్తానని ఏడో నిజామ్ ప్రతిపాదించాడు. కానీ నిజాం వైఖరిపట్ల అనుమానంగా ఉన్న పటేల్ అందుకు ఒప్పుకోలేదు. నిజాం సంస్థానంలోని రజాకార్లు మతకల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. ఇదే సరైన సమయంగా భావించిన పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే 1947 సెప్టెంబరు 13 న ప్రారంభమైన ఆపరేషన్ మూడు రోజులు పాటు కొనసాగి అదే నెల 17 న ముగిసింది.
సైనికచర్యను ప్రధాని నెహ్రూ వ్యతిరేకించినా ఆయన ఆదేశాలను పట్టించుకోకుండా హైదరాబాద్ ప్రజలకు కిసాన్ వీరుడు విముక్తి కలిగించారు. నెహ్రూ యూరప్ పర్యటనలో ఉన్నప్పుడు ఇదే సైనిక చర్యకు సరైన సమయంగా భావించిన పటేల్ ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు జారీచేశారు. కశ్మీర్ ది మరో విచిత్రమైన పరిస్థితి. ఈ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్ యూనియన్ లో కశ్మీర్ ను విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఉత్తర కశ్మీర్ లోని వేర్పాటు వాదులు దీన్ని వ్యతిరేకించారు. దీనిపై కూడా సైనిక చర్య ద్వారా శాశ్వత పరిష్కారం చేయాలని పటేల్ భావించినా అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ దీనికి అంగీకరించలేదు. అప్పుడే గనుక నెహ్రూ ఒప్పుకుని ఉంటే కశ్మీర్ సమస్య ఇంతవరకు వచ్చుండేది కాదేమో. సర్దార్ వల్లభాయ్ పటేల్ పూర్తి జీవిత చరిత్ర

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం- సూర్య నమస్కారాలు అలాగే EPF E-Nominee, jana aoushadi medical shops ఎలా అప్లై చేసుకోవాలి, Types Insurance, Types Loans  ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..