డిసెంబర్ తర్వాత ఏమొస్తుంది?.. జనవరి.. అంతే కదా..మరి 31వ తేదీ తర్వాత?.. మళ్లీ 1వ తేదీతో కొత్త నెల.. అలాగే క్యాలెండర్ మారిపోతుంది అంతే.. ఇ...
డిసెంబర్ తర్వాత ఏమొస్తుంది?.. జనవరి.. అంతే కదా..మరి 31వ తేదీ తర్వాత?.. మళ్లీ 1వ తేదీతో కొత్త నెల.. అలాగే క్యాలెండర్ మారిపోతుంది అంతే..
ఇంత మాత్రానికే హడావుడి ఎందుకు?.. జనవరి 1 మనకు పండుగ కాదు.. క్యాలెండర్ మార్పును మాత్రమే.. న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేసుకుంటే, ఎంజాయ్ చేస్తే తప్పు ఏమిటి అంటారా?.. అది మీ ఇష్టం.. కేక్ కట్ చేసుకుంటారో, మందు కొడతారో, డాన్సులు చేస్తారో చేసుకోండి..
కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకండి.. పెద్ద సౌండ్ పెట్టి, వెర్రి కేకలు వేసి నిద్రపోయే వారిని ఇబ్బంది పెట్టకండి.. తాగిన మైకంలో రోడ్ల మీద అడ్డగోలు వేగంతో వాహనాలు నడపకండి.. మీ చావు మీరు చేస్తే ఎవరికి నష్టం లేకపోవచ్చు.. కానీ మీ పిచ్చ ఆనందం కోసం ఎదుటి వారి ప్రాణం తీసే స్వేచ్ఛ మీకు లేదు.. ఒక సనాతన ధర్మ విశ్వాసకునిగా, తెలుగు వాడిగా నేను ఉగాదిని సంవత్సరాదిగా జరుపుకుంటాను.. ఆ రోజే పండుగ చేసుకుంటాను..
చివరగా క్యాలండర్ మార్పు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..
మరికొంత సమాచారం
జనవరి 1 కొత్త సంవత్సరం కాదు ! నిజమే ! కానీ మన జీతాలు భత్యాలు దేశబడ్జెట్లు ,మన date of birth లు మన రిటైర్మెంట్ తేదీలు,నియామకతేదీలు మన దస్తావేజులు అన్నీ ఆ క్యాలెండర్ తోటే కదా ముడిపడి ఉన్నాయి .
.
నిజమే ఆ తేదీకి ప్రకృతిలోని మార్పులకు ,ఖగోళానికి ఏ సంబంధమూ లేదనే మాట నిజమే !
.
కానీ ఆ తారీఖులు మన దస్తావేజులన్నిటా నిండి ఉన్నాయి !
...
రాబోయే క్యాలెండర్ సంవత్సరం మంచి జరగాలని కోరుకుని శుభాకాంక్షలు చెపితే తప్పేమిటి ? అడిగాడొక బాలమిత్రుడు అనగా వయసులో చాలా చిన్నవాడు .
...
తప్పులేదు కానీ అది మనము ఒకరిని అనుకరిస్తూ చేసేటటువంటిది. ఆ అనుకరణ శాస్త్రీయమైన విషయాలలోనైతే అభ్యంతరం లేదు !
..
ఏ శాస్త్రీయ ప్రాతిపదిక లేనిదానిని కేవలం బ్రిటిష్ వాడు మనమీద వదిలిన బానిసచిహ్నాన్ని మనమింకా ధరించడంలో ఔచిత్యమున్నదా ?
...
మరి ప్రపంచమంతా అనుసరిస్తున్నది కదా ?
...
Yes !
ప్రపంచంలో చాలాభాగం ఒకప్పుడు వారికి బానిసరాజ్యాలు కాబట్టి అవి వారు నడిపారు అప్పుడు నడిచింది
..
...స్వాతంత్ర్యం వచ్చినది అని చెప్పుకునే మనము వారి మతాన్ని వదలలేదు, వారి పద్ధతులు, వదలలేదు వారి భాషను వదలలేదు !
..
ఏదీ మనది కాదు !
..
మాతృభాషలో విద్యాబోధన చిన్నతనం నేడు !
..
గుడికి వెళ్ళితే పెదవులవద్దకు, గుండెవద్దకు నుదురువద్దకు చేయి తీసుకెళ్ళి వారి పద్ధతిలో దేవుడికి అభివాదం చేస్తున్నాము. మన నమస్కారం మనసాష్టాంగ ప్రణామము ఏమయ్యింది ?
..
చక్కగా క్రింద కూర్చొని విస్తట్లో చేసే భోజనం స్థానంలో టేబుళ్ళు, ఎంగిలి కంచాలు ! ఏది శాస్త్రీయం ?
...
ఇల్ల కూడా రూపు మారింది BHK లు వచ్చాయి ! అన్నీ పడకగదులే ! తినటం పడుకోవడమే ఇంట్లో చేసేది అనే భావన రావడం లేదా ? BHK తో పాటు M ఎందుకు లేదు ?
Bedrooms hall kitchen తో పాటు Meditation room లేదా Worship room పూజగది ఎక్కడికి పోయింది ? పడకగదికే ప్రాధాన్యం !!
...
అంతా IMITATION !
..
IMITATION IS NOT BAD BUT NOT AT THE COST OF ORIGINALITY !!
...
ఆ తేదీ మీద, సెలబ్రేషన్స్ మీద కోపం లేదు ! తను ఏమిటో తన శాస్త్రీయ జీవనం ఏమిటో మరచిపోయిన భారతీయుడి మీద నిజంగా జాలి మాత్రమే !
..
Scientific గా హిమాలయ శిఖరం మీద ఉన్న భారతీయుడు రాళ్ళగుట్ట ఎక్కి ఓహ్ ఇది చాలా ఎత్తు అంటే జాలివేయదూ !!!.... ఊటుకూరు జానకిరామారావు
No comments