మాడిలిన్ హెర్మన్ డిబ్లాక్ ఎన్నో సేవాసంస్థలను నిర్వహిస్తున్నా, 1982లో , స్థాపించిన సెల్వనిలయం పిల్లలకు విద్య, వసతి సౌకర్యాలు కల్పిస...
మాడిలిన్ హెర్మన్ డిబ్లాక్ ఎన్నో సేవాసంస్థలను నిర్వహిస్తున్నా, 1982లో , స్థాపించిన సెల్వనిలయం పిల్లలకు విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నది. 1995లో ప్రారంభించిన “శక్తివిహార్" నర్సరీ కిండర్ గార్టెన్లు ఉన్నాయి, వీటితో పాటు నిరాశ్రయులకోసం 2000లో అమైందీ ఇల్లామ్ అనే గృహం ప్రారంభించింది. ఇవన్నీ ఉప్పాళంలో ఉన్నాయి.
దుబ్రాయ పేటలోని శాంతి వర్క్ షాప్ అనే చిన్నతరహా తయారీ కేంద్రం, కాటన్ దుస్తులు తయారు చేస్తుంది. ఇందులో కుష్టువ్యాధి విముక్తులైన 150 మంది స్త్రీ, పురుషులు, పురుషుల దుస్తులు, సంచులు, యాప్రాన్లు, టేబుల్ క్లాత్లు తయారు చేస్తున్నారు. ఇందులోని కార్మికుల పిల్లలకు యూనిఫారం, స్కూల్ ఫీజులు, ఆహారం, వైద్యపరమైన సాయం అందిస్తున్నారు. వీరి సంస్థలన్నింటిలో పెద్దది తుట్టపాక్కంలో ఉంది, ఇక్కడ పెద్ద వ్యవసాయక్షేత్రం ఉంది, 1968 లో 9 ఎకరాల స్వంత క్షేత్రంతోపాటు ప్రభుత్వంవారు లీజుకిచ్చిన 8 ఎకరాల భూమితో ప్రారంభమైన ఈ సంస్థ తుట్టిపాకుల వ్యవసాయ ప్రాజెక్టుగా పేరుగాంచింది.
ఇక్కడ ప్రస్తుతం ఒక సువిశాలక్షేత్రంలో వరి, వేరుశనగ, కర్రపెండలం, అరటి మొదలైనవేగాక, ఔషధ మొక్కలు, అలంకరణ మొక్కలు పెంచుతున్నారు. దీనికి అనుబంధంగా పాడిపరిశ్రమ, కోళ్ళఫారాలు ఉన్నాయి. ఇక్కడి వార్షిక ఉత్పత్తి 34 టన్నుల బియ్యం, 7 టన్నుల అరటి, సుమారు 18 వేల కొబ్బరికాయలు, 143 కిలోల కర్రపెండలం, 570 లీటర్లపాలు, 4500 కిలోల లైవ్ చికెన్, 475 కిలోల మామిడికాయలు ఇంకా సరుగుడు, ఔషధులు, అలంకరణ మొక్కలు ఉన్నాయి.
ఇక్కడ వేసవిలో చిన్నపిల్లలకు శిక్షణ శిబిరాలు నడుపుతున్నారు. పిల్లలకోసం "సూర్యకేంద్రం” అనే ఆశ్రమం ఉంది. ఇందులో 20 మంది పిల్లలకు ఆశ్రయమిచ్చారు. ఈ కార్యకలాపాలన్నిటికీ ఫ్రాన్స్ బెల్జియంలలోని సంస్థల నుంచి ఆర్థిక సహాయం అందుతున్నది.
మాడిలిన్ హెర్మన్ డిబ్లాక్ మొదటగా 2013 మే నెలలో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి లీజిలిన్ పురస్కారం అందుకుంది. అదే ఏడాది సెప్టెంబరులో బెల్జియం రాజునుంచి ఆఫీసర్ ఆర్డర్ ఆఫ్ది క్రౌన్ అనే పురస్కారం పొందింది. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునివ్వగా అదే సంవత్సరం పుదుచ్చేరి ప్రభుత్వం స్వాతంత్ర్యదిన పురస్కారాన్నివ్వడంతో ఈ గౌరవం పొందిన తొలి మహిళగా ఆమె కీర్తికెక్కింది. 1970లోనే ఆమె డాక్టర్ స్విట్జర్ అవార్డును పొందింది.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
No comments