తమ్ముడు కుల్దార్ పేర తన ఆఖరు ఉత్తరం ఆయన ఇలా రాశాడు : ...
తమ్ముడు కుల్దార్ పేర తన ఆఖరు ఉత్తరం ఆయన ఇలా రాశాడు:
సెంట్రల్ జైలు,
లాహోర్ 31 మార్చి 1931.
ప్రియమైన కుల్దార్ కు,
ప్రియమైన కుల్దార్ కు,
ఈ రోజు నీకళ్ళల్లో నీళ్లు చూసి చాలా భాద పడ్డాను. ఈ రోజు నీ మాటల్లో ఎంత ఆవేదన కనిపించింది! నేను నీ కళ్ళ వైపు చూడలేకపోయాను. చిరంజీవీ! నీవు ధైర్యంగా ఉండాలి. బాగా చదువుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్దగా ఉండాలి. గుండె నిబ్బరం తెచ్చుకోవాలి. ఇంకా ఏమి రాయమంటావు?
అత్యాచారాలు చేయడానికి కొత్త మార్గాలేమిటా అని యోచిస్తూ ఉంటాడు వాడు. వాని చేష్టల హద్దులేమిటో చూడాలని సరదా పడతాం మేము. ప్రపంచంపై కోపమెందుకు? దైవాన్ని నిందించడం దేనికి? లోకమంతా శత్రువైనా రండి ఎదిరిద్దాం, పోరాడదాం. జీవించేది కొద్ది ఘడియలే, ప్రియ సోదరా ఇక, తెల్లవారిన తర్వాతి దీపాన్ని నేను, ఆరిపోబోతున్నానిక ఇక పై నాచుట్టూ గాలిలో వ్యాపించి ఉంటుంది చింతనా విద్యుత్తు నశ్వరమౌ ఈ పిడికెడు మట్టి ఉన్న నేమి? లేకున్న నేమి? మరి శెలవు దేశ సౌభాగ్యమా! సంతోషంగా ఉండు ఇకమేము మా ప్రయాణం సాగిస్తాం, ధైర్యంగా ఉండు. నమస్తే!
నీ సోదరుడు భగత్ సింగ్.
No comments