Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఉరి తీసేందుకు 20 రోజులు ముందు భగత్ సింగ్ కుల్బీర్ సింగ్ కి రాసిన ఉత్తరం

ఉరి తీసేందుకు 20 రోజులు ముందుగా భగత్ సింగ్ తన సోదరులకు ఆఖరుసారిగా ఉత్తరాలు రాశాడు. కుల్బిర్ కు రాసిన తన ఆఖరు ఉత్తరంలో ఆయన ఇలా రాశాడు: ...

ఉరి తీసేందుకు 20 రోజులు ముందుగా భగత్ సింగ్ తన సోదరులకు ఆఖరుసారిగా ఉత్తరాలు రాశాడు. కుల్బిర్ కు రాసిన తన ఆఖరు ఉత్తరంలో ఆయన ఇలా రాశాడు:
                                                                                                                                      సెంట్రల్ జైలు,
                                                                                                                        లాహోర్ 3 మార్చి 1931.
ప్రియమైన కుల్బీర్ సింగ్ కు, 
నా కోసం నీవు చాలా చేశావు. నన్ను కలుసుకున్నప్పుడు నీ ఉత్తరానికి జవాబుగా కొన్ని మాటలు రాసి ఇవ్వమని అడిగావు. కొద్దిగానే రాస్తాను. చాలు. చూడు తమ్ముడూ, నేను ఎవరి కోసమూ ఏమీ చేయలేకపోయాను. నీకోసం కూడా. ఇప్పుడు మిమ్మల్నందరినీ కష్టాల్లో వదలి వెళ్ళిపోతున్నాను. నీ జీవితం ఏమవుతుంది? నీ జీవనాధారం ఏమిటి? ఇలాంటివే ఎన్నో ఆలోచించి వణికి పోతూంటాను. అయినా తమ్ముడూ, దైర్యంగా ఉండు. ఆపదల్లో కూడా ఎప్పుడూ భయపడకు. ఇంతకు మించి ఇంకేమి చెప్పగలను? నువ్వు అమెరికా వెళ్ళగలిగి ఉంటే చాలా బాగుండేది. కానీ, ఇప్పుడు అది కూడా అసాధ్యంగా కనపడుతుంది.ధైర్యంగా ఉంటూ మెల్ల మెల్లగా చదువు సాగించు. ఏదైనా పని నేర్చుకోగలిగితే బాగుంటుంది. అయితే, ఏది చేసినా నాన్నగారి సలహాతోనే చేయి. సాధ్యమయినంత వరకు అందరూ ప్రేమాభిమానాలు కలిగి ఉండండి. ఇంతకంటే ఏమి చెప్పమంటావు?

ఇప్పుడు నీ హృదయంలో దుఃఖ సాగరం ఘోరమైక ఏహాహాకారం చేస్తూ ఉందని నాకు తెలుసు. నీ గురించి ఆలోచిస్తే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అయినా, ఏమి చేయగలం? ధైర్యం తెచ్చుకో తమ్ముడూ! ప్రియ సోదరా, జీవితం చాలా కఠోరమైంది. లోకం చాలా కూరమైంది. ప్రజలు కూడా చాలా నిర్దయులే. కేవలం ధైర్యం, ప్రేమ వీటి బలంతోనే జీవనయాత్ర సాగించడం వీలవుతుంది. తమ్ముడు కుర్తార్ చదువు గురించి కూడా నీవే ఆలోచించాలి మరి. నా మనస్సు సిగ్గుతో క్రుంగపోతున్నా బాధపడటం కంటే నేను చేయగలిగిందేముంది? దీనితో పాటు ఉన్న ఉత్తరం హిందీలో రాశాను. అది బీ.కే. సోదరికి ఇవ్వు. సరే మరి. నమస్తే. ప్రియ సోదరా, ఇదే నా వీడ్కోలు ... సెలవు
                                                                                                                                            నీ సోదరుడు,
                                                                                                                                             భగత్ సింగ్.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments