Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బటాలిక్ ను మనకు దక్కించిన సోనమ్ వాంగ్ ఛుక్

1999 కార్గిల్ యుద్ధం ప్రారంభమైన రోజులవి. లదాఖ్ స్కౌట్స్ కి చెందిన మేజర్ సోనమ్ వాంగ్ చుక్ సెలవుపై ఉన్నాడు. సొంత ఊరు ఖాఖ్శాల్లో కొడ...

1999 కార్గిల్ యుద్ధం ప్రారంభమైన రోజులవి. లదాఖ్ స్కౌట్స్ కి చెందిన మేజర్ సోనమ్ వాంగ్ చుక్ సెలవుపై ఉన్నాడు. సొంత ఊరు ఖాఖ్శాల్లో కొడుకు దిగ్యాల్తో ఆడుకుంటున్నాడు. అప్పుడే ఆయనకు పిలుపు వచ్చింది. తక్షణం సైనిక స్థావరంలో రిపోర్టు చేయాలని. మేజర్ సోనమ్ కొద్ది గంటల్లోనే హందన్ బ్రాక్ పోస్టు చేరుకున్నాడు.

ఆ పోస్టు బటాలిక్ సెక్షంలోని బోర్బతిలా వద్ద ఉంది. ఆయనకు, మరో 30 మంది సైనికులకు అధికారులు ఇటాలిక్ సెక్టర్లోని శత్రువును పారద్రోలమని ఆదేశాలిచ్చారు. మర ఫిరంగులు లేవు, శతఘ్నులు లేవు. కానీ తన పటాలాన్ని తీసుకుని మేజర్ సోనమ్ బయలుదేరాడు. ఆ ప్రాంతమంతా ఆయనకు కొట్టిన పిండి, మంచుకొండల్లో మంచు పులిలా తిరుగాడేంత సాహసం ఉంది. తన దళాన్ని తీసుకుని సోనమ్ కొండ ఎక్కడం ప్రారంభించాడు. కొంత ఎత్తుమీదకి వెళ్లగానే శత్రువు శతఘ్నులతో దాడి ప్రారంభించాడు. తొలి దెబ్బకే ఒక జవాను చనిపోయాడు. తన బృందంలోని మరో సైనికుడికి ఆ అమరజవాన్ పారివ దేహం సావరానికి తీసుకెళ్లమని ఆదేశించి, ముందుకు సాగాడు.
మంచుకొండల మాటున శత్రువు తూటాలు, శతఘ్నులను తప్పించుకుంటూ ముందుకు సాగాడు సోనమ్. ఎముకలు గడ్డకట్టించే చలి. ఒక్క తప్పటడుగు వేసినా అగాథాల లోతుల్లోకి జారిపోతారు. అంత ప్రమాదం ఉన్నా సోనమ్, ఆయన బృందం ముందుకే సాగింది. తమ వద్ద ఉన్న మందుగుండును పూర్తిగా ఖర్చు చేయకుండా, సోనమ్ శత్రువుకన్నా ఎత్తైన ప్రదేశానికి చేరుకుని, తన దళంతో కొండరాళ్లను కిందకి దొర్లించడం ప్రారంభించాడు. ఆ రాళ్లు శత్రువుల స్థావరంపై పడటంతో వారిలో గగ్గోలు మొదలైంది.
అదే సమయంలో కొందరు శత్రువులు వీరి వైపు ఎగబ్రాకసాగారు. వారిపై మెరుపుదాడి చేశాడు. సోనమ్, నలుగురు చొరబాటు దారులు పిట్టల్లా రాలిపోయారు. వారి మెషీన్ గన్లు, మందుగుండు, ఆహార పదార్దాలు చేజిక్కించుకున్నాడు. ఆ మరుసటి రోజు శత్రువు లక్ష్యమైన చోర్బత్లా వద్దకు చేరుకున్నాడు. పద్దెనిమిది వేల అడుగుల ఎత్తున ఉన్న బెటాలిక్ సెక్టర్ ను తిరిగి కైవసం చేసుకున్నాడు. ఐటాలిక్ కొండల్లో కికి సోసోలారగ్యాలో (దేవతలదే విజయం) అన్న లడాఖీ స్కౌట్స్ నినాదం మార్మోగింది. కార్గిల్ యుదంలో మనం సాధించిన తొలి విజయం అది. బటాలిక్ చేజిక్కిందన్న వార్త మన సైన్యానికి ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చింది.

ఆ ఉత్సాహంతోనే మన సేనలు అన్ని చోట్లా శత్రువులను తరిమి, ఆక్రమిత మాతృభూమిని విముక్తం చేసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాయి. ఆ తరువాత వారం రోజుల పాటు కింద నుంచి సహాయం వచ్చే వరకూ మంచుకొండల్లోనే సోనమ్ వాంగ్ ఛుక్, ఆయన దళం పహారా కాశాయి. శత్రువు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఐటాలికను చేజిక్కించుకోలేకపోయాడు. - హాంగ్ ఛుక్ చూపిన అసమాన ధైర్య సాహసాలు, దేశభక్తి, పోరాట పటిమను స్వయంగా అప్పటి సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ వేర్ ప్రకాశ్ మాలిక్ ప్రశంసించారు.
శత్రువు ఫిరంగీ దాడుల మధ్య అత్యంత దుర్గమ యుద్ద భూమిలో మేజర్ సోనమ్ చాంగ్ చుక్ చూపిన వీరోచిత ఆదరం చూసి భారత ప్రభుత్వం ఆయనకు మహావీర చక్రను ప్రదానం చేసింది. సోనమ్ హంగ్ చుక్ వంటి ఎందరెందరో వీరుల త్యాగఫలమే జమ్మూ కశీను కాపాడింది. లడాఖ్ ప్రాంతంలో సోనమ్ వాంగ్ ఛుక్ పేరు చెప్పగానే అందరూ విద్యుచురితమౌతారు. సైన్యంలో వాంగ్ చుక్ వీరోచిత పోరాటాన్ని కథలు కథలుగా చెప్పుకుంటారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments