Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశానికి అంబేద్కర్ పిలుపు - megamindsindia

దేశానికి అంబేద్కర్ పిలుపు – అసెంబ్లీ లో చివరి ప్రసంగం: నవంబర్ 25, 1949 నాటి ప్రసంగం: నా మనసంతా భవిష్యత్తు భారతంతో నిండిఉంది. ప్రస్తుత...

దేశానికి అంబేద్కర్ పిలుపు – అసెంబ్లీ లో చివరి ప్రసంగం:
నవంబర్ 25, 1949 నాటి ప్రసంగం:
నా మనసంతా భవిష్యత్తు భారతంతో నిండిఉంది. ప్రస్తుతపు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ నాలోని కొన్ని భావాలను మీతో పంచుకుంటాను.  26 జనవరి 1950న భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ దేశంగా అవిర్భవిస్తుంది. ఈ దేశానికి వచ్చిన స్వాతంత్ర్యానికి ఏమి అవుతుంది? దేశం తన స్వాతంత్ర్యాన్ని నిలుపుకోగలదా, లేదా? ఇదీ నా మనసులోకి వచ్చే మొదటి ఆలోచన. భారత దేశం ఇంతకు ముందు స్వతంత్రంగా లేదు అని కాదు. ఇందులో గుర్తించాల్సిన అంశం ఏంటిది అంటే స్వతంత్రంగా ఉన్న దేశం తన స్వతంత్రాన్ని కోల్పోవడం. రెండవ సారి దాన్ని కోల్పోతుందా? ఈ ఆలోచనే నన్ను తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తుంది.  కాని నన్ను మరింత బాధకు గురి చేసే అంశం, స్వతంత్రంగా ఉన్న దేశం స్వాతంత్ర్యాన్ని కోల్పోవడం కాదు, కాని తన సొంత ప్రజల అవిశ్వాసం, విశ్వాస ఘాతక ధోరణి వలన కోల్పోవడం. మహమ్మద్ బిన్ ఖాసిం దురాక్రమణ సమయంలో దహర్ రాజు సైన్యంలోని అధికారులు మొహమ్మద్ బిన్ ఖాసిం ఇచ్చిన లంచాలు తీసుకొని తమ రాజు పక్షంలో నిలబడి యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించడం. భారత దేశంపై దండెత్తి  ప్రిథ్వి రాజ్ కు వ్యతిరేకంగా పోరాడమని మొహమ్మద్ ఘోరిని  ఆహ్వానించింది  జై చంద్, అందుకు తనతో పాటు మిగితా సోలంకి రాజులు  సైతం సహాకరిస్తామని వాగ్దానం చేయడం. హిందువులు విముక్తి కొరకు శివాజీ మొఘలులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే కొంత మంది మరాఠా పెద్దలు, రాజ్ పుత్ రాజులు మొఘలుల పక్షంలో నిలబడడం. సిక్కు పాలకులను అంతంచేయాలి అనే లక్ష్యంతో బ్రిటిష్ వారు పని చేస్తున్నపుడు, సిక్కుల ప్రధాన సేనాపతి అయిన గులాబ్ సింగ్ మౌనం దాల్చి సిక్కు రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేకపోవడం. 1857లో బ్రిటిష్ వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యుద్ధం ప్రకటిస్తే, సిక్కులు మాత్రం మౌనంగా ఉంటూ జరిగే సంఘటనల పట్ల ప్రేక్షక పాత్ర పోషించారు.
చరిత్ర పునరావృతమవుతుందా? ఈ ఆలోచనే నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. కులం, మతం అనే భావాలకు తోడుగా కొత్తగా ఏర్పడే రాజకీయ పార్టీలు ఆవిర్భావం, భిన్నమైన భావాలూ కలిగి ఉండే పార్టీలు స్థాపన వలన ఉత్పనమయ్యే వేర్పాటు భావాలను తలచుకుంటే నా ఆందోళన మరింత పెరుగుతుంది. భారతీయుడు దేశం కన్నా వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడా? లేదా మతానికన్న దేశానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడా. ఇది నాకు తెలియదు. ఒకవేళ పార్టీలు దేశానికన్నా తమ విశ్వాసాలకే అధిక ప్రాధాన్యమిస్తే, మన స్వాతంత్ర్యం రెండవసారి ప్రమాదంలో పడుతుంది. అంతేకాదు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విపత్కర పరిస్థితి రాకుండా ఉండటానికే మనమంతా జాగ్రత్తగా ఉండాలి. మన స్వాతంత్ర్యాన్ని రక్షించుకోవడానికి చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతామని దృడ నిశ్చయంతో ఉండాలి.
26 జనవరి 1950, నాటి నుండి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా రూపాంతరం చెందుతుంది, అంటే ఇప్పటి నుండి ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వ పాలన ఏర్పడుతుంది. ఇదే ఆలోచన నా మనసులోకి వస్తుంది. అప్పుడు దేశంలోని రాజ్యాంగానికి ఏమవుతుంది? దేశం తన రాజ్యాంగాన్ని తాను కాపాడుకోగలుగుతుందా, లేదా మరొకసారి కోల్పోతుందా. ఈ రెండో ఆలోచన నా మనసులోకి రాగానే మొదటి ఆలోచనలాగే నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశానికి కొత్త కాదు. ఒకప్పుడు దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆభరణాలుగా ఉండేవి, దాంతో పాటు రాజరికాలు కూడా ఉండేవి, అవి ఎన్నికోబడినవి లేదా పరిమితమైనవి. కాని అవి సంపూర్ణమైనవి కావు. పార్లమెంటరీ విధానం, వ్యవస్థ లాంటివి భారతదేశానికి తెలియని విషయాలు కాదు.  బౌద్ధ బిక్షువుల సంఘాల అధ్యాయనం ద్వారా మనకు వెలుగులోకి వచ్చేది, కేవలం పార్లమెంట్ కాదు- అప్పటి బౌద్ధ సంఘాలలో ఉన్నది పార్లమెంట్ వ్యవస్థనే, అప్పటి సంఘాలు నేటి కాలంలో పాటిస్తున్న అన్ని పార్లమెంట్ పద్ధతులు, నియమాలను పాటించేవి. ఏ వ్యక్తి ఏఏ స్థానాలలో కూర్చోవాలో, ఏ విధంగా విషయ ప్రస్తావన చేయాలి, తీర్మానాలు, ఎంతమంది చట్టబద్దంగా పాల్గొనాలి, విప్ అధికారాలు జారి చేయడం, ఓట్ల లెక్కింపు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు, ఆక్షేపణ, ప్రస్తావనలు, క్రమబద్దీకరించడం, ఉల్లఘించ వీలులేని కోర్టు ఉత్తర్వులు మొదలైనవి. ఇలాంటి పార్లమెంట్ పద్ధతులను బుద్దుడు తన సంఘ సమావేశాలలో పాటించడం జరిగింది.  అంటే బుద్దుడు తన సమయంలో దేశంలో అప్పటికే మనుగడలో ఉన్న రాజకీయ సమావేశాలలో నుండే ఈ పద్దతులను స్వీకరించి ఉండవచ్చు.
ఇలాంటి ప్రజాస్వామ్య వ్వవస్థను భారతదేశం కోల్పోయింది. మళ్ళీ రెండవసారి కోల్పోతుందా?నాకు తెలియదు. కాని భారత్ లాంటి దేశంలో ఇది సాధ్యం కావచ్చు- ఎందుకంటే చాలకాలం వరకు నిరుపయోగంగా ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ కొత్తగా కనపడవచ్చు- ఇదే ప్రజాస్వామ్యంలో ప్రమాదవశాత్తూ నిరకుశత్వానికి చోటు లభించవచ్చు. కొత్తగా జన్మించిన ప్రజాస్వామ్య వ్యవస్థ తనకు తాను నిలుపుకొనే శక్తి ఉంటుంది, కాని నిరంకుశ వ్యవస్థకు కూడా చోటు లభించే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక సత్యం. ఒకవేళ ఇందులో కొద్దిగా మార్పు జరిగితే, రెండవ అవకాశమే నిజమైన ప్రమాదంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మనం ప్రజాస్వామ్య వ్యవస్థను కేవలం ఒక స్వరూపంగా కాకుండా లేదా ఒక నిజవ్యవస్థలాగా నిలుపుకోవడానికి మనం ఏమి చేయాలి? అతి త్వరగా రాజ్యంగపరంగా సామజిక, ఆర్థిక లక్ష్యాలను కల్పించడం అనేది  మనం మొదట చేయాలి. రాజ్యాంగపరంగా సామజిక ఆర్థిక సమానత్వం సాధించడానికి ఎలాంటి అవకాశం లేనపుడు, రాజ్యాంగేతర పద్ధతులకు సమర్ధన ఎక్కవగా ఉండే అవకాశం ఉంటుంది. కాని ఎప్పుడు అయితే రాజ్యాంగ పద్దతులు అందుబాటులో ఉంటాయో, అప్పుడు రాజ్యగేంతర పద్ధతులకు మద్దతు లభించదు. ఈ రాజ్యాంగేతర పద్దతులు అరాచకత్వానికి (Grammer of Anarchy) దారితీస్తాయి కాబట్టి వీటిని సాధ్యమైనంత త్వరగా వదిలివేయడమే మనకు శ్రేయస్కరం.
మనం చేయవలసిన రెండవ పని, జాన్ స్టువర్ట్ మిల్ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికి చేసిన హెచ్చరికను గమనించాలి. ఏనాటికి కూడా మనం ”మన స్వాతంత్ర్యాన్ని ఒక గొప్పవ్యక్తి పాదాల దగ్గర దాసోహం చేయడం, మన పూర్తి విశ్వాసం కలిగి ఆతను ఆ అధికారంతో వ్యవస్థలను తప్పుదోవ పట్టించడం వంటివి కాకుండా చూసుకోవాలి”. ఒక గొప్ప వ్యక్తి దేశం పట్ల జీవితాంతం చేసిన సేవలకు కృతజ్ఞత కలిగి ఉండడంలో తప్పులేదు. కాని దానికి కూడా హద్దులు ఉంటాయి. డేనియల్ ఓ కన్నల్ అనే ఐర్లాండ్ దేశభక్తుడు చెప్పినట్టు, ఏ వ్యక్తి కూడా తన ఆత్మ గౌరవాన్ని కోల్పోయి గొప్ప వ్యక్తి కాలేడు, ఏ మహిళా కూడా తన శీలాన్ని కోల్పోయి గొప్పగా గుర్తించబడదు, దేశం కూడా తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయి గొప్ప దేశంగా గుర్తించబడదు. ఈ హెచ్చరిక ఇతర దేశాల కన్నా మన దేశానికి చాలా  ముఖ్యమైనది. మన దేశంలో, భక్తి లేదా వ్యక్తి ఆరాధన అనేది వేరే ఏ ఇతర దేశాలలో లేని విధంగా మన రాజకీయాలను ఎక్కువ ప్రభావం చూపగలుగుతుంది. మతపరమైన భక్తి మోక్షానికి మార్గం చూపేది కావచ్చు. కాని రాజకీయాలలో, భక్తి లేదా వ్యక్తి ఆరాధన అనేవి పతన దిశకు తద్వారా నిరంకుశ ప్రభుత్వాలకు దారితీస్తాయి.
మూడవది మనం కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం వరకే పరిమితం కాకూడదు. మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామజిక ప్రజాస్వామ్యంలా అన్వయించుకోవాలి. సామజిక ప్రజాస్వామ్యం అనే భూమిక లేనంతవరకు రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడలేదు. సామజిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఇది ఒక జీవన విధానం- స్వేఛ్చ, సమానత్వం, సోదరభావం అనే మౌలిక సూత్రాలు కలిగి ఉండడం. ఈ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే వాటిని జీవితంలో మౌలిక సూత్రాలుగా కలిగి ఉండడం. ఈ మూడింటిలో స్వేఛ్చ, సమానత్వం, సోదరభావం అనే వాటిని విడివిడిగా పరిగణించలేము. ఈ మూడింటిలోని ఏ ఒక్క దానిని కూడా విడదీసి చూసిన మొత్తం ప్రజాస్వామ్యం అనే భావానికే  ముప్పు వాటిల్లుతుంది. స్వేచ్ఛ నుండి సమానత్వాన్ని, సమానత్వం నుండి స్వేచ్ఛను విడదీయలేము. అదే విధంగా స్వేచ్ఛ, సమానత్వం అనే వాటి నుండి సోదర భావాన్ని వేరు చేయలేము. సమానత్వం లేకపోతే, స్వేచ్ఛ వలన కొంతమందికి బహుసంఖ్యాకుల మీద ఆధిపత్యానికి దారి తీయవచ్చు. స్వేఛ్చ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సోదరభావం లేకపోతే స్వేఛ్చ, సమానత్వం అనేవి సహజంగా నిలువలేవు. వాటిని అమలు చేయడానికి ఒక బలం అవసరం అవుతుంది.
మన భారతీయ సమాజంలో రెండు అంశాలు పూర్తిగా లోపించినవి అని అంగీకరించాలి. అందులో ఒకటి సమానత్వం.  సమాజ స్థాయిలో మన దేశంలో సామజిక వ్యవస్థలోనే ఒక సమానత్వంలేని మౌలిక, సూత్రపాయమైన వ్యవస్థ ఉంది. అందులో కొంతమంది వద్ద అపారమైన సంపద, మిగిలినవారు దుర్బరమైన దారిద్ర్యంలో ఉన్న సమాజం కూడా ఉన్నది. 26 జనవరి 1950 నాడు, మనమందరం వివిధ వైరుద్యాలు కలిగిన జీవన శైలిలోకి ప్రవేశించబోతున్నాము. రాజకీయపరంగా అందరు సమానమే, కాని సామజిక, ఆర్థికపరంగా సమానత్వం లేని వాళ్ళం. మన సామజిక ఆర్థిక జీవన విధానంలో, ఒకరి సామజిక ఆర్థిక పరిస్థితి కారణంగా ఒక మనిషికి ఒకే విలువ అని గుర్తించడానికి నిరాకరిస్తూ కొనసాగుతున్నాము. మనం ఇంకెంతకాలం ఈ వైరుధ్యాలు కలిగిన జీవనాన్ని కొనసాగిద్దాము? ఇంకెంతకాలం మన జీవితాలలో సామజిక, ఆర్థిక సమానత్వాన్ని నిరాకరిస్తూ ఉందాము? దీర్ఘకాలం వరకు ఈ నిరాకరణ కొనసాగిస్తూ పోతే, మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనమే ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతాము. ఈ వైరుధ్యాలను మనం సాధ్యమైనంత త్వరగా తొలగించాలి.
మనం ఆశించే రెండవ అంశం సైద్ధాంతిక పూరితమైన సోదరభావాన్ని గుర్తించడం. అసలు సోదరభావం అంటే ఏమిటి. సోదరభావం అంటే భారతీయులందరూ ఒకటే అనే ఉమ్మడి భావన కలిగి ఉండడం. అంటే భారతీయులందరి మద్య ఉన్న సోదరభావం ఒకటే అని అనడం.  సామాజిక జీవితంలో ఐక్యత మరియు సంఘీభావం ఇస్తున్న సైద్ధాంతిక భావనే ఇది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments